pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
అఖిలాశ
16 जानेवारी 2018

అఖిలాశ

రచయిత ; తక్కెడశిల జాని బాషా చరణ్

ఏదైనా కవిత వ్రాయాలంటే మనసు స్పందించాలి.ఆ కవిత పూల జల్లులా , మృదువుగా , వినసొంపుగా ఉంటే ఇంకా బావుంటుంది.జాని భాషా చరణ్ వ్రాసిన కవితలు ఆ మృదుభావాన్ని పలికిస్తాయి.అఖిలాష ప్రాంభమే ఓ కన్నెపిల్ల జీవితంలోని మధురఘట్టమైన పెళ్ళికూతురు తో ప్రారంభమవుతుంది.ప్రతి కన్నెపిల్ల మదిలోని ఊహలను అతి మధురంగా తెలుపుతుంది.ఆ మధురమైన ఊహ అలా అలా తేలిపోతూ,మాంగల్యబంధమై,ఓ శ్రావణమేఘమై, వెన్నెలలో , ప్రియసఖియై,అమ్మతనమును సంతరించుకొని, చిన్నారి పాపై, హాయి హాయి గా తేలిపోతుంది మనసు.అమ్మే కాదు నాన్న కూడా ముఖ్యమే " ఏనుగై మోసేను నీ బరువు, రక్త బిందువులు చిందించి కష్టపడెను నీ కొరకు అని హెచ్చరిస్తుంది.ఏది శాశ్వతము అంటూ వేదాంతమూ బోధిస్తుంది.రూపాయి మీద వ్యామోహము వలదూ అంటుంది.వీర సైనికుడి గొప్పతనమూ వివరిస్తుంది.అక్కడక్కడ శృగారమూ కనిపిస్తుంది.ఇలా రకరకాల భావాలను తన కవితలల్లో కురిపించారు, తక్కెడశిల జానీ భాషా చరణ్.చక్కని సరళమైన భాష లో, మృదుమధురంగా కవితలను పలికించారు జాని.51 కవితలూ ఆసక్తిగా చదివిస్తాయి.

నాకు ఇన్ని రోజులు అమ్మాయిలే సున్నితమైన భావాలను కలిగి ఉంటారు అనే ఫీలింగ్ ఉండేది. కాని జానీ గారి కవితలు చదివాక ఓ అబ్బాయి కూడా ఇంత సున్నితంగా ఉంటాడా అని ఆశ్చర్యం కలిగింది.చిన్న వయసులోనే ఇంత చక్కని కవిత లు వ్రాసిన తక్కెడశిల జానీ బాషా చరణ్ గారితో ఓ చిన్న సంభాషణ.

 

జానీ భాషా చరణ్ గారు మీ కవితలు చదివాను.అన్నీ చాలా బాగున్నాయి.అవి చదివాక కొన్ని ప్రశ్నలు మిమ్మలిని అడగాలని ఉంది.మీకు అభ్యంతరము లేక పోతే అడుగుతాను.  మీరు ముందుగానే "అఖిలాష " అంటే ఏమిటో చెప్పనన్నారు కాబట్టి దాని గురించి అడగను.

1.ముందుగానే పర్సనల్ ప్రశ్న అడుగుతున్నందుకు క్షమించండి.మీ పేరు చూస్తే మీరు ముస్లిం లా ఉన్నారు.ఇంత బాగా మీకు తెలుగు ఎలా వచ్చింది? ఇంత చక్కని కవిత్వం ఎలా వ్రాయగలిగారు?

నా పేరు జాని.బాష.చరణ్ అండి మా అమ్మ గారు నేను పుట్టినప్పుడే అలా పెట్టారు కాని జాని అనే పెరుతోనే ఎక్కువ మంది పిలుస్తారు సాహిత్యంలోకి వచ్చాక జాని.బాష.చరణ్.తక్కెడశిల పేరు బయట పడింది.ఈ మధ్య చాల మంది అఖిలాశ అని కూడా పిలుస్తున్నారు చిన్నప్పటి నుండి తెలుగు అంటే ప్రాణం ఒక్క తెలుగే కాదు హిందీ,ఇంగ్లిష్ అన్న చాల ఇష్టం ఉర్దూ మాట్లాడగల్గుతాను.మా అమ్మ గారికి కుల మత భేదాలు లేవు అందుకే నాకు ఆ పేరు పెట్టారు అలానే పెంచారు..నాది మనిషి కులము అండి.

నేను : మీ జవాబు బాగుంది. మీరు చెప్పింది వింటుంటే మా సంగతి గుర్తొచ్చింది.మావారి ని అందరూ మీరు నార్త్ ఇండియన్ నా? సౌత్ ఇండియన్ నా అని అడిగేవారు ఆయన పేరు ను బట్టి.ఆయన ఐయాం ఆన్ ఇండియన్ అనేవారు.ఈ మధ్య మీరు తెలంగాణానా , ఆంధ్రానా అని అడుగుతున్నారు. దానికి నేను వీర జవాన్ ను,నాకా బేధం లేదు అని చెపుతున్నారు.మా పిల్లలకు ఇంటర్ లో జాయిన్ అయ్యే వరకూ వాళ్ళ కులం ఏదో తెలీదు.అది కూడా ఎడ్మిషన్ ఫాం లో వ్రాయాల్సి వచ్చి తెలిసింది.ఐనా నేను మిమ్మలిని మీ భాష, పేరు ను బట్టి అడిగాను, సారీ.

2.మీరు సాహిత్యం బాగా చదువుతారా ?సాహిత్యంలో ఎవరి రచనలు ఇష్టం? ఏందుకు? ఏవరి సాహిత్యం ఎక్కువ చదివారు? వాటిలొ ఏది బాగా నచ్చింది?

సాహిత్యం ఎక్కువ చదవాను కాకపొతే నా పదవ తరగతి అయిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను ఇంటర్మీడియట్ కాస్త దూరంగా వేసారు నేను హోం సిక్ వల్ల తిరిగి వచ్చేసాను దానితో ఒక్క సంవత్సరం వృద్ధ అయినది.అప్పుడు మా అమ్మ గారు నన్ను కంప్యూటర్ క్లాస్ లో చేరిపించారు..ఇంట్లో ఉన్నప్పుడు రామాయణం,మహాభారతం ఇలా అన్ని పురాణాలు చదివాను ఖురాన్ కూడా చదివాను ఒక్క బైబిల్ తప్ప.సాహిత్యం అంటే ఎవరైనా వారు రాసిన పుస్తకం నాకు స్వయంగా అందిస్తే వెంటనే చదివి వారికీ ఫోన్ చేసి మరి నా సమీక్షా తెలియజేస్తాను.

3.ఫ్రాచీన సాహిత్యం చదివారా? ఆన్ని అధునికమెనవేనా ?

అన్ని పురాణాలు చదివాను..సాహిత్యం అసలు చదవలేదు.

4.కవితలు , కథలు, నవలలు  వీటిల్లో ఏది మీకు నచ్చుతుంది?

నేను సాహిత్య పక్రియ కన్నా భావానికి విలువ ఇస్తాను..కావున అన్ని ఇష్టమే కాని రచయిత సంకెళ్ళు వేసే పక్రియలు ఇష్టం ఉండదు దానికి నేను పూర్తీ వ్యతిరేకిని.

5.ఈప్పుడు రాస్థున్న కవులు కవయిత్రులు ఎలా రాస్తున్నారంటారు?

దీని పై నేను ఒక కవిత కూడా రాసాను కరములో కలం ఉన్న ప్రతి వారు కవి కాలేరు తురంగంలో భావాలు లావలై రావాలి అప్పుడే మంచి కవి లేదా రచయిత అవుతారు..పది లైన్స్ రాసిన ప్రతి వారు కవి కారు కాలేరు..!!

6.ఇంకా ఎలాంటి రచనలు రావాలి అనుకుంటున్నారు?

మన తెలుగు సాహిత్యంలో చాల కొత్త పక్రియలు వస్తున్నాయి నేను కూడా నా మూడవ పుస్తకంతో  ఒక్క కొత్త పక్రియ తెస్తున్న కాని మన తెలుగు సాహిత్యం ఇతర బాషలలోకి అనువాదం అవ్వడం లేదు ఇది నా మనసును కలచి వేస్తూ ఉంటుంది.మన తెలుగు సాహిత్యం అన్ని ప్రాంతీయ మరియు విదేశీ బాషలలోకి అనువాదం అవ్వాలి అదే నా చిరకాల కోరిక..!!

7.ట్రెండ్స్- వాదాలు గురించి ఎమనుకుంటున్నారు?

ఈ వాదాల పై కూడా ఒక కవిత రాసా నా రెండవ కవిత సంపుటిలో వస్తుంది ఆ కవిత..మనిషి తన అవసరాన్ని బట్టి తన వాదాన్ని మారుస్తాడు ఈనాడు కవి కూడా అంతే కేవలం స్త్రీ వాద కవిత్వం రాసి నేను కవిని అంటే ఒప్పుకోను నేను..కవి ప్రతి దానిపై స్పందించి అన్ని విధాలుగా రాయాలి అప్పుడే పరిపూర్ణుడు అవ్వగలడు..

8.మీ కవితలు ఎక్కువగా స్త్రీల గురించిన వే ఉన్నాయి.దాని బట్టి మీరు స్త్రీ వాది లా వున్నారు అనిపిస్తోంది :) ఏందుకు స్త్రీల సమస్యలు ఎన్నుకున్నారు?

లేదు లేదు నేను స్త్రీ వాదిని కాదు అలాగని పురుష వాదిని కాదు అన్నింటిపై కవితలు రాస్తాను నేను మీరు పుస్తకాన్ని ఒక్కసారి గమనిస్తే ఆ పుస్తకం ఒక థీమ్ ప్రకారం కవితలు ఉంటాయి పెళ్ళికూతురు మాంగల్యం ప్రేమ ఇలా ఒక ఫ్లో అంటే రెండవ కవిత సంపుటి విప్లవ సూర్యుడు అన్ని విప్లవ కవితలే ఉంటాయి ఒక్కో పుస్తకానికి ఒక్క థీమ్ అనుకోని చేస్తున్న అంతే..!!

9.మైనారిటీ  స్త్రీవాదం అంటే ఎమిటి ? దాని గురించి మీరు ఏమైనా రాసారా ?

నేను ఇప్పటి వరకు స్త్రీ సమస్యల పై చాల కవితలు రాసాను కాని మైనార్టీ స్త్రీ సమస్యల పై కొంత మంది కవితలు,కథలు రాయమన్నారు కాని నేను రాయలేదు..నాకు అలా ఇష్టం ఉండదు కూడా సమాజంలో కేవలం మైనార్టీ స్త్రీ మాత్రమే కష్టాలు పడటం లేదు అందరు పడుతున్నారు అందరి గురించి రాయాలి అంతే గాని ఒక వాదం గురించే రాయడం ఇష్టం ఉండదు.ఒక వేల రాసిన ఆ మైనార్టీ సమస్యల పై రాయాలి కాని వేరే వాదాలను కించపరుస్తూ రాయడం బాగుండదు.

10.ఈ వాదం అవసరం, ఉపయోగం ఏమిటి? ఈ వాదం మీద రాస్తున్న రచయతలు  ఎవరు?

చాల మందిని గమనించాను కొన్ని వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి మైనార్టీ వాదలపై ఏ వాదమైన మనమంతా మానవత వాదంలో నడిస్తే అన్ని సమస్యలు తీరుతాయి.

11.ఈ తరం వాళ్ళు తెలుగు చదవటం లేదు అంటున్నారు.కాని అంతర్జాల పత్రికలు ఎక్కువగా వస్తున్నాయి.అవి నిర్వహిస్తున్నవారు కూడా చాలా మంది యువతరం వారే.ఒక వైపు ఉద్యోగము చేసుకుంటూనే ఇవి నిర్వహిస్తున్నారు.చాలా మంది చదువుతున్నారు కూడా.యుంగ్ రచయతలు కూడా చాలా మంది కనిపిస్తున్నారు.ఇది శుభపరిణామమే కదా! మరి దీని గురించి మీరేమంటారు?

అవును నిజమే ఈ మధ్య చాల అంతర్జాల పత్రికలు మరియు సాహిత్య వెబ్ సైట్స్ వచ్చాయి కాని ఇవన్ని డబ్బు సంపాదించడానికి..అంతే సహిత్యనీ ఈ తరం వారు ఒక ఆదాయ వనరుగా మార్చేసారు..ముందు తరం వారు సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం తీసుకు వచ్చే వారు నేడు సాహిత్యం కూడా ఒక వ్యాపారమే..!!

12. మీ ప్రతిలిఫి గురించి చెప్పగలరా?

నా ప్రతిలిపి కాదు అండి ప్రతిలిపిలో నేను ఒక ఉద్యోగస్తుడిని మాత్రమే..ప్రతిలిపి ఒక స్వీయ ప్రచురణల సాహిత్య వెబ్ సైట్ ఇందులో ఎవరైనా వారే స్వయంగా వచ్చి  తమ రచనలు ప్రచురణ చేసుకోవచ్చు.కొత్త రచయితలకు ఇదొక మంచి ప్లాట్ ఫాం నా తొలి కవిత ప్రతిలిపి లో ప్రచురణ అయ్యింది సో నేను ప్రతిలిపి ద్వార ఈ సాహిత్య లోకానికి పరిచయం అయ్యాను.నా వాలే చాల మందిని పరిచయం చేస్తున్నది ప్రతిలిపి.నేడు ఒక రచన ఒక పత్రికలో ప్రచురణ అవ్వాలి అంటే ఎన్నో రాజకీయాలు ప్రతిలిపి అలా కాదు మొత్తం ఎనిమిది బాషల సాహిత్యం వేల సంఖ్యలో లభ్యం అవుతుంది.ఇండియా లోనే ఫాస్టెస్ట్ సెల్ఫ్ పుబ్లిషింగ్ ప్లాట్ ఫాం ప్రతిలిపి.ముఖ్య ఉద్దేశం సాహిత్యాన్ని డిజిటల్ చేయడం రీడర్స్ మరియు రచయితలను అనుసంధానం చేయడం..నేను ప్రతిలిపి తెలుగు విభాగం మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న మా ప్రతిలిపి లో మొత్తం 7000  మంది రచయితలు తమ రచనలు అందిస్తున్నారు.ఇందులో సాహిత్య అకాడెమి పురష్కారం అందుకున్న వారు కూడా ఉన్నారు.

13.చివరగా నాదొక నా పర్సనల్ ప్రశ్న :) నేను దాదాపు నాలుగేళ్ళుగా విహంగ అంతర్జాల పత్రిక లో పుస్తక సమీక్షలు రాస్తున్నాను.కాబట్టి ఒక రకంగా విహంగ నాకు ప్రత్యేకమైనది, అభిమానమైనదీనూ.ఇందులో నే రాసిన సమీక్షలు మీరేమైనా చదివారా? ఈ మధ్య రచయతల అభిప్రాయాలు కూడా ఇందులో కలుపుతున్నాను చిన్న ఇంటర్ వ్యూ లాగా.అదేమైనా ఉపయోగమంటారా? లేకపోతే దండగంటారా? నేను ఈ సమీక్షలను ఇంకే విధముగానైనా మార్చ వచ్చా ?

మీరు రాసిన అన్ని సమీక్షలు చూసాను కొన్ని చదివాను ముఖ్యంగా ఇప్పటి రచయితల సమీక్షలను చదివాను చాల బాగా మీ సమీక్షా రీడర్స్ కి అందించారు.ఇలాంటి ఇంటర్వ్యూ లా వల్ల రచయిత ఉద్దేశం ఏమిటి రచయిత సమాజం పై ఉన్న అభిప్రాయం ఏమిటి అనేవి అందరికి తెలుస్తాయి ఇందులో మీరు అడిగిన చాల ప్రశ్నలు నాకు చాల బాగా నచ్చాయి అన్నింటికీ క్లుప్తంగా సమాధానం చెప్పను అనే అనుకుంటున్నా..మీ సమీక్షలు ఇలాగే కొనసాగించండి ఈ సమీక్షలను పత్రికలకు పంపండి పత్రిక రంగంలో కూడా మీ విజయ పరంపర కొనసాగించాలి కోరుకుంటున్న...!!

14.మా విహంగ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

నా కవిత ఒకటి ప్రచురణ అయ్యింది విహంగలో..ఒకసారి విహంగ ఎడిటర్ హేమలత గారితో ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తు స్త్రీ సమస్యల పై రాసి పంపండి అధినికంగా ఉండాలి అన్నారు కొన్ని పంపాను అందులో ఒక్కటి వచ్చింది మొన్న ఇంకా రెండు పంపాను.విహంగ పత్రిక అంతర్జాలంలో వెలిగిపోవాలని స్త్రీ సమస్యల పై పోరాడే రచయితలకు ఒక మంచి ప్లాట్ ఫాం ఒక్క..చివరిగా నా విన్నపం కేవలం స్త్రీ రచయితలనే కాకుండా మాకు అవకాశం ఇస్తారు అని ఆశిస్తున్న మొన్న విన్న కూడా మాకు కూడా అవకాశం ఉంది అని ఏది ఏమైనా అల్ డి వెరీ బెస్ట్ తో విహంగ..!!

మీ

అఖిలాశ

జాని.తక్కెడశిల

బతుకమ్మ పురష్కార గ్రహిత

కవిసమ్మేళన ఉగాది పురష్కార గ్రహిత

భావగీతి ఉత్తమ కవి గ్రహిత

సహస్ర కవిమిత్ర

సహస్ర వాణి శత పద్య కంఠీరవ

సహస్రవాణి శత స్వీయ కవితా కోకిల

సహస్ర వాణి సూక్తి శ్రీ

సహస్రవాణి శతకవితా కోకిల

మీ మాటలల్లో, మీ కవితలల్లో స్త్రీల పట్ల మీకున్న గౌరవం తెలుస్తోంది.దానికి కారణం మీ అమ్మగారి పెంపకం అని అర్ధమైంది.మీ అమ్మగారికి నా సెల్యూట్.

ఇంత ఓపిక గా నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు థాంక్స్ అండి.

ఈ పుస్తకం ప్రతులు అన్ని పుస్తకాల షాప్స్ లల్లోనూ, రచయత దగ్గరనూ, జే.వి పబ్లికేషన్ దగ్గరనూ దొరుకుతాయి.వెల 50rs.

మీ 

మాల కుమార్