ప్రతిలిపి కథల వేదిక మాత్రమే కాదు. ఇది పాఠకులు మరియు రచయితల కారణంగా అభివృద్ధి చెందుతున్న వేదిక. మీరు ఇలాంటి వేదిక కోసం చూస్తున్నట్లయితే, ఇతర ప్రతిలిపి యూజర్స్ తో పరస్పరం కమ్యూనికేట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా, మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి మరియు రాయడానికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వేదికను సృష్టించే లక్ష్యాన్ని సాధించడంలో ప్రతిలిపికి సహాయం చేసినవారౌతారు.
కమ్యూనిటీని కనుగొనడం:
ప్రతిలిపిలో కమ్యూనిటీని కనుగొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చాలా మంది ప్రతిలిపి యూజర్స్ కథలపై అనుబంధాన్ని కలిగి ఉంటారు, ఇతర పాఠకులు మరియు రచయితలను కనుగొనే క్రమంలో వారికి నచ్చిన రచనలపై కామెంట్స్ చేయవచ్చు. ఇతర ప్రతిలిపి యూజర్స్ తో పరస్పరం కమ్యూనికేట్ చేయడానికి అన్ని మార్గాల వివరాలు దిగువన చూడగలరు.
సమీక్ష / కామెంట్స్
మీరు ఒక నిర్దిష్ట కథా భాగం గురించి మీ ఆలోచనలను రచయిత లేదా ఇతర పాఠకులతో పంచుకోవాలనుకుంటే, మీరు సమీక్షను అందించవచ్చు. ప్రతి సమీక్ష గరిష్టంగా 2000 అక్షరాలు ఉండవచ్చు మరియు మీరు రచనలపై ఎన్ని కామెంట్స్ అయినా చేయవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. మీరు పోస్ట్ చేసిన ఏదైనా సమీక్షని సవరించవచ్చు/తొలగించవచ్చు.
రేటింగ్ :
రచయితకు మీ మద్దతును చూపించడానికి రేటింగ్ ఒక గొప్ప మార్గం. మీరు చదివిన ఏదైనా రచనకు మీరు రేట్ చేయవచ్చు.
బహుమతులు :
బహుమతులను ఉపయోగించడం ద్వారా కథను ప్రోత్సహించడానికి మరొక మార్గం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బహుమతులు స్టిక్కర్లు మాత్రమే. మీకు ఇష్టమైన రచన లేదా మీకు ఇష్టమైన రచయితకు ప్రోత్సహం ఇవ్వడానికి మీరు ప్రతిలిపిలో అందుబాటులో ఉన్న స్టిక్కర్‌లను ఎంచుకోవచ్చు.
ప్రైవేట్ సందేశం
మీరు మరొక ప్రతిలిపి యూజర్ కు ప్రైవేట్ సందేశాన్ని పంపవచ్చు. ఈ సందేశం మీకు మరియు వారికి మాత్రమే కనిపిస్తుంది. మీ ప్రైవేట్ సందేశాలు మీ ఇన్‌బాక్స్‌లో ఉంటాయి. మీరు ఏ సమయంలోనైనా ప్రైవేట్ చాట్ ని తొలగించవచ్చు, కానీ దయచేసి గమనించండి: ఇది మీ వైపు నుండి మాత్రమే తొలగించబడుతుంది. ఇతర ప్రతిలిపి యూజర్ గత సందేశాలను చదవలేరు.
పోస్ట్‌లు/స్టోరీస్
మీ ప్రొఫైల్‌ని సందర్శించే ఎవరికైనా మీ పోస్ట్/స్టోరీ కనిపిస్తుంది. ఇది మీరు మీ ఆలోచనలను పంచుకునే లేదా పబ్లిక్ సంభాషణలలో పాల్గొనే ప్రదేశం. మీరు మీ పోస్ట్‌లపై సందేశాలను పోస్ట్ చేయవచ్చు, రచనల నుండి కోట్‌లను పంచుకోవచ్చు లేదా రివ్యూస్ కు రిప్లై ఇవ్వవచ్చు.
అనుసరిస్తున్నారు :
ఇతర ప్రతిలిపి యూజర్స్ ని అనుసరించడం అనేది ప్రతిలిపిలో వారి అప్ డేట్స్ గమనించడానికి గొప్ప మార్గం. మీరు ప్రతిలిపి యూజర్ ని అనుసరిస్తే, వారు పోస్ట్/స్టోరీ జోడించినప్పుడు లేదా సరికొత్త రచనను ప్రచురించినప్పుడు నోటిఫికేషన్‌లను పొందుతారు. అనుసరించడం వలన ఇతర ప్రతిలిపి యూజర్స్ కూడా మీతో పరస్పరం కమ్యూనికేట్ చేయవచ్చు.