నేను కొన్నిసార్లు ఎటువంటి నోటిఫికేషన్‌లను ఎందుకు స్వీకరించలేను?

నోటిఫికేషన్‌లు ఆలస్యం కావచ్చు లేదా అంతరాయం కారణంగా కనిపించకపోయే సందర్భాలు ఉన్నాయి.

స్టోరీ అప్‌డేట్ నోటిఫికేషన్‌లతో సహా జనరల్ నోటిఫికేషన్‌లు సాధారణం కంటే ఆలస్యంగా పంపబడటానికి దారితీసే ఆలస్యాన్ని మేము ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాము. సమస్య ఉంటే చెక్ చేసి సాల్వ్ చేస్తాము. ఆ తర్వాత నోటిఫికేషన్‌లు పంపబడతాయి. మేము మా వైపు ఉన్న సమస్యను మెరుగుపరిచేలాగా పనిని కొనసాగిస్తాము మరియు మేము దీనిపై పని చేస్తున్నప్పుడు మీరు సహనంగా ఉండాలని కోరుతున్నాము.

మీకు ఇంకా సమస్యలు ఉంటే, దయచేసి దిగువ మార్గాల్లో ప్రయత్నించండి:

ఆండ్రాయిడ్ యాప్ నుండి: 

  1. మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను ఆఫ్ చేసి, ఈ మార్పులను సేవ్ చేయండి, ఆపై వాటిని మళ్లీ ఆన్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి

  2. మీ wi-fi/డేటా కనెక్షన్‌ని ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేయండి లేదా మరొక wi-fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి

  3. లాగ్ అవుట్ చేసి, మీ ప్రొఫైల్ లోకి తిరిగి రావడానికి ప్రయత్నించండి, యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేయండి.

  4. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.

ఈ పోస్ట్ సహాయపడిందా?