pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

చేదు కూడా రుచే!

4.2
3939

సంజె వాలుతోంటే ఆనందవల్లి మొక్కల దగ్గర్నించి నెమ్మదిగా లేచి బియ్యం ఏరుతూ ఆలోచనలో పడింది. భర్త అనంతశయనం చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసి “ ఆనందం! రాత్రికి ఏం వండుతున్నావేంటీ?” అని ఆసక్తిగా అడిగాడు. “ ...

చదవండి
రచయిత గురించి
author
డా|| పి.కె.జయలక్ష్మి

డా. పిశిపాటి కామేశ్వరి జయలక్ష్మి 1965 వ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు శ్రీమతి దుర్గా కుమారి, శ్రీ సూర్యనారాయణ మూర్తి దంపతులకి ద్వితీయ సంతానం గా రాజమండ్రి లో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులే. తండ్రి గారు ఆంగ్లం లో పట్టభద్రులు. తదుపరి బి.ఎల్ చేసి అడ్వోకేట్ గా స్థిరపడ్డారు. తల్లి గారు తెలుగు మరియు గణితం లో పట్టభద్రులు. తరువాత ఎం.ఎడ్ చేసి బంటుమిల్లి, సామర్లకోట, నిడదవోలు ప్రభుత్వ కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా సేవలందించారు. ఆవిడ మంచి వక్త, సృజనశీలి, గాయనీమణి. ఆమె ప్రభావం తన మీద చాలా ఉందని జయలక్ష్మి గారు చెప్తారు. తల్లి గారి అడుగుజాడల్లో చిన్ననాటి నుంచి చదువులో మేటిగా నిలబడ్డ జయలక్ష్మి పదవ తరగతి లో స్కూల్ ఫస్ట్ సాధించి స్వర్ణపతకం పొందారు. ఇంటర్ బై.పి.సి. గ్రూప్ తో కళాశాల లో ప్రధమురాలిగా నిలిచారు. బి.ఎస్.సి. కర్నూల్ కె.వి.ఆర్. కళాశాల లో ప్రధమురాలిగా నిలిచారు. చిన్ననాటి నుండి హిందీ భాష పై ఉన్న మక్కువ తో ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఎం.ఏ. హిందీ ఫస్ట్ క్లాస్ మరియు డిస్టింక్షన్ లో ద్వితీయ ర్యాంక్ (179 మంది విద్యార్ధుల్లో)సాధించారు. సంస్కృతం లో డిప్లమో చేశారు. ఎం.ఏ లో తన సహాధ్యాయి శ్రీ రాజశేఖర్ ని 1986 లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. తదుపరి దంపతులిద్దరూ ఆటుపోట్లనెన్నిటినో ఎదుర్కుంటూ, పట్టుదలతో, స్థిర సంకల్పంతో హిందీ సాహిత్యం లో డాక్టరేట్లు సాధించడంలో కృతకృత్యులయ్యారు. 1989 లో జ్ఞానాపురం సెయింట్ జోసఫ్ బాలికోన్నత పాఠశాల లో హిందీ, సంస్కృతం ఉపాధ్యాయిని గా విధులు నిర్వహించి 1992 నుండి సెయింట్ జోసఫ్ మహిళా కళాశాల లో హిందీ విభాగాధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. భర్త డా. రాజశేఖర్ డ్రెడ్జింగ్ కార్పోరేషన్ లో డిప్యూటీ మేనేజర్ {హిందీ} . వారికి ఇద్దరు మగపిల్లలు. పెద్ద కుమారుడు చి. సాకేత్ మోహన్ కొలంబస్ {అమెరికా}లో కాగ్నింజెంట్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్నారు. చేస్తున్నారు. చిన్న కుమారుడు చి. సాయి నందకిశోర్ ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఎం.టెక్ పూర్తి చేసి న్యూ యార్క్ విశ్వవిద్యాలయం లో ఎం. ఎస్ చేస్తున్నారు. ఇక ప్రవృత్తిపరంగా చూస్తే డా. జయలక్ష్మి గారు మంచి వక్త, రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు, సమీక్షకురాలు. క్షణం తీరిక లేని దైనందిన కుటుంబ, ఉద్యోగ బాధ్యతల నడుమ గడియారం తో పోటీ పడుతూ సృజనాత్మకత కి పదును పెట్టుకుంటూ అన్నిటా సెహబాష్ అన్పించుకుంటున్న ఆమె ఇంతవరకు అయిదు హిందీ గ్రంధాలని, సమత, సప్తక్ త్రయ్ మే ఆధునికత, సప్తక్ త్రయ్ మే సమకాలీన్ జీవన్ కే సంవేదనాత్మక్ పక్ష్(2 సంస్కరణలు), చిత్ చోర్, కథాషోడశి, ఆవిష్కరణ, మనస్విని, కథాంజలి – నాలుగు తెలుగు కథా సంకలనాలని, హృదయగీతం -1 కవితా సంకలనాన్ని ప్రచురించారు. డిగ్రీ కళాశాల విద్యార్ధుల కొరకు పద్య గద్య సంచయ్, పద్య గద్య మంజరి అనే రెండు హిందీ పాఠ్య పుస్తకాలకి సంపాదకత్వం చేశారు. హిందీ తెలుగు భాషల్లో దాదాపు 200 సాహితీ వ్యాసాలు, పరిశోధనా వ్యాసాలు కథలు, కవితలు స్రవంతి, పూర్ణకుంభ్, వివరణ్ పత్రిక, భాష, మైసూర్ హిందీ పత్రిక, రాజభాష భారతి, సంకల్య, విశాఖ దర్పణ్, విశాఖ భారతి, వంటి ప్రముఖ హిందీ పత్రికల్లోనూ, స్వాతి వారపత్రిక, చినుకు, ప్రేమతో స్వర్ణ, విధివిలాసం, మహిళా విజయం, ఆంధ్రప్రదేశ్, విశాఖ సంస్కృతి, ఆంధ్రభూమి, విధి విలాసం వంటి తెలుగు పత్రికలతో పాటు కౌముది, సారంగ, సుజనరంజని, గో తెలుగు.కామ్, గర్భనాళ్ మొదలైన వెబ్ పత్రికల్లో కూడా ప్రచురిత మవుతూ ఉంటాయి. తెలుగు నుండి హిందీ కి మరియు హిందీ నుండి తెలుగు లోనికి అనువాదాలు చేస్తూ ఉంటారు. హిందీ రచయితలు ప్రేంచంద్ మరియు రాంకుమార్ వర్మ ల కౌశల్, చీంక్ రచనలని నేర్పు, తుమ్ము శీర్షికలతో, పంజాబీ రచయిత్రి అజిత్ కౌర్ కథానికలని పరాయి పంచన మరణం, కీలుబొమ్మ పేర్లతోనూ(మానవి-సంకలనం) అలాగే ప్రముఖ తెలుగు ఆచార్యులు కొర్రపాటి శ్రీ రామ్మూర్తి గారి ప్రముఖ సామాజిక నాటకం సమత ని హిందీ లోనికి , “తెలుగు జానపద సాహిత్యం లో సౌందర్య విలువలు”, “తెలుగు చలన చిత్ర గీతాలు నాడు- నేడు” అనే సాహితీ వ్యాసాలని హిందీ లోనికి అనువదించారు.(సహస్ర్ వర్షోమ్ కా తెలుగు సాహిత్య) హిందీ మరియు తెలుగు భాషలపై డా. జయలక్ష్మి గారికి గల అభిమానం, పట్టు అపారమైనవని వేరే చెప్పనక్కర లేదు. యూ జి సి సౌజన్యం తో దక్షిణ భారతం లో హిందీ బోధన లో సమస్యలు, పరిష్కారాలు అంశం మీద రెండు రోజుల జాతీయ సదస్సుని{జనవరి 2011}హిందీ సాహిత్యం లో మానవ సంబంధాలు అంశం మీద రెండు రోజుల జాతీయ సదస్సుని{జనవరి 2016} నిర్వహించారు. అలాగే యూ జి సి సౌజన్యం తో హిందీ సమస్యా నాటకాలు-ప్రయోగాలు, పరిశీలన, ఆధునిక హిందీ, తెలుగు నాటకాలపై విదేశీ నాటకాల ప్రభావం అనే 2 రీసర్చ్ ప్రాజెక్టులు విజయవంతం గా పూర్తిచేశారు. ఆమె మార్గ దర్శకత్వం లో ఆరుగురు అధ్యాపకులు హిందీ లో ఎం.ఫిల్ డిగ్రీలు సాధించారు. అంతే కాదు తమ విద్యార్ధినుల్లో సృజనాత్మకతని వెలికి తీస్తూ కళాశాల హిందీ విభాగం నుండి గత పదకొండేళ్లుగా ప్రతిభ పత్రికని వెలువరిస్తున్నారు. హిందీ మరియు తెలుగు భాషల్లో ఎన్నో వ్యాసాలు, కథానికలు, కవితలు ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం ద్వారా ప్రసారమౌతూ ఉంటాయి.ఆమె ఆధ్వర్యం లో విద్యార్ధినులు ప్రేమ సమాజం, వృద్ధాశ్రమాల్ని సందర్శిస్తూ సేవా భావాన్ని, మానవీయ విలువల్ని పెంపొందించుకుంటున్నారు. ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం ద్వారా డా.జయలక్ష్మి గారు హిందీ మరియు తెలుగు లో ఎన్నో సాహితీ అంశాల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. విద్యార్ధినులతో కూడా ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం ద్వారా యువవాణి, తరుణీ తరుణం కార్య క్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. దైనందిన జీవితం లో తనకెదురైన సంఘటనలకి కల్పనని జోడిస్తూ కథ గా మలుస్తానని ఆమె చెప్తారు. తల్లి గారి స్పూర్తి, భర్త గారి ప్రోత్సాహం తో సాహితీ సేవ చేయగలుగుతున్నట్లు చెప్పారు. మానసికంగా ఒత్తిడి కి గురయినప్పుడు మంచి సాహిత్య పఠనం టానిక్ లా పనిచేసి అమ్మలా సేద తీరుస్తుందని ఆమె పేర్కొన్నారు. విశాఖ సాహితి, సహృదయ సాహితి, మండే మొజాయిక్, లలితాపీఠం, బా బాపు భవన్, కొసనా ట్రస్ట్, స్వర్ణ అకాడమీ మొదలగు సంస్థల్లో వివిధ సారస్వత అంశాల మీద ప్రసంగాలు, కవితా పఠనాలు చేయడమే కాకుండా ఇన్ కం టాక్స్, సెయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో, డ్రెడ్జింగ్ కార్పోరేషన్, ఎయిర్ పోర్ట్ అథారిటీ వంటి సంస్థల్లో ఉద్యోగులకి హిందీ బోధన కూడా చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, భారతీయ సాంస్కృతిక సంబంధాల పరిషత్ తరఫున బల్గేరియా లోని సోఫియా విశ్వ విద్యాలయం లో రెండేళ్లపాటు విజిటింగ్ ప్రొఫసర్ గా భారతీయ సంస్కృతి, భాష, సాహిత్యం, విలువల గురించి బోధించి స్వదేశానికి తిరిగి వచ్చిన డా.జయలక్ష్మి గారు మన సంస్కృతి యూరోపియన్ల ని ఎంతగానో ఆకట్టుకుందని మన కట్టు బొట్టు, కుటుంబ వ్యవస్థ, వివాహ వేడుకలు, ఆహారం, సంగీతం, నాట్యాలు, చీరకట్టు, యోగా, ప్రాణాయామం, చలన చిత్రాలు మొదలైన వాటి గురించి చాలా ఆసక్తి ని కనబరుస్తూ ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారని సంతోషంగా చెప్పారు. కేవలం సోఫియా విశ్వవిద్యాలయం లోనే కాకుండా చుట్టుపక్కల నగరాల్లోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో కూడా వారి ఆహ్వానం మేరకు వెళ్ళి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ని వివరిస్తూ ప్రసంగాలు చేయడం అద్భుతమైన అనుభవమని చెప్పరామె. అక్కడి యువతులు చీరకట్టుని ఎంతో ప్రశంసించడమే కాకుండా తనతో కట్టించుకుని ఎంతగానో ముచ్చట పడ్డారని తెలిపారు. వచ్చేటప్పుడు కొన్ని చీరలు బల్గేరియా లోని సోఫియా విశ్వ విద్యాలయం, ఇండాలజీ విభాగానికి కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. విశ్వ హిందీ దినోత్సవం, దసరా, దీపావళి, హోళీ మొదలైన పండుగలప్పుడు భారతీయతని ప్రతిబింబిస్తూ యూరోపియన్ యువతులు గోరింటాకు పెట్టుకుని, చక్కని బొట్టు కాటుకలతో చీరలు ధరించి రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని డా.జయలక్ష్మి గారుఅన్నారు. బల్గేరియా పని చేస్తున్నపుడు శలవు దినల్లో అక్కడి చుట్టుప్రక్కల దేశాలు, యూరోప లోని పర్యాటక ప్రాంతాలని సపరివార సమేతంగా పర్యటించారు. ఆ సందర్బంగా ఆమె బల్గేరియా, ఫ్రాన్స్, ఇటలీ, వాటికన్ సిటీ, గ్రీస్, టర్కీ, రస్యా తదితరి దేశాల్లోని సోఫియా, బుర్గాస్, బ్లోగోవగ్రాడ్, గాబ్రోవో, పారిస్, రోమ్, వెనిస్, పీజా, ఫ్లోరెన్స్, మిలాన్, ఏథెన్స్, తెస్సోలినికి మరియు ఇస్తాంబుల్ వంటి నగరాల్లోని ప్రముఖ చారిత్రిక, ధార్మిక, పర్యాటక ప్రాంతాలనీ సపరివార సమేతంగా సందర్శిసించారు ఎన్ని దేశాలు తిరిగినా మన సంస్కృతికి ఏవీ సాటి రావని భారతీయురాలిగా పుట్టడం తన సుకృతమని ఆమె ఉద్వేగంగా చెప్పారు. మన దేశం ఎందరికో మార్గ దర్శకమని, ఇక్కడికి రావాలని విదేశీయులెంతో ఉత్సాహం తో ఉవ్విళ్లూరుతూ ఉంటారని ఆమె పేర్కొన్నారు. బైటకి వెళ్తే మన దేశం విలువ ఇంకా బాగా తెలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మనం ఉపేక్షిస్తున్నసంస్కృతి, విలువలు విదేశీయులని ఎంతో ఆకర్షిస్తున్నాయని చెప్తూ, ఇండాలజీ అధ్యాపకురాళ్ళు, విద్యార్ధినులు ఈ రెండు సంవత్సరాల పాటు తననెంతో ఆత్మీయంగా ఆదరించారని ఇది తనకు మరచిపోలేని మధురమైన అనుభూతి అని ఆమె చెప్పారు. సన్మానాలు, పురస్కారాలు – విద్యా సాహితీ రంగాల్లో డా.జయలక్ష్మిగారు చేస్తున్న కృషికి, ఆమె సాధిస్తున్న విజయాలకి సహృదయ సాహితి, విశాఖ సాహితి, కళావేదిక, కొసనా సాంస్కృతిక సంస్థ, స్వరరంజని, మన జాగృతి, స్వర్ణ నృత్య, సంగీత, సాహిత్య అకాడెమీ, శ్రీ లలిత పీఠం, గాంధీ సెంటర్ వంటి ఎన్నో సంస్థల ద్వారా సన్మానాలు అందుకున్నారు. 2016 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం స్వీకరించారు. 2016 ఆగస్ట్ నెల లో కృష్ణ పుష్కర కవితోత్సవం లో పాల్గొని రాష్ట్ర అధికార భాష సంఘం తో సత్కరించబడ్డారు. 2015మార్చ్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే సాహితీ సృజనకి ఉగాది పురస్కారం స్వీకరించారు. 2014 లో తాను పనిచేస్తున్న సెయింట్ జోసఫ్ మహిళా కళాశాల యాజమాన్యం నుండి సెయింట్ ఆండ్రే ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆమె వినమ్రంగా చెప్తారు. 2014 జూలై లో బల్గేరియా, యూరోప్ లో భారతీయ భాష సంస్కృతుల వ్యాప్తి కై చేసిన కృషికి మరియు ఉత్తమ బోధనకి ఇండాలజీ, సోఫియా విశ్వవిద్యాలయం వారిచే ప్రశంసా పత్రం తో సత్కరింపబడ్డారు. విశిష్ట సాహితీ సేవా పురస్కారం, విశాఖ ఆణిముత్యం, విశిష్ట్ హిందీ సేవి సమ్మాన్, కృషీవళి, బలివాడ కాంతారావ్ పురస్కారం, బాల సాహిత్య వేదిక పురస్కారం, విశిష్ట మహిళ పురస్కారాలని కూడా అందుకున్నారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sri Mahalakshmi
    25 ఫిబ్రవరి 2018
    Intaki chethi kharchu ki dabbu vundala leka bhartha ni adagala??
  • author
    Vathyam Uma
    26 ఫిబ్రవరి 2018
    బాగుంది. కానీ ఆవిడ కోరిక సమంజసమేగా తీరితే బాగుండేది
  • author
    Gongalreddy Harshavardhan Reddy
    10 మార్చి 2018
    ఆమె కోరిక సమంజసమే అలా అడగడం లో తప్పులేదు ఎవరి ఖర్చులు వారికి ఉంటాయి అతను ఇంట్లో లేనప్పుడు ఇంటికి ఆడ బిడ్డ వస్తే ఆమె తిరిగి వెళ్లే టప్పుడు తాంబూలం తో పాటి చీర కొనుక్కోమని ఎవరికొలది వారు డబ్బు ఇవ్వడం ఆనవాయితీ కానీ ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఉండాలి కదా కాబట్టి ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అందుకని భర్త ఇంటికర్చు లకు కాస్తో కూస్తో భార్యకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sri Mahalakshmi
    25 ఫిబ్రవరి 2018
    Intaki chethi kharchu ki dabbu vundala leka bhartha ni adagala??
  • author
    Vathyam Uma
    26 ఫిబ్రవరి 2018
    బాగుంది. కానీ ఆవిడ కోరిక సమంజసమేగా తీరితే బాగుండేది
  • author
    Gongalreddy Harshavardhan Reddy
    10 మార్చి 2018
    ఆమె కోరిక సమంజసమే అలా అడగడం లో తప్పులేదు ఎవరి ఖర్చులు వారికి ఉంటాయి అతను ఇంట్లో లేనప్పుడు ఇంటికి ఆడ బిడ్డ వస్తే ఆమె తిరిగి వెళ్లే టప్పుడు తాంబూలం తో పాటి చీర కొనుక్కోమని ఎవరికొలది వారు డబ్బు ఇవ్వడం ఆనవాయితీ కానీ ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఉండాలి కదా కాబట్టి ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అందుకని భర్త ఇంటికర్చు లకు కాస్తో కూస్తో భార్యకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది...