నీ గురించి నువ్వు తెలుసుకుంటే.. జీవితం అర్థం అవుతుంది..😊
మనల్ని మనమే.. కించపరచుకుంటే..🙄 సమాజం ఎందుకు విమర్శించదు! అద్దంలో మన ప్రతిబింబం..మనం ఏది చేస్తే అదే చేస్తుంది..అదే మరి జీవితం..
ఎందరో ఎన్నో చెప్తూ ఉంటారు..
ఎవరినీ నొప్పించనిది,నీకు సంతోషం..
అని ....అనిపించిందే.. చెయ్యి..
మంచిదారిఎంచుకున్న..మన..అడుగులను.. ఎన్నో విమర్శలు ముళ్ళలా గుచ్చుతాయి..జిగురుబురదలా అడుగులు సాగకుండా చేస్తాయి....
నువ్వు వెళ్లే దారి మంచిది అయినప్పుడు.. ధైర్యంతో తడబడకుండా. అడుగులు వెయ్యి ముందుకు.. నీ అడుగులను..
ఏది అడ్డగించదు..
మంచి వయసులోనే.. మంచి మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.. జరిగిపోయిన సమయం..ఏది తిరిగి రాదు..
చరిత్రలో నీది అంటూ.. నువ్వు లిఖించిన.. ఒక అక్షర జ్యోతి..వెలగాలి..
..అది గమ్యం తెలియని..
చీకటి దారిలో.. వెళుతున్న కొందరికైనా..వెలుగు చూపించాలి..
తోడు.. ఎవ్వరూ లేరన్న. నిరాశ వద్దు..
నీలో ఉంటూ.. నీతో కష్టపడుతూ..
నువ్వు నవ్వితే నవ్వడానికి, బాధపడితే ఓదార్చడానికి..నీలోనే ఉన్నాడు.
నువ్వు నమ్మిన దైవం..😇
ఏ బంధం అయినా దూరం అవ్వొచ్చు..
కానీ, నీలోనే..ఉన్న దైవానుబంధం ఉన్నంతవరకు...నీలో జ్యోతిలా.. వెలుగుతూనే ఉంటాడు..
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్