హోమ్
విభాగాలు రాయండి

ప్రతిలిపి అంటే ఏమిటి?


ప్రతిలిపి ద్వారా మీ ఆలోచనల నుండి పుట్టిన రచనలు కొన్ని లక్షల మంది పాఠకులకు చేర్చవచ్చు. మీకు నచ్చిన రచయిత రచనలను కూడా చదువుకోవచ్చు. ప్రతిలిపి పాఠకులను మరియు రచయితలను అనుసంధానం చేస్తుంది. ప్రతిలిపికి సంబంధించిన రచయితలతో మీరు నేరుగా మాట్లాడవచ్చు మరియు వారితో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ప్రతిలిపికి 50,000 మందికి పైగా రచయితలు తమ రచనలు అందిస్తున్నారు.

ఆలోచనలు మరియు సమాచార మార్పిడి కోసం భాష ఒక అవరోధం కాకూడదు. మేము ఈ సిద్దాంతాన్ని బాగా నమ్ముతాము, కావున ప్రతిలిపి వేదిక దాన్ని భర్తి చేస్తుంది. మేము మీకు మంచి రచనలను మీ సొంత భాషలో అందిస్తాము.

ప్రతిలిపి వెనుక ఎవరున్నారు?
సులభంగా మరియు సమర్థవంతమైన రీతిలో వేల మంది రచయితల రచనలను లక్షల మంది పాఠకులకు చేరువ చేయడానికి ఉత్సాహభరితమైన యువకులు 45 మంది జట్టుగా చేరి, బెంగళూరు నుండి రాత్రి,పగలు పని చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిలిపిలో ఉన్న భాషలు ఏమిటంటే?
ప్రస్తుతం మేము ఈ 8 భాషలలో ఉన్నాము- తెలుగు, హిందీ, గుజరాతి, బెంగాలి, మరాఠీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ. అలాగే ఇతర భారతీయ భాషల్లోకి ప్రతిలిపిని విస్తరించే ప్రణాళికలలో ఉన్నాము.

ఏ పరికరాలలో ప్రతిలిపిని ఉపయోగించవచ్చు?
పాఠకులు మరియు రచయితలతో అనుసంధానం అయ్యేందుకు ప్రతిలిపి ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసి ఉపయోగించవచ్చు. ఇంతే కాకుండా, మీ ల్యాప్టాప్, డెస్క్ టాప్ టాబ్లెట్, ఐప్యాడ్ మొదలైన పరికరాల ద్వారా ప్రతిలిపిని యాక్సెస్ చేయవచ్చు.

ప్రతిలిపిలో మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే?
ప్రతిలిపిలో మీ మెయిల్ ఐ.డితో లాగిన్ అయ్యి మీకు ఇష్టమైన కథలు ఆస్వాదించండి మరియు మీ రచనలు మీరే ప్రచురణ చేసుకోవడం ప్రారంభించండి. మీకు ఏదైనా సందేహాలు కలిగినచో మా ఇమెయిల్ ఐడి కి మీ సందేహాలు పంపగలరు. 24గంటలలో మీ సందేహ నివృత్తి చేయగలము. 

స్వీయ ప్రచురణ ఎలా చేయాలి?

మీ రచనలు మీరే ప్రతిలిపి యాప్ ద్వారా స్వీయ ప్రచురణ చేయడానికి క్రింది లింక్ లో ఉన్న గైడ్ చదవగలరు. 

https://telugu.pratilipi.com/story/SDnkNsasz1lS


మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే?

దయచేసి [email protected] కి మెయిల్ చేయండి. 24 గంటలలో స్పందిస్తాము.