pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తెలుగు కథలు | Telugu Kathalu | Read Best Telugu Stories

కథల ప్రపంచం

Telugu kathalu, తెలుగు కవితలు, తెలుగు పద్యాలు, తెలుగు మాటలు, పాటలు, తెలుగుతనం అంటేనే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగువారికి, ఇంకా తెలుగు విన్నవారికి కూడా. అందులో తెలుగు సాహిత్యం గురించి చెప్పాలంటే కనీసం మొదటి సహస్రాబ్ది మధ్యకాలం నాటిది అని సూచన. ప్రతి అక్షరం ఉచ్చారణ గాని, భావం గానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్షరాలు కూర్చి కవిత రాసిన, చేర్చి కథ రాసిన హరివిల్లు చూసినట్లు, నెమలి నాట్యం చేసినట్లు ఉంటుంది. Telugu kathalu వినడానికి మాత్రమే కాదు, విని అందరికీ చెప్పడానికి, కధలోని పాత్రలు, సన్నివేశాలు, అవి ఇచ్చే సందేశాలు మన నిజ జీవితంలో అనుసరించడానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. భాష నేర్పించడానికి మాత్రమే కాదు ఈ telugu stories మన పిల్లలతో క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయడానికి, అదే టైంలో ఎన్నో తెలియని విషయాలు వాళ్లకు నేర్పించడానికి, మరెన్నో విలువలు తెలియచేయడానికి ఉపయోగపడతాయి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇల్లంతా పిల్లలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మావయ్యలు బామ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో సందడిగా ఉండేది, ప్రతిరోజు పండగలా ఉండేది. పిల్లలు, పెద్దలు అందరూ ఒక్క దగ్గర కూర్చుని రోజంతా ఎలా గడిచిందో చెప్పుకునేవారు, ఇంట్లో ఏమైనా సమస్య వస్తే వాటి గురించి మాట్లాడుకుంటూ కలిసి డెసిషన్ తీసుకునేవారు, అంటే మన ఇప్పటి కంపెనీస్ లో పాటించే బ్రెయిన్ స్ట్రాం పద్ధతి లాగా. ఇంకా అంతలోనే భోజన సమయం అయ్యేది. అందరూ పెందలాడే తినేసి పడుకోవడానికి సిద్ధమయ్యేవారు. పడుకునే ముందు బామ్మ, అమ్మమ్మో లేదా తాతయ్యో చక్కటి కథలు చెప్పేవారు ఆ కథల్లో మన పిల్లలు పురాణాలు, కట్టుబాట్లు, చరిత్ర, విలువ లాంటివి ఎన్నో అంశాలు నేర్చుకునేవారు. ఆ రోజులు వేరు, అలాంటి రోజులు మళ్లీ రమ్మన్నా రావు. ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పండగలకి కలుస్తున్నారు అందులోని బాబాయ్ వస్తే పిన్ని రాదు, మావయ్య వస్తే అత్తరాదు, ఇంకా ఉండేది ఒకటి లేదా రెండు రోజులు. మరి రెండు రోజుల్లో కష్టాలే చెప్పుకుంటారా, పిండి వంటలు చేసుకుని తింటారా, పిల్లలకి కథలే చెప్తారా. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీ పద్ధతులు ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. ఇంకా ఫ్యామిలీ టైమ్ అంటూ ఏమీ ఉండట్లే. పొద్దున్నే గూడులోంచి ఎగిరితే, పిల్లలు సాయంత్రానికి, పెద్దవాళ్లు రాత్రికి చేరుకుంటున్నారు. ఇంకా కలిసి మాట్లాడుకోవడం భోజనం చేయడం లాంటి కాన్సెప్ట్ లేవు. ఈ పరిస్థితి అందరి ఇంటిలోనూ కామన్ అయిపోయింది. చెప్పాలంటే అలవాటైపోయింది పిల్లలకి పెద్దలకి. ఇది ఎవరి తప్పు కాదు ఎవరూ కావాలని కూడా అనుకోరు, పరిస్థితులు ప్రభావం. ఇంట్లో అమ్మానాన్న ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మరి ఈ పరుగుల ప్రపంచంలో పిల్లలతో టైం స్పెండ్ చెయ్యడానికైనా, పిల్లలకు తెలుగుభాష నేర్పించడానికైనా చాలా కష్టతరం అవుతుంది. "అమ్మా .... ఆకలి, అన్నం పెట్టు" నుండి, మామ్ ఐ యామ్ హంగ్రీ గివ్ మీ సమ్ థింగ్ టు ఈట్ వరకూ వచ్చేసారు. ఇలాగే వదలివేస్తే ..."అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు బట్ మై మదర్ ఓన్లీ స్పీక్స్ ఇన్ తెలుగు" అని అంటారు పిల్లలు. మాతృ భాష ఏదైనా అది మనకు తల్లితో సమానం, మనం మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృ భాషను కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం, హిందీ లేదా మరే భాష అయినా కావచ్చు, ఎవరి భాష వారికి గొప్ప, గౌరవించాలి కూడా. అయితే ఆ గొప్పతనాన్ని మన పిల్లలకు మరియూ ముందు తరాలవారికి సంక్రమించే విధంగా అందజేసే భాధ్యత ప్రతీ తల్లిదండ్రులపైనా ఉంది. మనిషి ఎంత అడ్వాన్స్ అయినా తన సంతోషం దుఃఖం ఎప్పుడూ మాతృభాషలోనే పంచుకోవాలని అనుకుంటాడు. మాతృభాషలో చెప్పుకుంటేనే ఆ సంతోషం పెరిగేది, ఆ బాధ తగ్గేది. మాతృభాషలో ఉన్న గొప్పతనం అదే. తెలుగు నేర్పించాలి అంటే పిల్లలిని గంటలు గంటలు కూర్చో పెట్టి నేర్పించనక్కర్లేదు. ఇంట్లో తెలుగు మాట్లాడడం లేదా మన తెలుగు స్టోరీలు చదివించడం లేదా వినిపించడం వలన భాష మీద పట్టు, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. అంతే కాకుండా మన stories in telugu నిజజీవితంలోని సంఘటనలు ప్రతిభింబించేలా ఉంటాయి. చాలా సమస్యలకి సలహాలు, సూచనలు కథలో దాగివుంటాయి. దృష్టి పెట్టి చుస్తే క్రమశిక్షణ కూడా నేర్పిస్తాయి మన telugu kathalu. నాట్యం లో నవరసాలలా తెలుగు కథలు లో మన ప్రతి భావానికి కుప్పలు తెప్పలు కథలు ఉన్నాయి. మన భాధకి హాస్య కథలు, మన కలలకి ఫాంటసీ కథలు, మన ఉనికిని తెలిపేలా చరిత్ర కథలు, మన నిరుత్సాహానికి మోటివేషనల్ కథలు, మన మనసుకి నచ్చే ప్రేమ కథలు, మనల్ని మంచి మార్గంలో నడి పించండానికి నీతి కథలు, మనల్ని భయపెట్టే హారర్ కథలు, మన ఆతృతకు తగట్టు సస్పెన్స్ మరియు థ్రిల్లర్ కథలు, మన తక్కువ సమయం కోసం చిన్న కథలు, మన తెలుగు బిగిన్నెర్ ఫ్రెండ్స్ కోసం "There are many Stories in Telugu language in simple literature " వున్నాయి. ఇలా మన ఇంటరెస్ట్ కి తగినట్టు ఎన్నో కథలు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి నచ్చేలా, ఉపయోగపడేలా ఉంటాయి మన తెలుగు కథలు మరి. ఎన్నో గొప్ప కథల్ని తెలుగు అనే తియ్యదనంతో మనకి అందచేశారు ఎందరో మహా మహా రచయితలు. ఆనాటి 11వ శతాబ్దం నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుండి ఈ నాటి మధు బాబు, సులోచన రాణి, మధురాంతకం రాజా రామ్, గురజాడ వెంకటఅప్పారావు, కందుకూరి వీరేశలింగం వరకు అందరూ చేసే ప్రయత్నం ఏంటి అంటే, మన తెలుగు భాషలోని మాధుర్యాన్ని ముందు తరాలవారికి అందచేయడమే. గురజాడ వారి కన్యాశుల్కం, యండమూరి వారి వెన్నెల్లో ఆడపిల్ల, వావిలాల గోపాలకృష్ణ శాస్త్రి వారి శ్రీ రామాయణ కల్పవృక్షం, నన్నయబట్టు వారి ఆంధ్ర మహాభారతం, మొక్కపాటి వారి బారిష్టర్ పార్వతీశం, చలం వారి మైదానం, బాపు వారి బుడుగు ఇలా ఎందరో రచయితలు వారి నిజ జీవితంలో అనుభవాలు, జ్ఞానాన్ని రంగరించి మనకి కథలు, పుస్తకాలు రూపంలో అందజేశారు. ప్రెసెంట్ యంగ్ రైటర్స్ మోడ్రన్ లైఫ్ స్టైల్ ని ప్రతిబింబించేలా కథలు గానీ, కవితలు గాని రాస్తున్నారు. వీళ్ళ కథనం లో ప్రజెంట్ సొసైటీలో ఉండే పరిస్థితులు, యూత్ ఫేస్ చేసే సవాళ్లు, సైన్స్ టచ్ తో సాహిత్యాన్ని పండిస్తున్నారు. రాత్రి నిద్ర పట్టకపోయినా, రోజంతా ఒంటరిగా ఉన్నామని అనుకున్నా, ఫ్రెండ్స్ కి వెరైటీ వెరైటీ కథలు చెప్పాలన్నా, telugu story టెల్లింగ్ కాంపిటిషన్ అయినా, ప్రతి రోజు పడుకునే ముందు పిల్లలు kathalu చెప్పమంటున్నా, హాలిడేస్ కి మనవళ్లు, మనవరాళ్లు వచ్చి అమ్మమ్మ, తాతయ్యలను కథలు చెప్పమన్నా, ప్రతిరోజు కొత్త kathalu మీ పిల్లలకి చెప్పాలన్నా, మీరు చదవాలన్నా, మన అమ్మ, అమ్మమ్మలు చెప్పే ఎన్నో kathalu తెలుసుకోవాలనుకున్నా, వన్ స్టాప్ సొల్యూషన్ మన ఈ "ప్రతిలిపి". ఇదంతా చదివాక అర్జెంట్గా పిల్లలకి కథలు చెప్పాలి, మీకు కూడా కథలు చదవాలి అని అనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఆలస్యం మన ప్రతిలిపి లో చదివేయండి వెరైటీ కథలు. ప్రతిలిపిలో మాక్సిమం పీపుల్ బెనిఫిట్ పొందేలా 12 డిఫరెంట్ లాంగ్వేజస్ లో స్టోరీస్ పబ్లిష్ చేస్తున్నారు. మీ ప్రతీ మూడ్ కి, సిట్యుయేషన్ కి తగ్గ స్టోరీ ప్రతిలిపిలో ఉంటుంది. ప్రతి ఒక్కరి కోసం కష్టమైస్ చేసినట్టు ఉంటాయి స్టోరీస్. చెప్పడానికి ప్రతిలిపి దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి మరి మీరు సిద్ధంగా ఉన్నారా వినడానికి. "ప్రతిలిపి" అనేది కథలను సమీకరించడమే కాదు, అవి మనకు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను విపులీకరిస్తుంది. ప్రతీ కథ ఒక నీతిని బోధిస్తుంది, అవి మన నిత్యజీవితంలో సన్మార్గంలో ప్రయణించడానికి దోహదం చేస్తాయి. అలాగే జీవితంలో ఏవిధంగా మెలగాలి అనే సంస్కారాన్ని, అమితమైన విజ్ఞానాన్ని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగల మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాశాన్ని, మంచి ప్రవర్తనను, మంచి చెడుల తారతమ్యాన్ని, తద్వారా మంచిగా ఏవిధంగా ప్రవర్తించాలనే విశ్వాసాన్ని, సంకల్పాన్ని, మరెంతో స్ఫూర్తిని కలుగచేసి మంచి పరిపూర్ణమైన మనిషిగా తీర్చిదిధ్ధుతాయి ఈ నీతి కథలు. ఇవి చదవడం వలన మనోల్లాసం, తెలియని విషయాలను, వింతలను సమాజానికి ఉపయోగపడే మరెన్నో మన కళ్ళకు కనపడినట్లుగా చూపుతాయి ఈ విజ్ఞాన గని "ప్రతిలిపి'. మరింత విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, మనోల్లాసాన్ని, మనోధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని, సాంప్రదాయాలనూ అందించే "ప్రతిలిపి" ని అందరూ ఆస్వాదించుదాం. సో, మీ ఒంటరితనాన్ని కథలతో జతపరిచి, అలసిన కనులకి కథలని వినిపించండి. ప్రతిలిపి ప్రపంచానికి ఇదే మా స్వాగతం.
సంపూర్ణంగా చూడండి
pcp3 banner 1