హోమ్ పేజీ:
హోమ్ పేజీలో మీరు చదవడం ప్రారంభించి ఆపివేసిన రచనలు కనపడుతాయి. మరియు మీ ఇష్టాల ఆధారంగా ప్రతిలిపి కొన్ని రచనలను ప్రతిలిపి సజెస్ట్ చేస్తుంది.
ఇష్టమైనవర్గాలు:
మీకు ఇష్టమైన వర్గాలను ఎంచుకొని ఆ వర్గాలకు సంబంధిచిన రచనలను పొందండి.
- దయచేసి యాప్ పైన ఉన్న 'వర్గాలు' బటన్ పై క్లిక్ చేయండి.
- ఇష్టమైనవర్గాలు పై క్లిక్ చేసి మీకు ఇష్టమున్నవర్గాలను ఎంచుకోండి.
రచయితలనుఅనుసరించడం:
ప్రతిలిపిలో ఏ రచయితనైనా అనుసరించవచ్చు.రచయితలను అనుసరించడం వలన వారు రచనలను ప్రచురణ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీరునేరుగా రచయితలకు మెసేజ్ కూడా చేయవచ్చు. ఏ సమయంలోనైనా వారి నుండి నోటిఫికేషన్స్ వద్దు అనుకుంటే వారిని అన్ ఫాలో చేయవచ్చు.
ఇంటర్నెట్ లేకుండాచదవడం:
ప్రతిలిపిలో మీకు ఇష్టమైన రచనలను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేకుండా చదవచ్చు.
- వైఫై లేదా మొబైల్ డేటా ఉపయోగించి ప్రతిలిపి యాప్ ఓపెన్ చేయండి.
- రచన యొక్క సంగ్రహం పేజీకి వెళ్లి మీకు ఇష్టమైన రచనలను డౌన్ లోడ్ చేసుకోండి.
- మీరు ఏ వర్గంలోకైనా వెళ్లి మీకు ఇష్టమైన రచనలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- డౌన్లోడ్ చేసుకున్న రచనలు మీ గ్రంథాలయంలో కనపడుతాయి.మీ గ్రంథాలయంలో ఉన్న రచనలు ఎవరికి కనపడవు.
- గమనిక: వెబ్సైటులో ఆఫ్ లైన్ లోచదవడానికి అవకాశం లేదు.
నైట్ మోడ్:
రచనలను చదివేటప్పుడు మీరు వెబ్సైటు మరియు యాప్ లో నైట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
- యాప్ లో నైట్ మోడ్ ఆన్ చేసుకోవడానికి ఒకసారి స్క్రీన్ పై క్లిక్ చేస్తే నైట్ మోడ్ బటన్ వస్తుంది. దానిని ఆన్ చేసుకోగలరు.
- వెబ్సైటులో రచనను చదివేటప్పుడు టాప్ రైట్ సైడ్ లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి బ్యాగ్రౌండ్ లోకి వెళ్లి మధ్యలో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలరు.
అన్వేషించు:
మీకు ఇష్టమున్న రచనలు, రచయితలను ప్రతిలిపిలో సెర్చ్ చేయవచ్చ.ప్రతిలిపి యాప్ మరియు వెబ్సైటులో సెర్చ్ బార్ టాప్ లో ఉంటుంది . సరైన ఫలితాలు రావాలంటే తెలుగులోనే సెర్చ్ చేయండి. తెలుగులో కాకుండా ఆంగ్లంలో సెర్చ్ చేస్తే సరైన ఫలితాలు రావు.
మీరు సెర్చ్ చేసిన ఫలితాలు రాకపోతే క్రింది వాటిలో ఏదో ఒక సమస్య ఉండవచ్చు.
- మీరు వెతుకుతున్న రచనను రచయిత డ్రాఫ్ట్ లేదా డిలీట్ చేసి ఉండవచ్చు.
- మీరు వెతికే రచయిత/ రచన ప్రతిలిపిలో లేకపోవచ్చు.
- కొన్ని సందర్భాలలో సాంకేతిక సమస్య కూడా ఉండవచ్చు. దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి.
గ్రంథాలయం:
రచనలను సేవ్ చేసుకోవడం :
భవిష్యత్తులో రచనలను చదువుకోడానికి మీకు నచ్చిన రచనలను గ్రంథాలయంలో జత చేసుకోవచ్చు. గ్రంథాలయంలో జత చేసుకోవడం, తీసివేయడం చాలా సులభం. రచన యొక్క సంగ్రహ పేజీకి వెళ్లి గ్రంథాలయం అనే బటన్ పై క్లిక్ చేస్తే రచన గ్రంథాలయంలో జత చేయబడుతుంది.అలాగే అదే బటన్ పై మళ్ళీ క్లిక్ చేస్తే రచనను గ్రంథాలయం నుండి తీసివేయవచ్చు. యాప్ లోని విభాగాలలోకి వెళ్లినచ్చినరచన పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసిన కూడా గ్రంథాలయానికి జత చేసే, తీసివేసేసదుపాయం వస్తుంది.
అదే వెబ్సైటులో అయితే + సింబల్ పై క్లిక్ చేసి రచనను గ్రంథాలయానికి జత చేయవచ్చు, తీసివేయవచ్చు .
సేకరణ రచనలు:
యాప్ లో మాత్రమే :
మీకు నచ్చిన రచనలను సేకరణ చేసుకోవచ్చు. సేకరణ చేసిన రచనలను మీ స్నేహితులకు షేర్ చేయవచ్చు. సేకరణకు రచనలు జోడించడానికి సేకరణ అనే బటన్ ని ఉపయోగించండి. సేకరణ బటన్ రచన యొక్క సంగ్రహం పేజీలో ఉంటుంది. అక్కడి నుండి కొత్త సేకరణను కూడా సృష్టించవచ్చు. మీరు ఆల్రెడీ చేసిన సేకరణలు మీ ప్రొఫైల్ లో ఉంటాయి. సేకరణ షేర్ చేయడానికి సేకరణ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
రీడింగ్ హిస్టరీ:
యాప్ లో మాత్రమే: మీరు ఇప్పటి వరకు చదివిన రీడింగ్ హిస్టరీ గ్రంథాలయంపై క్లిక్ చేస్తే వస్తుంది.
చదివిన నివేదిక:
యాప్ లో మాత్రమే : మీరు ప్రతిలిపిలో చదివిన నివేదిక మీప్రొఫైల్ లో ఉంటుంది.
ఇతర:
మరింత సహాయం కొరకు:
దయచేసి ఇతర ప్రశ్నల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము. దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి.