సేవా నిబంధనలు
https://telugu.pratilipi.com/terms-of-service
గోప్యతా విధానం
https://telugu.pratilipi.com/privacy-policy
ప్రతిలిపిని ఉపయోగిస్తున్నప్పుడు అనుసరించాల్సిన సాధారణ నిబంధనలు
ప్రతిలిపిలో వినియోగదారు పోస్ట్ చేసే ఏదైనా, క్రింద పేర్కొన్న ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.
ఇందులో అన్ని రకాల ఉంటాయి. ఉదాహరణకు వివరణ&ఆలోచనలను షేర్ చేసుకోవడం, వినియోగదారులు ప్రచురించిన విషయాలు, విషయాలపై పాఠకులు రాసిన సమీక్షలు, వినియోగదారుల మధ్య సందేశాలు, వినియోగదారు పేరు, బయో, ప్రదర్శన చిత్రాలు, విషయాలలో ఉపయోగించిన చిత్రాలు, ప్రొఫైల్ స్థాయి వివరాలు.
ప్రామాణిక / ప్రవర్తనా నియమావళి:
i. పదాల ఎంపిక మరియు స్వరం ఏ వ్యక్తి పట్ల అగౌరవంగా ఉండకూడదు.ఏ విధమైన వ్యక్తిగత దాడులు లేదా వేధింపులు సహించవు.
Ii. ద్వేషపూరిత మాటలు వద్దు.. ద్వేషపూరితమాటలు వారి లింగం, జాతి,, జాతీయత, మతం, వైకల్యం, వ్యాధి, వయస్సు, కులం, లైంగిక ధోరణి లేదా అలాంటి ఇతర లక్షణాల ఆధారంగా హింస లేదా ద్వేషాన్ని రేకెత్తిస్తుంది. అలాంటి మాటలు ప్రతిలిపి ఎంత మాత్రం సహించదు.
iii. గోప్యత ఉల్లంఘన - వినియోగదారులు అతని / ఆమె స్పష్టమైన అనుమతి లేకుండా మరొక వ్యక్తికి చెందిన ఏదైనా పోస్ట్ చేయకూడదు
iv.కాపీరైట్ ఉల్లంఘన - వినియోగదారు పోస్ట్ చేసే ఏదైనా అతని / ఆమె స్వంత సృష్టి అయి ఉండాలి. మరొక వ్యక్తి యొక్క రచనలను పోస్ట్ చేయడం అనుమతించబడదు.
v. లైంగిక కంటెంట్ అనుమతించబడదు.
vi. వినియోగదారులు చట్టవిరుద్ధమైన ఏదైనా పోస్ట్ చేయకూడదు.
vii. స్పామ్ అనుమతించబడదు - ప్రకటనలు, ప్రచార విషయాలు, నకిలీ పోస్టింగ్‌లు, బ్యాక్-లింక్‌లు మొదలైనవి స్పామ్‌గా పరిగణించబడతాయి.
viii. ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ లేదా స్క్రిప్ట్‌ల ద్వారా వేదికలో ఏదైనా చర్య అనుమతించబడదు.
ix. పాఠకుల సంఖ్యను పెంచడానికి ఏదైనా చెల్లించిన మార్గాలు అనుమతించబడవు.
x. నకిలీ ఖాతాలు, ఫిషింగ్ మరియు ఇతర మోసపూరిత కార్యకలాపాలు అనుమతించబడవు.
పైన పేర్కొన్న ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కింది వాటిలో దేనిపైనైనా ప్రభావంచూపుతుంది.
i. పాఠకులకు మీ రచనలు చేరుకోవడం తగ్గుతుంది.
ii. మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు లేదా శాశ్వతంగా నిరోధించబడవచ్చు.
iii. తోటి వినియోగదారులు మీపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.
ఈ విషయంలో ప్రతిలిపికి పూర్తి హక్కులు ఉంటాయి.
కాపీరైట్ విధానం :
i. ప్రతిలిపిలో ప్రచురణచేసే రచనల కాపీ హక్కులు రచయితలకు మాత్రమే సొంతం. రచయితలకు వారి రచనలపై అన్నిహక్కులు ఉంటాయి.ఇతరులు వాటిని ఉపయోగించరాదు.
Ii.రచయితల వారి సొంత రచనలను మాత్రమే స్వీయ ప్రచురణ చేయాలి. సేకరణ లేదా ఇతరుల రచనలను ప్రచురణ చేస్తే కాపీ హక్కులను ఉల్లంఘన చేసినట్టే.ఇతరుల రచనలు ప్రచురణ చేస్తే ప్రతిలిపిలోని వారి ప్రొఫైల్ ని తీసివేయడం జరుగుతుంది మరియువారిపై చట్టపరమైన చర్యలు జారీ అవుతాయి.
Iii.ప్రతిలిపిలో ప్రచురణ చేసిన రచనల యొక్క కాపీ హక్కులు రచయితలకే ఉంటాయి.ప్రతిలిపికి ఎలాంటి
హక్కులు ఉండవు.
iv. వినియోగదారులు ప్రతిలిపి నుండి ఏదైనా రచనను కాపీ చేయకూడదు లేదా దొంగిలించకూడదు మరియు మరే ఇతర మాధ్యమంలోనూ పోస్ట్ చేయకూడదు. ఇది రచయిత కాపీరైట్‌ను ఉల్లంఘిస్తుంది.
భద్రత
రిపోర్ట్ చేయండి :
అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, లైంగిక కంటెంట్‌ను పోస్ట్ చేయడం, ద్వేషపూరిత సంభాషణను ఉపయోగించడం, కాపీరైట్‌లను ఉల్లంఘించడం వంటి ఏదైనా విషయాలను గమనిస్తే, దయచేసి వినియోగదారు ప్రొఫైల్‌ను రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన 72 గంటల్లో మా బృందం వినియోగదారు ప్రొఫైల్‌ను బ్లాక్ చేస్తుంది.
యాప్ లో వినియోగదారుని రిపోర్ట్ చేయడానికి, దయచేసి వినియోగదారు ప్రొఫైల్‌కు వెళ్లి, కుడి ఎగువ భాగంలో '3-చుక్కలు' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే 'రిపోర్ట్' ఎంపికను మీరు ఉపయోగించవచ్చు
వెబ్‌లో వినియోగదారుని నివేదించడానికి, దయచేసి వినియోగదారు ప్రొఫైల్‌కు వెళ్లి '!' రచయిత కవర్ చిత్రంపై ఉన్న బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే 'రిపోర్ట్' ఎంపికను ఉపయోగించవచ్చు.
రచనలను రిపోర్ట్ చేయండి :
కాపీ చేయబడిన, అసభ్యకరమైన రచన, కామెంట్ చూసినట్లయితే వెంటనే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన 72 గంటల్లో మా బృందం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
యాప్ లో రచనను రిపోర్ట్ చేయడానికి, దయచేసి రచన యొక్క సంగ్రహ విభాగానికి వెళ్లి, కుడి ఎగువ భాగంలో ''3-చుక్కలు' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే 'రిపోర్ట్' ఎంపికను మీరు ఉపయోగించవచ్చు.
రివ్యూ ని రిపోర్ట్ చేయడానికి రివ్యూ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి రిపోర్ట్ చేయండి.
వినియోగదారు కంటెంట్ రక్షణ :
మీ సమాచారం మాతో సురక్షితం. ప్రతిలిపి మీ వ్యక్తిగత వివరాలను గోప్యతా విధానంలో పేర్కొన్నట్లు లేదా మీ స్పష్టమైన సమ్మతితో మాత్రమే ఉపయోగిస్తారు. మరిన్ని వివరాల కోసం దయచేసి మా గోప్యతా విధాన విభాగాన్ని సందర్శించండి.
ఇతర :
దయచేసి ఇతర ప్రశ్నల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11am నుండి సాయంత్రం 8pm లోపు [email protected] కి మెయిల్ చేయవచ్చు. 24-72 గంటల లోపు మీకు సమాధానం ఇస్తాము..