pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
అనీల గారితో ముఖాముఖి
03 ജൂണ്‍ 2021
  • నమస్కారమండి. ముందుగా మీ గురించి చెప్పగలరా అంటే మీ బాల్యం,చదువు, ఉద్యోగం వగైరా. నమస్కారమండి ....నా గురించి అంటే ముందుగా నా పేరు రాయల అనీల ... అమ్మ,నాన్న,అక్క ,నేను, మాది ఖమ్మం జిల్లా నేను ఖమ్మం లోనే నా బీటెక్ పూర్తి చేసాను .. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను ....
  • మీలోని కవిని మీరు ఎప్పుడు గుర్తించారు?

నా లోని కవిని అంటే ఎలా చెప్పను .... నేను చాలా చిన్న చిన్న కవితలు మాత్రమే రాసాను .. కానీ రాధా కృష్ణ గురించి రాసిన కవితలు అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మొదట నేను రాసిన కవిత వారి ప్రేమ మీదనే

  • మీకు ఒక కథ రాయటానికి ఎంత సమయం పడుతుంది?

నాకు సుమారుగా ఒక 5 నిమిషాల నిడివి ఉన్న కధ అయితే రెండు గంటల సమయం పడుతుంది అది కధ యొక్క లైన్ , మరియు పాత్రలు ,సన్నివేశాలు అన్ని ముందుగానే ఆలోచించుకుంటేనే ..... ఇక ధారావాహికలు అయితే నేను కొంత సమయం తీసుకుంటాను అది కథ సాగే విధానాన్ని బట్టి ఉంటుంది...ఒక్కోసారి కథ రాస్తువెళుతుంటే ముందు అనుకున్న దాని కన్నా ఇంకా ఎక్కువ పొడిగించాల్సి వస్తుంది ,,, ఒక్కోసారి ముగింపు కధనం బట్టి మారుస్తూ ఉంటాను .... నేను ఇప్పుడిప్పుడే కథలు రాయడం మొదలు పెట్టాను కనుక నాకు కథ రాసే సమయం కాస్త ఎక్కువ అవుతుందేమో

  • మీకు బాగా నచ్చిన పుస్తకం పేరు?

నాకు నచ్చినవి చాలా పుస్తకాలు ఉన్నాయి ... కానీ నేను రీసెంట్ గా చదివిన పుస్తకం ది మ్యాజిక్  బై రొండా బర్న్  భలే ఉంది ఆ బుక్ 

  • మీరు ఏం చేస్తున్నారు.ఉద్యోగరీత్యా?

నేను ప్రస్తుతం చదువుకుంటున్నాను ..... ఉద్యోగం చేయడంలేదు

  • ప్రతిలిపి పైన మీ అభిప్రాయం?

నాకు ప్రతిలిపి చాలా అంటే చాలా నచ్చింది .... నాకు ప్రతిలిపి గురించి తెలిసి 2 సంవత్సరాలు అవుతుంది ... ప్పటినుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బోర్ అనిపించలేదు ... ఎన్నో రచనలు, కవితలు ,వ్యాసాలు రకరకాల వర్గాలతో దేనిని మరచిపోకుండా ,ఎవరిని కించపరచకుండా, ఎవరూ సాటి లేరనంతగా  ముందుకు సాగిపోతుంది ... ఎందరో రచయితలను ఒక దగ్గర చేర్చి వాళ్ళల్లోని రచయితులను ప్రపంచానికి పరిచయం చేస్తూ , పోటీలు నిర్వహిస్తూ వాళ్ళల్లోని రచయితకు ఇంకా పదును పెడుతూ అందరిని ఒకే కుటుంబంలా బేదాభిప్రాయాలు లేకుండా చూసుకుంటున్న ప్రతిలిపి యాజమాన్యానికి, ప్రతిలిపి సహకారకులకు నా ధన్యవాదములు

  • మీరు రచనలు చేయడం ఎలా ప్రారంభించారు?

నాకు చిన్నప్పటినుండి కథలు  అంటే చాలా ఇష్టం ....ఈనాడు ఆదివారం లో వచ్చే ప్రతీ కథను చదివేదానిని , నా దగ్గర చాలా నోవెల్స్ కూడా ఉన్నాయి , అలానే కొన్ని కొన్ని కథలు చదివినప్పుడు అబ్బా భలే రాసారు అని అనిపించేది కానీ ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ......కానీ ఈనాడు తెలుగు వెలుగు సంస్థ కథవిజయం -2020 పోటీలు నిర్వహిస్తున్నారు అన్నప్పుడు రాయాలనిపించి మెదటి సారి ప్రయత్నించి ఆ పోటీకొసం ఒక కధ రాసి పంపించాను........ ఆ తర్వాత 2021 ఫిబ్రవరి నుండి ప్రతిలిపి లో రచనలు చేయడం మొదలు పెట్టాను..

  • మిమ్మల్ని బాగా ప్రోత్సహించింది ఎవరు?

అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ నేను కథ రాయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు నా ఇష్టానికి గౌరవం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ... అక్క నే నా మొదటి పాఠకురాలు ,విమర్శకురాలు కూడాను... నేను ఏ కథ రాసిన మొదట తనకి చూపించి తనకి నచ్చిన తర్వాతనే ప్రచురిస్తాను ...

  • మేము అడగని ఏదైనా విషయం మీరు చెప్పదలచుకున్నది ఇంతే చెప్పండి?

మీరు ఈ మధ్య తెచ్చిన సబ్స్క్రిప్షన్, కాయిన్స్ అన్ని బాగున్నాయి .....పోటీలు నిర్వహిస్తూ రచయితలకు ప్రైస్ మనీ కూడా ఇవ్వడం చాలా బాగుంది ఇంకా ఉత్తమ రచయిత అవార్డు , డిజిటల్ అవార్డ్ ఇవ్వన్నీ చాలా బాగున్నాయి కానీ నాదొక చిన్న విన్నపం ప్రైస్ మనీ ముగ్గురికి పెట్టినప్పుడు ఆ తర్వాత స్థానాల్లో ఏ ఏ కథలు ఉన్నాయో కూడా చెబితే బాగుంటుంది ... ఎందుకంటే మొదటి ముగ్గురు విజేతలే కానీ మిగతా రచయితలకు వారి కధలు  ఎవరివి ఎంత దూరం వచ్చాయో కూడా తెలుసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి కనీసం మొదటి పది కథలకైనా ర్యాంకింగ్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం...ఇంకా చిన్న రచయితనైనా నన్ను గుర్తించి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు....

  • ప్రేమతో అనే ధారావాహికలో మీరు పాల్గొన్నారు కదా ...మీ రచనను ప్రేమగా ఎవరికి అంకితం చేశారు?

అదే నేను రాసిన మొదటి ధారావాహిక... అందులో నేను పాల్గొని విజేతని అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.... అందుకే ఆ రచనను ప్రేమతో మా అమ్మానాన్నలకు, అక్కకి అంకితం ఇస్తున్నాను....

  • మీరు ఏమైనా పుస్తకాలు రాశారా?

లేదండీ...... భవిష్యత్తులో రాయొచ్చేమో

  • కొత్త రచయతలకు మీ సలహా ఏమిటి?

నేనూ కొత్త రచయితనే ..మనం ఎప్పుడైనా ఒకరికి నచ్చాలి అని రచనలు చేయకూడదు ముందు మన మనసుకు నచ్చాలి అప్పుడు ఆటోమేటిగ్గా మీ రచనలను అందరూ  మెచ్చుకుంటారు...

  • మీ అభిమాన రచయత ఎవరు?

ఒక్కరని చెప్పలేను...

  • మీకు రచనలు కాకుండా ఇంకే కళలల్లోనైనా అనుభవం ఉందా?

నాకు 3D డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం... నేను చాలా వేసాను కూడా.