pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
రచయిత్రి కాకరపర్తి పద్మజా గారితో ముఖాముఖి
11 సెప్టెంబరు 2017

రచయిత్రి కాకరపర్తి పద్మజా గారితో ముఖాముఖి 

 

మీప పూర్తీ పేరు?

కాకరపర్తి పద్మజా


మీ విద్యాభ్యాసం గురించి?

నేను ఇంటర్ చదివాను. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం ఇష్టం. కాలేజీ రోజులనుటడే ఆశు కవిత్వం అల్లటం ఇష్టం. అలా ఆ అభిరుచి నేటి సాంకేతిక పరోగమనంతో చరవాణి ద్వారా నాకు లభించింది.


భావ కవిత్వం పై మీ అభిప్రాయం?

భావ కవిత్వం అంటే..ఏదైనా ఒక కవిత రాసినప్పుడు భావం ప్రధానం. దీనిని నేను ముఖ పుస్తకంలో ఏకతార అనే సాహిత్య గ్రూపు ద్వారా నేర్చుకున్నాను.  


మీ కుటుంబం గురించి?

మా నాన్నగారు (లేటు) యేచూరి రాజారావు గారు..అమ్మ కమలమ్మ. మాది ఒక సామాన్య కుటుంబం. 


ఛందోబద్ధమైన కవిత్వం నేటి కాలంలో మనుగడ సాగించగలదా?

ఈనాడు పాఠశాలలలో ఆంగ్ల భాషకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగుకు ఇవ్వలేకపోతున్నారు.అలాంటి పరిస్థితులలో ఛంధోబద్దమైన కవిత్వమే అవసరమని అనుకునకుంటున్నాను.ఇది నా అభిప్రాయం  మాత్రమే.


ఇప్పటివరకు మీకు లభించిన అవార్డ్స్ మరియు పురష్కారాలు?

సాహిత్య వేదిక ఏకతార గ్రూపు ద్వారా తొలి పురస్కారం అందుకున్నాను. గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి ఆద్వర్యంలో వాట్స్ అప్ గ్రూపు సాహితీ సవ్వడి తరపున రెండు సార్లు  రాష్ట్ర స్థాయి..జాతీయ స్థాయి అవార్డులు తీసుకున్నాను. సహస్ర సత్రయాగం వాట్స్ అప్ గ్రూపు ద్వారా 63వ సహస్ర కవి మిత్రగా బిరుదు వచ్చింది.ప్రతిలిపి వెబ్ సైట్ నుండి బిరుదు వచ్చింది.ముఖ పుస్తకం  సోషల్ మీడియాలోని కళాంజలి సేవాంజలి గ్రూపు తరపున పురస్కారంతో ఒక అవార్డు కూడా తీసుకున్నాను.


సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?

సాంకేతిక పరిజ్ఞానంతో చరవాణి ద్వారా సాహిత్యంపై అభిరుచితో నా అడుగులు సాహిత్యం వైపు నడిపాయి.ఇందుకు నేను మాపెద్ద అబ్బాయి మహేష్ కుమార్ కి రుణపడి ఉంటాను. ఏమీ తెలియని నాకు చరవాణి గురించి చెప్పి నాకు గురువుగా మారాడు.


మీకు ఇష్టమైన రచనలు/మీకు ఇష్టమైన కవులు/రచయితలు?

ఇష్టమంటూ ఏమీలేవు. ఏవైనా చదువుతాను.ఏతరం వారైనా సాహీతీవేత్తలు అంటే ఇష్టం.


కులం,మతం పై మీ అభిప్రాయం?

కులమన్పా..మతమన్నా ఒకరి ప్రాణాలు తీసి రక్తాన్ని రుచి చూడకూడదు. 


అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు సాహిత్యం గుర్తింపు పొందాలి అంటే మీ సూచనలు?

అంతర్జాతీయంగా సాహిత్యం అభివృద్ది  కావాలంటే అంతర్జాలమే నేడు ముఖ్యం. త్వరగా ఎదగటానికి తోడ్పడుతుంది.అంతర్జాలంలో నేడు సాహిత్యం ఎలా ఉందంటే..ఏదైనా ఒక గ్రూపు లో కాస్త నేర్చుకోగానే..ఎవరికి వారు సొంతంగా గ్రూపు స్టార్ట్ చేస్తున్నారు. దీనివలన సాహిత్యానికి అవధులు లేకుంది. మంచికి చెడ్డ కీ తేడా లేకుండా ఉంది. 


మనిషి ఆనందంగా ఉండటానికి మీ సూచనలు?

మనిషి ఆనందంగా ఉండాలంటే మనసు నిండుకుండలా ఉండాలి. కాలానికి అనుగుణంగా. ..మారుతూ  జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఓర్పు, ఒద్దిక రెండూ అవసరం. 


ప్రతిలిపి పై మీ అభిప్రాయం?

ఎందరో రచయితలను ..వారి సాహిత్యాభిరుచిని బయటపెట్టే ఒక వేదిక. ఒక ఖనిజాన్ని  వెలికి తీసే యంత్రమే ప్రతిలిపి. ఆ ఖనిజాన్ని బంగారం చేసి పసిడివీధిలో నిలబెడుతుంది. 


అఖిలాశ పై మీ అభిప్రాయం?

అఖిలాశ మా భాషా..సహృదయత..నిబద్ధత కు మారుపేరు.చిన్న వయసునే పెద్ద పెద్ద సాహిత్య కార్యాలు నిర్వహిస్తూ...ప్రతిలిపికి ఒక రూపాన్ని ఇచ్చినవారు మా భాషా.

మీ 

జాని.తక్కెడశిల(అఖిలాశ)