ప్రముఖ కవయిత్రి రచయిత్రి తెలుగు వాచక నిర్మాత రాజావాసిరెడ్డి మల్లీశ్వరి. గారి పరిచయం
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి కృష్ణానదీ తీరంలో గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించాను గుంటూరులో విద్యాభ్యాసం చే శారు హైదరా బాదు లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో తెలుగు ఉపాధ్యాయినిగా సుదీర్ఘ కాలం పని
చేశారు.ప్రసస్తుతం విశ్రాంత ఉపాధ్యాయిని.
రాజావాసిరెడ్డి మల్లీశ్వరిగారు మీరు బాల సాహితీ రచయిత్రిగా. బాగా పేరు పొందారు.బాలసాహిత్యం వైపు మీ అడుగులెలా పడ్డాయో. వివరిస్తారా. ?
32 ఏళ్ళు తెలుగు ఉపాధ్యాయినిగా. పని చేసిన నాకు ఆ ఏటికాయేడు సమాజంలో ఎన్నో మార్పులు రావటం చూశాను ఉమ్మడి కుటుంబాలు పోయాయి పిల్లలు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యల వద్ద గడిపే వీలు లేకుండా పోయింది సంఘంలో ఆంగ్ల భాషపై మోజు పెరిగింది మన భాషైన తెలుగుపై అలసత్వం పెరిగింది వచ్చీ రాని ఆంగ్ల భాషలో మాట్లాడటానికి ఇష్ట పడే వారే కాని మనదైన తెలుగున మాట్లాడదామనుకునేవారు తక్కువై పిల్లలలోతెలుగంటే భయం పెరిగింది సులువుగా నేర్పేవారు లేనందున తెలుగుభాష కష్టమనిపిస్తోంది కనుక తెలుగు భాషాపద పరిచయం చేయటానికి నేను బాలసాహిత్యాన్నెన్నుకున్నా తెలుగు పద పరిచయానికై నేనుగేయాన్ని ఎన్నుకుని బాలగేయాలు గేయాలు గేయకథలు పొడుపు కథా గేయాలు వ్యాసాలు బొమ్మల నిఘంటువు మొదలైనవెన్నో పిల్లల కోసం వ్రాశాను. వ్రాయటమే కాదు వాటిని పాడి మన వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేశా.
మనతెలుగు సాహిత్యంలో ప్రస్తుతం బాల సాహిత్యపు కొరత ఉందని భావిస్తున్నారా ?
అవునండి బాలసాహిత్యమంటే. నేడధికంగా కథలే అన్నట్టుంది వాటితో పాటు గేయ సాహిత్యము రావాలి ఇంకా చెప్పుకోవాలంటే.తెలుగు సాహిత్యంలోఏ ఏ ప్రక్రియలైతే ఉన్ఫాయో అవన్నీ బాల సాహత్యంలోను రావాలి. అవన్నీపిల్లల స్థాయిని బట్టి లయాత్మ కమైన విజ్ఞానాత్మకమైన భాషా జ్ఞానాన్ని వినోదాన్నందించేవిగాఉండాలి వాటిలో భాషా పదాలను చక్కగా అందీయగలగాలి ఎందుకంటే అసలు భాషా పదాలు తెలియనపుడు పిల్లలు కకథలైనా గేయాలైనా ఎలా చదువుతారు.
రాజావాసిరెడ్డి మల్లీశ్వరిగారు కొత్తగా బాలసాహిత్యం వ్రాసే రచయితలకు మీరిచ్చేసలహా ఏమిటి. ?
బాల సాహితీ కారుల రచనలలో పైన చెప్పుకొన్నవన్నీష ఆసక్తి కలిగించేలా ఉండాలి అంతే కాదు ఒకప్పటిలా నాటికలు ఏకపాత్సాభినయం వంటి రచనలు రావాలి.
తెలుగు భాషపై మీ అభిప్రాయ మేమిటి. ?
అమ్మ గురించి అభిప్రాయం చెప్పగలమా.....ఇదీఅంతే ఐనా.. ధైర్యం చేస్తా. ఈ మాట ఎందుకంటున్నానంటేతెలుగు గురించి ఎందరెందరో చెప్పారుగదా అందుకు.
తెలుగన్నది సువాసన
భరిత సుమచయ మ్ము
తెలుగన్నది సుందర
తర కాశ్మీరతలమ్ము
తెలుగన్నది ఆంధ్రశాఖ
మైన గోంగూర రుచి
సమమ్ము
తెలుగన్నది చవి చూడక మనలేము
మనము సుమ్ము
పదము చెవిసోక
సామ వేదగాన మగును
పదము చవిచూడ
ద్రాక్షారస పాకమగును
ఎదలు కలుగగ తనియగ పరవశింపగ
సునాఝరుల సంపదలు కురిపించు తెలుగు
నిజం. తెలుగు మన సంపద వారసత్వం మనదనే సుహృద్భావంతో చక్కగా. ముందు తరాలకందించ గలగాలి.
ప్రశ్న.మన తెలుగు సీనియర్ కవులు టెక్నికల్గా వెనుకబడ్డా రనే అభిప్రాయంతో ఏకీభవిస్తారా అవుననుకుంటే వారిని ముందుకెలా తీసుకురావాలి ?
జ.నేనేం చెప్పనండి అది ఎవరికి వారాలో చించుకునే విషయం.
రాజావాసిరెడ్డి మల్లీశ్వరిగారు. మీరు వచన కవిత్వం రాస్తారు మంచి..కవయిత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా వచన. కవిత వ్రాయటంలో మీ. తీరు వేరనిపిస్తుంది. మీరు ఇటీవలే. కైత అన్న వచన కవితా సంపుటిని కూడా ప్రచురించారు నేటి వచన కవిత్వంలో కవిత్వమున్నదంటారా ?
లేదనే చాలా మంది వ్యాసం వ్రాసి దాన్ని ముక్కలు చేసి దాన్నే కవితగా అంటున్నారు కొందరి కవితలో భాషా భావ సమన్వయం ఉండటం లేదు లోతైన అర్థముండదు కొందరి కవితలలో భావుకత తగ్గి కేవలం పదాల పేర్పే కనిపిస్తుంది సందర్భానికి తగిన అర్థవంతమైన పదజాలం ఉండాలి అనుభూతినందించ గలగాలి కవితలో నూతనత్వం అభివ్యక్తిలో కొత్త ప్రయోగాలుండాలి.
వచన కవితా రచనను మీరెప్పటి నుండి చేస్తున్నారు ?
నేను 10 వ తరగతి చదివేటప్పటి నుండే కవితల్ని వ్రాసేదాన్ని.
మీరు చాలా పుస్తకాలు రాశారు కదా. వాటి గురించి చెపుతారా. ?
అవును చాలానే రచించాను. బాల సాహిత్యానికి సంబంధించి. పదంలో పదం అనే బొమ్మల నిఘంటువు తేనె చినుకులు తేనె వాకలు రెల్లుపూలు అమ్మపాట బొమ్మల కొలువు వంటి గేయాలు. గేయకథా
సాహిత్యాన్ని ప్రచురించాను. కైత అనే. వచనా కవితా సంపుటిని ప్రచురించాను.
మీరు ఇంతకు మునుపు భాష గురించి చెప్పారు మరి భాష ను పదుగురికి అందిఃచే ప్రయత్నమేమైనా చేశారా. ?
చేశాను. చేస్తున్నాను. పిల్లలకే కాక ఎందరికో ఉపయుక్త మయ్యే పదావ పరిమళాలు అనే. వ్యాస సంపుటిని ప్రచురించాను ఆ వ్యాలన్ని వార్త దిన పత్రికలో వచ్చినవే అలాగే. విళాలాంధ్ర దిన పత్రికలో వచ్చిన
ఒక్క పదం అర్థాలెన్నో అనే నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటిని తెచ్చాను.అది నవచేతన్ పబ్లిషింగ్ హౌస్. వారు తెచ్చాను.
ఇవే కాక మీరు ఇంకా ఏవైనా పుస్తకాలు వ్రాశారా. ?
అవును వ్రాశానండి 2009-10 మధ్యకాలంలో దాచే పల్లీ పబ్లిషర్స్ వారి యాపిల్ బుక్ కంపెనీ వారికి. 1--8 వ తరగతి వరకు తెలుగు భారతి పేరుతో తెలుగు వాచక రచన చేశాను ఇప్పుడు కూడా ఒక ప్రయివేటు పబ్లిషర్స్కకు lkg నుం డి 5వ తరగతి వరకు తెలుగు వాచక రచనను చేస్తున్నాను అంతే కాదు బాలలవిజ్ఞాన గేయాలు పేరుతో ఒక పుస్తకంముద్రణలో ఉందివాసిరెడ్డి మాట వాస్తవమ్ము. అనే ద్విశతిని తెస్తున్నాను తెలుగు భాషకు సంబంధించి తెలుగు పదాలు అర్థాలు అర్థచ్ఛాయలు ప్రయోగాలు ఉదాహరణలతో కూడిన.... వార్త దిన పత్రికలో విద్య శీర్షికలోప్రచురితమైన వ్యాసాలను నుడుగుడి అనే పేరుతోఒక గ్రంథంగా తెస్తున్నాను
మొత్తం మీద మీరెన్ని. పుస్తకాలు వ్రాశారు...?
జ. నేను వ్రాసిన తెలుగు వాచక రచనతో. కలిపి ఇప్పటి వరకు. 25 పుస్తకాలు వ్రాశాను.
మల్లీశ్వరిగారు మీరు ద్విశతి అంటున్నారు అంటే మీరు పద్యాలను కూడా వ్రాస్తారా. .?
అవును ఇప్పటివరకు కందము ఆటవెలది తేటగీతులుదాదాపు. 1600 పద్యాలు వ్రాశాను.
మీరింత సాహితీ సేవ చేస్తున్నారు కదా మరి మీకేమైనా పురస్కారాలందాయా?
నేనిదంతా భాషమీద ప్రేమతో చేస్తంన్నా ఐనా..నేను యంఏలో ఉన్నపుడు బెస్ట్లిలిరిక్ రైటర్ గా ప్రశంసా పత్రం పొందాను సంఘమిత్రసాంస్కృతీ సాంఘీకసేవా సంస్థ త్యాగ రాయ గానసభ వారుసంయుక్తంగా బాలబంధు. అనే అవార్డునిచ్చారు 2009లోనేను పని చేసిన పాఠశాల నుండి నా భాషా సాహిత్య సేవకు గుర్తుగా జ్ఞాపికను పొందాను 2016లో. బాలసాహిత్యపరిషత్ వారి. జ్ఞాపిక నందుకున్నాను. అపుడే. చిలుకలూరి పేట నుండి డా!రావూరి భరద్వాజస్మారక ఉత్తమ గ్రంథరచనా అవార్డందు కున్నా గురజాడఫౌండేషన్ (యు యస్ఏ) వారినుండిరాష్ట్ర స్థాయి తెలుగుకవితా పురస్కారాన్నందుకున్నా. ఇక వాట్స్ అప్గ్రూపైన తెలుగు కవితా వైభవం వారినుండి ఆ సమూహంలో ఎవరుపొందనన్ని బిరుదులుపొందాను. కవిరత్నతోమొదలై12 బిరుదులు
పొందాను ప్రతిదీ నా ప్రతిభకే లభించినా .. పదివేలపద్యాలపైగా చదివి. పొందిన పద్యశ్రీ బిరుదు ఎన్నో ప్రక్రియలలో రచనలు చేయటం వలన ఎదిరె చెన్నకేశవులుస్మారక విశిష్టబిరుదు..
.సాహితీ ప్రపూర్ణ. అనే బిరుదు అందుకున్న మొదటి వ్యక్తిని నేనుకావటం నాకెంతోసంతోషాన్నిన్నాయి.
ఈ అవార్డులతో మీకు తగిన గుర్తింపు వచ్చిందా ఈ మాట ఎందుకంటే. ఎవరైనా. ఒక ప్రక్రియవోనే కొనసాగుతారు కాని మీరెన్నో ప్రక్రియలలో థచనల చేస్తున్నారు కదా
నేనిదంతా భాషమీద ప్రేమతోచేశాను చేస్తున్నాను ఎవరో ఏదో ఇస్తారని ఆశించి నేనింత విస్తృత రచన చేయలేదు మన పనిని ఎవరైనా గుర్తించి అవార్డులిస్తే ఎవరికి మాత్రం సంతోషం కలుగదు చెప్పండి నాకైనా అంతే. అపుడింకా బాధ్యత పెరుగుతుంది.
మీరిందాక వాట్స ఆప్ గ్రూపు గురించి ప్రస్తావించారు ఆ గ్రూపులలో విస్తృతంగా వస్తున్న సాహిత్యంలో నాణ్యత ఉందంటారా?
లేదనలేం చాలామంది. బాగా వ్రాస్తున్నారు లేదనే కంటే ప్రోత్సహిస్తే. వారే ఇంకా బాగా రాస్తారు.
మల్లీశ్వరిగారు మీకు. .కథా సాహిత్యంలో ప్రవేశముందా..?
ఉందండి. గతంలో. నేను కొన్ని కథలు రాశాను నేను యం ఏలో ఉన్నపుడు మా కాలేజి మాగజీన్ కి. మొదటి కథ వ్రాశాను. ఇటీవల వందల కథలలో నా కథ. 20 వ స్థానంలో నిలిచిందని ప్రతిలిపి వారి ప్రశంసా పత్రం లభించింది మరో కథ బాల కథా సంకలనానికి ఎన్నికైంది. ఐతే. గతంలో అంటే. 1077 లోనే. విజయవాడకు చెందిన నవోదయ పబ్లికేషన్స్ నుండి తిరిగి వచ్చిన వసంతం అనే. నా నవల వచ్చింది. ఆ తరువాత. ఆ ప్రక్రియల వైపు అంతగా పోలేదు.
మీరు వ్యాసాలప్రసక్తి తెచ్చారు. కదామీ వ్యాస రచన ఎప్పుడు మొదలైందిఇప్పటి వరకు దాదాపు. ఎన్ని వ్యాసాలు వ్రాశారు. ?
జ. నాకు గుర్తున్నంత వరకు. నా మొదటి వ్యాసం. గుంటూరు శేషేంద్ర శర్మగారి సాహిత్యం గురించి ఆ. వ్యాసం ఆయనే ప్రచురించిన. ... యువకవి. శేషేంద్ర... అన్న గ్రంథంలో ముద్రింపబడింది ఇప్పటి వరకు నేనుదాదాపు 1000 వ్యాసాలు వ్రాశాను.
మీరు రేడియో టీవి కార్యక్రమాలలో ఎపుడైనా పాల్గొన్నారా. ?
జ. పాల్గొన్నానండి నేను ఉపాధ్యాయి నిగా పనిచేసినపుడు రేడియోలో పిల్లలచే కార్యక్రమాలు చేయించా1070 నుండి 1983వరకు విజయవాడ ఆకాశవాణిలోి స్వీయకవితలు స్కెచ్లు కథలు. చదివాను చర్చలలో పాల్గొన్నా తెలుగు కవితా వైభవం అధ్యక్షులు స్థాపించిన సహస్ర వాణి రేడియో కు నేను నే పాడిన పాట ప్రేరణతో ప్రారంభమైంది ఇక టి వి కార్యక్రమాల వద్దకు వస్తే..్2007 లో. తెలుగు వెలుగు కార్యక్రమంలో 3 లేక 4 నిమిషాల నావై కేటాయించబడిందిి ఆ తర్వాత అప్పటి నుండి. ఈ టీ వి. లో నారీభేరి. ప్రతిధ్వని కార్యక్రమాలలో వరుసగా పాల్గొన్నా ఇటీవల కూడా నారీభేరి కార్యక్రమంలో పాల్గొన్నా మహటీవిలో కూడ పాల్గొన్నా గుంటూరు లోకల్ టివి చానల్లోనా గురించి పది నిమిషాల పరిచయ కార్యక్రమం వచ్చింది
నేటి వార్తా పత్రికలు నిజమైన సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయా ?
మంచి సాహిత్యానికై .ఇంకా చేయాలి. ఆంక్షలు లేకుండా.
మీకిష్టమైన కవులు రచయితల గురించి చెపుతారా?
పూర్వ కవులలోతిక్కన పోతన ఇష్టం ఆధునిక కవులలోకృష్ణశాస్త్రి కరుణశ్రీ తిలక్ శేషేంద్ర ఇష్టం రచయితలలో రాహుల్ దేవ్ సాంకృత్యాయన్ వడ్డెర చండీదాస్ కొడవటిగంటి...ఇలాచాలా మందే. ఐతే ఇష్టమని ఊరుకుంటే ఏమీ రాదు వారిని బాగా చదవాలి వారిగొప్ప వారి రచనలగొప్ప ఏమిటో తెలుసుకోవాలి మనము ఎదగాలి.
కవులు రచయితలకు ప్రఢుత్వ ప్రోత్సాహకాలు పుష్కలంగా ఉన్నాయంటారా. ?
జవాబు అలాం టివి అందుకున్న వారు చెప్తే నే బాగుంటుంది
నేటి కవులు రచయితలు అవార్డుల కోసమే పరితపిస్తున్నారా. ?
ఈ ప్రశ్నకు జవాబు నాకంటే. బాగా గమనించే వారే చెప్పగలరు
నేటి సమాజంలో మహిళలకు భద్రత ఉందా. లేదా. ?
ఎవరికి రక్షణ ఉందో తెలియటంలా
మీ జీవితం లో జరిగిన ఏదైనా. ఒక ఆనందమయ సంఘటన గురించ చెప్పగలరా. ?
నేను ఆ రోజుల్లో చిన్న దానినైనా సాహితీ సభల్లో పాల్గొనే దాన్ని అప్పట్లో పేరొందిన రచయిత్రి తేజోవతి మొదలైన రచయిత లనుండి ప్రశంసలు బహుమతులుగా పుస్తకాలను పొందాను బిఏ రెండవ సంవత్సరంలో ఉన్నపుడు మా కాలేజిలో ఒక యువ కవి. సమ్మేళనం జరిగింది. దానికి కరుణశ్రీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అపుడు నే చదివినకవితలోని నాలుగు పంక్తుల్ని. వారు చదివి. ఇంత మంచి కవితను వ్రాసిన మల్లీశ్వరి భవిష్యత్తులో మంచి కవయిత్రి కాగలదన్నారు అదినాకు అడగకుండాలభించిన ఆశీస్సు ఆ మధుర క్షణాలనెప్పటికి మరువ లేను ఆ ఆశీస్సు నా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది
ప్రతిలిపిపై మీ అభిప్రాయం....?
జ. తెలుగు కవులు రచయితలనెందరినోప్రోత్సహిస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
అఖిలాశ పై మీ అభిప్రాయం....?
యువకుడు ఉత్సాహవంతుడు పరిణత కల కవి స్నేహశీలి వినయశీలి శ్రమకోర్చు వాడు.
మీ
జాని.తక్కెడశిల (అఖిలాశ)