ప్రతిలిపి రచయితల రచనా ప్రయాణంలో కొన్ని భావోద్వేగ సందర్భాలు:
1.కల సాకారమైన వేళ
కనక్ గారు తన రచనలను ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ చేసి, కలల్ని ఆదాయంగా మలుచుకున్నారు. మొదటి సంపాదనతో, స్కూటీ కొనుగోలు చేసి "రాంప్యారి" అని పేరు పెట్టారు. ఈ విజయంతో, తన పాఠకులకు కనక్ గారు కృతజ్ఞతను వ్యక్తపరిచారు. ధైర్యం, పట్టుదలతో కలలు నిజం చేసుకోవచ్చని కనక్ గారి కథ చెబుతోంది.
2.ప్రేమ కానుక
శిఖా గారు వారి తల్లి గారి కోసం డైమండ్ కమ్మలు కొనాలన్న చిరకాల కలను ప్రతిలిపి సంపాదనతో నిజం చేసుకున్నారు. ఆ సంతోషకరమైన సందర్భం, వారిద్దరికీ సువర్ణ జ్ఞాపకంగా నిలిచిపోయింది. సృజనాత్మకతతో సాహిత్యం రచించడం ద్వారా విలువైన కానుకలను కుటుంబ సభ్యులకు అందించగలమని నిరూపితమైంది. శిఖా గారి కథ ద్వారా మర్చిపోలేని జ్ఞాపకాలను గుండె లోతుల్లో ఎలా పదిలపరుచుకోవచ్చో తెలుస్తోంది.
3.బాధ్యతలు - కలలు
రీమ గారు ఇంటిపనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ రాయడమనే తన అభిరుచిని వదులుకోలేదు. ప్రతిలిపిలో పాఠకురాలిగా మొదలై విజయవంతమైన రచయిత్రిగా ఎదిగారు. రీమ గారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే! ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే, రాయడమనే అభిరుచి ఉంటే ఎలా ఎదగవచ్చో, కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నేర్చుకోవచ్చు. వీరి ప్రయాణం ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది.
4.కష్టాల నుండి విజయం దాక
శ్రీ గారు ఆర్థిక ఇబ్బందుల వలన అనేక సవాళ్లను ఎదుర్కున్నారు. అవసరమైన సమయంలో ప్రతిలిపి నుండి వచ్చిన మొదటి ఆదాయం కొత్త ఆశను రేకెత్తించింది. సృజనాత్మకతతో రాయడం ద్వారా కష్టాల చీకటి నుండి విజయాల వెలుగులోకి ఎలా ప్రయాణించవచ్చో శ్రీ గారి మార్గమే చక్కటి ఉదాహరణ.
5.పాఠకుల అనుబంధమే మహా బలం
జ్వాలాముఖి గారు ప్రతిలిపిలో చిన్న కథలను రాస్తూ, పాఠకుల సహకారంతో తిరుగులేని రచయిత్రిగా ఎదిగారు. జ్వాలాముఖి గారి రచనలు పాఠకులను తీవ్రంగా ప్రభావితం చేయడం వల్ల వారి కథలు ఆడియో, పుస్తకాలుగా వచ్చాయి. పాఠకులతో బలమైన సంబంధాలు ఉండటం వల్ల ఎలా ఎదగచ్చో వీరి విజయ మార్గం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం జ్వాలాముఖి గారు ఫుల్ టైం రచయిత్రిగా రచనా ప్రయాణంలో కొనసాగుతున్నారు. పాఠకుల బలమే రచయితలకు అండ.
6.సమాజాన్ని మార్చే సాహిత్యం
మయూరి గారు రచనల ద్వారా సామాజిక సమస్యలపై పాఠకులకు అవగాహనను కల్పిస్తున్నారు. తన సంపాదనను అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చి ఆదుకోవడం గొప్ప లక్ష్యానికి ప్రతీక. వారి కథలు సమాజంలో మార్పును తీసుకురావడంలో ఎంత ప్రభావవంతంగా ఉంటాయో తెలుస్తోంది. ఉన్నతమైన సమాజం కోసం తన వంతు భాద్యతగా రచనల ద్వారా సమాజాన్ని ఉద్దరించడం ఎలానో వీరి కథ ద్వారా తెలుస్తోంది.
7.చిన్ని కోరిక
హకీంకి సైకిల్ కావాలనే కోరిక కోరికగానే మిగిలిపోతుందనుకునే సమయంలో తన తండ్రి గారు ప్రతిలిపిలో ప్రచురించడం మొదలుపెట్టారు. హకీం తండ్రి గారు.. వారి అనుభవాలను రచించి హకీం చిన్న కోరికను తీర్చారు. మనలోని సృజనాత్మక రచయితను కనుగొని, అనుభవాలను రచించడం ద్వారా పిల్లల చిన్ని చిన్ని కోరికలను ఎలా నేరవేర్చవచ్చో అర్థమౌతోంది.
ప్రతి విజయం వెనుక అసాధారణమైన శ్రమ, పట్టుదల, ఆశయం ఉంటాయని పై ప్రతిలిపి రచయితల కథల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతిలిపి రచయితల విజయగాధల ద్వారా ప్రేరణ చెంది విజయం వైపు ప్రయాణించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.