pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

విభిన్నమైన ప్రేమకథలు రాయడానికి అద్భుతమైన ప్లాట్లు

04 जुलाई 2022

ప్రేమ కథలు చదవడానికి ఇష్టపడని వారెవరు? ప్రేమ కథలు అన్ని వయస్సుల పాఠకులకు ఆల్ టైమ్ ఫేవరెట్. ముఖ్యంగా ప్రతిలిపి పాఠకులు ఈ క్రింది అంశాలలోని సిరీస్ చదవడానికి ఇష్టపడుతున్నారు. 

  • పిశాచ /దెయ్యం లవ్ సిరీస్ 

  • బాస్/CEOతో లవ్ సిరీస్ 

  • ఒప్పంద ప్రేమ / ఒప్పంద వివాహంపై లవ్ సిరీస్  

పైన తెలిపిన ఏదైనా అంశాలలో సిరీస్ రాయడం ద్వారా ప్రతిలిపి ప్లాట్‌ఫారమ్‌లో త్వరగా పాపులర్ కావచ్చు. సిరీస్ రాయడంలో మీకు సహాయపడటానికి కొన్ని అద్భుతమైన ప్లాట్‌లను అందించడానికి మేము ఈ బ్లాగును వ్రాశాము. మీరు వీటిలో ఏ ప్లాట్ నైనా ఎంచుకొని సిరీస్ రాసి టాప్ రచయితలుగా ఎదగవచ్చు.

 

ప్లాట్ ఆలోచనలు- పిశాచ/దెయ్యంలవ్ సిరీస్ :

  1. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడతారు. అబ్బాయి చాలా ధైర్యవంతుండు కానీ అమ్మాయి చాలా పిరికిది. మె ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది, కనీసం స్నేహితులు కూడా ఉండరు. ఒకరోజు ఆ అమ్మాయి పళ్లను చూసిన ఆ అబ్బాయి తనొక పిశాచం అని తెలుసుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేదా?

  2. కొన్ని నెలల ప్రేమ బంధం తర్వాత, తన ప్రియుడు సాగర్ రక్త పిశాచి అని పూజ  తెలుసుకుంటుంది. ఆమెకు కోపం వస్తుంది, మోసపోయినట్లు అనిపిస్తుంది, అరుస్తుంది, వెంటనే అతనితో విడిపోతుంది. అయితే సాగర్ ఆమెను నిజంగా ప్రేమిస్తున్నాడు, ఎల్లప్పుడూ ఆమె వెంట ఉండి రక్షించాలని నిర్ణయించుకుంటాడు. అనేక ప్రమాదాల నుండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు.

  3. పిశాచ ప్రపంచం నుండి అందమైన హంక్ అయిన ఇషాన్.. నయనిక అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నయనిక క్లాస్‌మేట్ అయిన సౌరవ్ కూడా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు, త్వరలో ఆమెకు ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకుని ఉంటాడు. నయనికకు ఇషాన్ నుండి ఏదో ప్రమాదం జరగబోతోందని పసిగట్టాడు. ఇషాన్ నుంచి నయనికను సౌరవ్ కాపాడగలడా? ఈ ట్రయాంగిల్ ప్రేమలో ఏమి జరుగుతుంది?

  4. అది 2070, ప్రపంచం మారిపోయింది.  మనిషి చేయవలసిన పనులను యంత్రాలు సులభతరం చేశాయి. మీరా  అనే అమ్మాయి నగరం శివార్లలో సుజోయ్ అనే అబ్బాయిని కలుస్తుంది. సుజోయ్ ఒక రక్తపిశాచి. తను రక్తపిశాచాలను రక్షించే ఒక మిషన్‌లో ఉంటాడు. ఆ విషయం మీరాకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. రక్త పిశాచులు ఉన్నాయని మీరా మొదట నమ్మలేదు. మీరా రక్త పిశాచితో ప్రేమలో పడుతుందా?రక్తపిశాచాలను  కాపాడేందుకు ఆమె కూడా సుజోయ్‌తో చేరుతుందా?

  5. షీనా 10వ తరగతి చదువుతున్నఅమ్మాయి. తన సహ విద్యార్థుల నుంచి నిత్యం వేధింపులకు గురవుతోంది. ఒకరోజు ఆమె తన కొత్త క్లాస్‌మేట్ ఆండ్రూను చూస్తుంది, అతను ఇతరుల కంటే భిన్నంగా కనిపించాడు. వారు మంచి స్నేహితులయ్యారు. ఆండ్రూ తరచుగా మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల వెనుక ఉన్న ఒక పాడు బడ్డ ఇంటికి వెళ్లేవాడు, అక్కడికి పాఠశాల పిల్లలను వెళ్లనివ్వరు. ఒకరోజు షీనా అతని వెనకే వెళ్ళింది.  పగిలిన అద్దంలో ఆండ్రూ రూపురేఖలు మారిపోవడం వెనుక నుంచి చూసింది. ఆండ్రూ కళ్ళు రక్తంతో నిండిపోయాయి. అతని నోటి నుండి రక్తం మరియు రెండు పదునైన పళ్ళు వస్తున్నాయి. ఆండ్రూ ఎవరు? షీనా ఇప్పుడు ఏం చేస్తుంది?

ప్లాట్ ఆలోచనలు - బాస్/ CEO తో లవ్ సిరీస్ :

  1. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుహాని చాలా కష్టపడి పనిచేసే అమ్మాయి, కానీ తనకు మొహమాటం ఎక్కువ. తను ఒక MNC ఆఫీసులో CEOకి సెక్రటరీగా పని చేస్తుంది. CEO తనను రహస్యంగా ప్రేమిస్తున్నాడని మరియు ఆమె కోసం ఆఫీసులో ప్రతీ రోజు ఎదురుచూస్తూ ఉంటాడని ఆమెకు తెలియదు. ఒక రోజు ఆఫీస్ పార్టీలో, తన మేనేజర్ తనని అవమానించినప్పుడు  CEO ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఆమె తన బాస్ ప్రేమను అంగీకరిస్తుందా? ఆమె తన ఆఫీసులో సమస్యలను అధిగమించగలదా? CEOతో ఆమె ప్రేమ ప్రయాణం ఎటు దారి తీస్తుంది? 

  2. పూజా యొక్క కొత్త బాస్ సాహిల్ రాథోడ్. అతడు అహంకారంతో మరియు మొరటుగా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అసలు గౌరవించడు. అయితే పూజ అతడికి పూర్తి వ్యతిరేకం. ఆమె చాలా మర్యాదస్తురాలు, అందరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఈ విభిన్న మనస్తత్వం గల వ్యక్తులు ప్రేమలో పడినప్పుడు ఏమి జరుగుతుంది? వారి ప్రేమ కొనసాగుతుందా? లేదా వారు తమ తమ దారిలో వెళతారా?

  3. అనన్య తన మొదటి ఉద్యోగం ప్రారంభించడానికి ముంబైకి వెళుతున్నప్పుడు రైలులో ఒక మంచి వ్యక్తిని కలుస్తుంది. ప్రయాణం తర్వాత, వారు విడిపోతారు, తను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, రైలులో కలిసిన  వ్యక్తిని తన బాస్‌గా గుర్తించి  షాక్‌కు గురైంది. విధి వారిని కలిపిందా?వారు ప్రేమలో పడతారా?  

  4. హర్ష్ మరియు శృతి మధ్యతరగతి ప్రేమికులు, వారు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.   సహోద్యోగులకు తమ ప్రేమ  గురించి ఇంకా తెలియజేయలేదు. ఒక రోజు, హర్ష్ తన సహోద్యోగుల నుండి వారి యజమాని తన స్నేహితురాలు శృతిని రహస్యంగా ఇష్టపడుతున్నాడని గాసిప్ గురించి తెలుసుకుంటాడు. అతనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. వారిద్దరూ ధనవంతులు కావడానికి మరియు యజమానిని ఆకర్షించడానికి ప్లాన్ చేస్తారు. కథ ఎలా మలుపు తిరుగుతుంది?

  5. అవిక్ యువ చురుకైన మరియు మనోహరమైన వ్యక్తిత్వం కలవాడు. దీంతో పాటు తన కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాడు. తన చుట్టూ ఆడపిల్లలకు కొదవలేదు, వారిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో వెనుకంజ వేయలేదు. ఆడపిల్లలు అతనికి ఆడుకునే ఆటబొమ్మల్లాగా అనిపిస్తారు. మరోవైపు, నీరా చాలా అందమైన, బబ్లీ అమ్మాయి, ఆమె బాల్యం అనాథాశ్రమంలో గడిచింది. నీరా అవిక్ ఆఫీసులో చేరి 10 రోజులైంది. అయితే ఇప్పటి వరకు సీఈవో కంట పడలేదు. అవిక్ చూపు నీరాపై పడగానే ఏం జరుగుతుంది? నీరాను కూడా తన సరదాలో భాగం చేసుకుంటాడా? నీరా అతనితో ప్రేమలో పడి అతని వ్యక్తిత్వాన్ని మార్చగలుగుతుందా?

ప్లాట్ ఆలోచనలు- ఒప్పంద లవ్ సిరీస్ :

  1. 10 ఏళ్లుగా ప్రేమిస్తున్న యువతి సుజయ్‌ను మోసం చేసింది. అతను ఇప్పుడు స్త్రీలను ద్వేషిస్తున్నాడు కానీ ధనిక కుటుంబానికి ఏకైక కొడుకుగా తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒత్తిడికి గురవుతున్నాడు. డబ్బు అవసరం ఉన్న తన ఉద్యోగి పూజాతో కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత విడిపోయేలాగా అతను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పూజ తన బిడ్డతో విడిపోగలదా? ఈ కాంట్రాక్ట్ పెళ్లి ప్రేమ రూపం దాలుస్తుందా? ఈ కాంట్రాక్ట్ సుజయ్‌ని మారుస్తుందా?

  2. పీయూష్ మాజీ ప్రియురాలు అతనితో విడిపోయింది. ఎప్పటిలాగే ఆమె తిరిగి వస్తుందని అతనికి తెలుసు. అయితే ఈసారి మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు అనిపించింది. ఆమెను అసూయపడేలా చేయడానికి, పియూష్ తన దగ్గర పనిచేసే తన సెక్రటరీ నియతితో తన వివాహాన్ని బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇప్పుడు వివాహం చేసుకొని 12 నెలల తర్వాత విడాకులు ఇచ్చే లాగా నియతిని ఒప్పించాడు. కుటుంబ సభ్యుల నుంచి కూడా పెళ్లి ఒత్తిడిలో ఉన్న నియతి అందుకు అంగీకరిస్తుంది. పీయూష్, నియతి ప్రేమలో పడతారా? లేక పీయూష్ తన మాజీ ప్రియురాలిని తిరిగి పొందుతాడా? ఈ ప్రేమలో ఎవరు గెలుస్తారు? 

  1. విజయవంతమైన CEO మరియు బిలియనీర్ అయిన సుజాత, ఒక అందమైన వ్యక్తితో ఒక సంవత్సరం వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకుంది, అతనిని శారీరకంగా ఉపయోగించుకుంటుంది మరియు 1 సంవత్సరం తర్వాత అతడిని వదిలేస్తుంది. ఆమె ప్రతి సంవత్సరం తన కంపెనీ నుండి కొత్త ఉద్యోగిని, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకొని అలానే చేస్తుంది. అజయ్ కంపెనీలో టీమ్ లీడ్‌గా చేరాడు మరియు కొద్ది రోజుల్లోనే సీఈఓ సుజాత దృష్టిలో పడతాడు. కానీ అజయ్ సోదరుడు తన మొదటి ఉద్యోగంలో చేరిన తర్వాత, బాస్ చేత అవమానాలకు గురై ఆత్మహత్య చేసుకున్నందున, అజయ్ పగ తీర్చుకుని ఆమెను చంపాలనుకుంటు ఉంటాడు. సుజాతకు ఆ విషయం తెలియక వారు ఒకరికొకరు దగ్గరౌతారు. తర్వాత ఏమి జరుగుతుంది? 

  1. సంపన్న కుటుంబానికి చెందిన పిల్లాడు ప్రీతమ్. కాలేజీలో చంచల అనే తెలివైన మరియు అందమైన అమ్మాయితో సన్నిహితంగా ఉంటాడు. ఆమెను రహస్యంగా ప్రేమిస్తుంటాడు. కానీ చంచల తన తదుపరి చదువుల కోసం విదేశాలకు వెళుతుంది.  ప్రీతమ్ కుటుంబ సభ్యులు పేద కుటుంబానికి చెందిన సాంప్రదాయ గృహిణి అయిన ప్రియను ఇచ్చి కాంట్రాక్టు వివాహం చేస్తారు. అయితే వీరి వివాహం ఒక ఏడాది కాంట్రాక్టు ఆధారంగా జరిగింది. వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒక సంవత్సరం తర్వాత, చంచల తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? 

  1. "మూడు నియమాలు: నాతో మాట్లాడవద్దు, నన్ను తాకవద్దు, నా వ్యాపారం నుండి దూరంగా ఉండండి." పెళ్లి రాత్రి తన భర్త చెప్పిన మాటలు విని, సుధ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఆమె విడాకులు తీసుకున్న, బిలియనీర్ అయిన రజత్‌తో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించిందని ఆమెకు తెలుసు. ఆమె తన కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలి మరియు తల్లి లోటును మాత్రమే తీర్చాలి. దీని కోసం నిరుపేద కుటుంబానికి చెందిన సుధ అనే అమ్మాయి తన తండ్రి అప్పు తీర్చడానికి పెళ్లి చేసుకొని చాలా డబ్బు సంపాదించింది. కానీ ఆమె హృదయ వేదన ఏమిటి? ఆమె రజత్‌ను తనవైపు ఆకర్షించగలదా? 

ఒకే ఒక్క ప్లాట్ వంద విభిన్న కథలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ ప్లాట్లను ఉపయోగించడానికి సంకోచించకండి మరియు మీ స్వంత మార్గంలో మీ స్వంత సిరీస్ వ్రాయండి. ఈ ప్లాట్ల నుండి సిరీస్ ని రాయడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోండి.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, వీటిలో దేనిలోనైనా వ్రాయడం వల్ల మీకు వేలాది మంది పాఠకులను మరియు అనుచరులను త్వరగా పొందవచ్చుమరియు మీరు ప్రతిలిపి వేదికపై విపరీతమైన రీడ్ కౌంట్ పొందగలరు! ప్రతిలిపి పాఠకులంతా మీ తదుపరి బెస్ట్ సెల్లర్ కథ కోసం ఎదురు చూస్తున్నారు! పైన తెలిపిన ప్లాట్లు అన్ని కేవలం మీ అవగాహన కోసం మాత్రమే సూచించబడినవి. పై ప్లాట్లతోనే విభిన్న ప్రేమ కథ పోటికి గానీ, ప్రతిలిపిలో సాధారణ ప్రచురణ కోసం గానీ సిరీస్ రాయవలసిన అవసరం లేదు. పైన ఉన్న 3 రకాల ప్లాట్లను ఏ వర్గానికి సంబంధించిన సిరీస్ రాయడానికైనా ఉపయోగించవచ్చు.

అభినందనలు

టీం ప్రతిలిపి