pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

100 భాగాల మ్యాజిక్ ఫిగర్ దాటి తమ సిరీస్ పూర్తి చేసిన రచయితలకు శుభాకాంక్షలు

12 মে 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

ఒక  ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్-4' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది.  ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము. 100 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ రాసే ప్రతి రచయితకు ప్రతిలిపి నుండి గ్యారంటీ బహుమతులు ప్రకటించాము. 

100 భాగాల సిరీస్ రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే,  ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు.

నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య  పోటీలో 100 భాగాల సిరీస్ లను ప్రచురించారు. వాటిలో కొన్ని 150/200/250/300 లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో సిరీస్ లు ఉన్నాయి. ప్రతిలిపి రచయితల ప్రతిభ అమోఘం.

ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది. 

పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 

ఇచ్చిన మాట ప్రకారం కొరియర్ ద్వారా మీ అందరికీ స్పెషల్ బహుమతి పంపిస్తాం. దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి, దీనికి సంబంధించి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. 

 

సూపర్ రైటర్ అవార్డ్స్ -4 పోటీకి  ప్రచురించిన అతిపెద్ద  తెలుగు సిరీస్:

తేజు : తెలియనే లేదు నా ప్రాణం నువ్వని  : 190 భాగాలు

 

100 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ ప్రచురించిన రచయితల వివరాలు-

  1. తేజు : తెలియనే లేదు నా ప్రాణం నువ్వని 

  2. మైథిలి నిధి : అబద్ధపు ముసుగు

  3. కుమారి గజని : ఇది ఎవరి కథ

  4. కవితా శ్రీ : చెంత చేరవే ప్రియసఖి

  5. సిరి అర్జున్ : అభయ్

  6. సిరి అర్జున్ : ఏకాంత మంత్రం

  7. మేఘన : అడిగిచూడు..... నీ మనసుని

  8. దేవాన్షిక : ఒరేయ్ బావ ఒసేయ్ మరదలా

  9. విజయ రెడ్డి :  ప్రేమా ఏమాయ చేశావే

  10. పృథ్వి తేజ : ఇదెక్కడి పెళ్ళాం రా బాబోయ్

  11. అవని : మన్నించవే మనసా

  12. ప్రవళ్ళిక భాగవతుల : త్రిధ

  13. ఆలూరి గంగ : మై వైఫ్ సీఇఓ

  14. లక్కీ రెడ్డి : పిశాచి పరిణయం

  15. మీనాకుమారి ముక్తేశ్వర్ : మనసున ఉన్నది చెప్పేది కాదని

  16. పున్నాగ వల్లి :  కోవెలై ఉంది కౌగిలి... దేవి రావాలని 

  17. దేవాన్షిక : ఏ తీరం చేరునో ఈ బంధం

  18. రేఖ : రాగ మాలిక

  19. శశి : నన్ను కాదని నా మదినే వెతుకుంతింది ఎవరో 

  20. లక్ష్మీ ప్రసన్న :  మరువని వలపు

  21. శశి లాస్య : ఓయ్ సీత....ఇలా రా

  22. రాజేష్ తోగర్ల : నీ వలపు మలుపుల్లో

  23. దేవి : నన్ను అల్లుకుంది నీ ఊపిరి

  24. మౌనిక శ్రీనివాస్ రెడ్డి : మై స్ట్రేంజ్ లవ్

  25. కీర్తి ప్రియ : నా ప్రాణమా

  26. పావని : రాముడే రావణుడైతే

  27. రియ : కాస్త జాలి చూపవోయ్

  28. అనుకుమార్ విశ : జీవన తరంగాలు

  29. విభవ : మధురమే ఈ పయనం

  30. సుజాత MVS : నిన్నే వరించా

  31. అజ్ఞాత శర్మ : జరీనా

  32. వెంకట హరిత : ప్రియమైన శ్రీవారు..

  33. వినీల : నా వెంటే నీ వుంటే...

  34. సిరి కృష్ణ : అమృతం కురిసిన రేయి లో

  35. లక్కీ రెడ్డి : ప్రేమించిన ప్రేమ

  36. లహరి రాజశేఖర్ : వసుధా కళ్యాణం

  37. పద్మలత : పక్కింటి అమ్మాయి

  38. భవాని మర్ని : నీ ప్రేమకై

  39. మహా కైలాష్ : ప్రాచీన మాయ జీవుల ప్రపంచం

  40. నర్మద ఏశాల : మైలురాయి

  41. విజయలక్ష్మి అవధానుల : అనగనగా ఒక రామం

  42. శ్రీ మాన్వి : నా ప్రపంచమే నీవుగా

  43. హేమలత : ఎక్కడి దొంగలు అక్కడే..

  44. లక్ష్మిప్రియ ముద్దపు : మన్నించు ఓ ప్రేమా

  45. శివాత్మిక : మనసుని మీటిన మనువు

  46. సాయి హేమ : ఇరువురు ఒక్కటయ్యేర

  47. రాజు : భువన మిత్ర

  48. శారద : పలుపుతాడు!

  49. మహిత రెడ్డి : ఐ హేట్ మై వైఫ్

  50. అనూష మధురెడ్డి : కళ్యాణమే వైభోగం

  51. రమ్య : శివనేత్రం

  52. సాయి హేమ : తనువున ప్రాణమైన చెలి

  53. సిరి మెర్ల : మమతల కోవెల

  54. పవన్స్ వరల్డ్ : నా తనువునా నిలిచినా ప్రాణమా

  55. రమ్య : సావిరహే

  56. పవి : డియర్ మేజర్

  57. పెండ్యాల గాయత్రి : దివ్యపథం

  58. బేతి మాధవి లత : మేఘన జీవిత ప్రయాణం

  59. స్వప్నిక  : రాధ కళ్యాణం ఎవరితో

  60.  రాజు గారి అమ్మాయి: Mr.పెళ్ళాం 

  61. రాచర్ల నరేష్ బాబు : విచిత్ర లేడీ సైకో

  62. అనురాధ మురుగము బూజుల : అవని

  63. స్వీటీ : నువ్వే..నువ్వే కావాలి

  64. వినీల : మా ఇంటి మహాలక్ష్మి

 

ప్రతిలిపి దృష్టిలో మీరంతా సూపర్ రైటర్స్! 

 

ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము.

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 5' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4  తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: 

https://telugu.pratilipi.com/event/ev9figvi4d

 

మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము,

ప్రతిలిపి పోటీల విభాగం