pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రీమియంకి సంబంధించిన సందేహాలు-సమాధానాలు

18 జులై 2023

మీరు అర్హత కలిగిన రచయిత అయితే మరియు మీ సిరీస్ సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో భాగమైతే, ఈ మార్పు మీపై ప్రభావం చూపుతుంది ->

1. ప్రతిలిపిలో నా సంపాదనకు ఎలా ప్రభావితం చేస్తుంది?

A. గోల్డెన్ బ్యాడ్జ్‌ని కలిగి ఉన్న రచయితలందరికీ సంపాదించడానికి సమాన అవకాశాన్ని అందిస్తున్నామని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు మీరు ప్రతిలిపి టీం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్' కింద మీరు పూర్తి చేసిన లేదా కొనసాగుతున్న సిరీస్‌లలో దేనినైనా మీరే నేరుగా ప్రీమియంలో జోడించుకోవచ్చు.

2. సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో భాగమైన నా కొనసాగుతున్న సిరీస్‌కి ఏమి జరుగుతుంది?

A. ప్రస్తుతం సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో భాగమైన సిరీస్ 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్' కింద ఆటోమేటిక్‌గా చేర్చబడుతుంది. అయితే, పాఠకులు మీ సిరీస్‌ని చదివే విధానంలో మేము కొన్ని మార్పులు చేస్తున్నాము. మీ సిరీస్ 16వ భాగం నుండి లాక్ చేయబడుతుంది. ఇంతకు ముందు, లాక్ చేయబడిన భాగాలను చదవడానికి పాఠకులందరూ ప్రచురించిన తేదీ నుండి 5 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మార్పుతో, సిరీస్‌ను ఉచితంగా చదవడానికి, పాఠకులు చివరి భాగాన్ని చదివిన తర్వాత తదుపరి భాగాన్ని అన్‌లాక్ చేయడానికి ఒక రోజు వేచి ఉండవలసి ఉంటుంది. ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియం సిరీస్‌ని చదవగలిగే విధంగానే.

3. ప్రతిలిపి ఈ మార్పును ఎందుకు చేస్తోంది?

A. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ నుండి అర్హులైన రచయితలందరికి సమానంగా సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడానికి మయియు ప్రస్తుత మోడల్‌తో, మీరు కొత్త భాగాలను ప్రచురించిన తర్వాత, 5 రోజుల తర్వాత ప్రతి ఒక్కరూ చదవడానికి ఉచితం. కాబట్టి సిరీస్ పూర్తయిన తర్వాత కొత్త రీడర్ మీ ప్రొఫైల్‌ను సందర్శిస్తే, వారు ఎలాంటి లాక్ లేకుండానే అన్ని భాగాలను చదవగలరు. కానీ ఈ మార్పుతో, ఇది 16వ భాగం తర్వాత శాశ్వతంగా లాక్ చేయబడుతుంది. ప్రచురణ తేదీతో సంబంధం లేకుండా, మునుపటి భాగాలను చదివిన వారికి మాత్రమే సిరీస్ అన్‌లాక్ చేయబడుతుంది.

4. నా పాఠకులకు ఏమి మారుతుంది?

  • వారు 16వ భాగం నుండి లాక్ చేయబడిన భాగాలను చూస్తారు మరియు అంతకు ముందు కాదు.

  • వెయిటింగ్ పీరియడ్ వారి చివరిగా చదివిన భాగం నుండి 5 రోజులకు బదులుగా 1 రోజు ఉంటుంది.

  • ప్రీమియం సిరీస్ మాదిరిగానే, పాఠకులు తదుపరి భాగాన్ని చదవడానికి 1 రోజు వేచి ఉండాలి. వేచి ఉండకుండా నిరంతరం చదవడానికి, వారు ప్రతిలిపి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు లేదా సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు లేదా 5 ప్రతిలిపి నాణేలతో వ్యక్తిగత ఎపిసోడ్‌లను అన్‌లాక్ చేయవచ్చు.

5. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కింద కొనసాగుతున్న నా కొత్త సిరీస్‌ని నేను ఎలా ఎంచుకోగలను?

A. కొత్త సిరీస్‌ను రాసేటప్పుడు, మొదటి 15 భాగాలు ఉచితం. 16వ భాగం ప్రచురించబడిన తర్వాత, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది. సిరీస్ 15 భాగాలు దాటే వరకు ఆ సదుపాయం ఉండదు. 16వ భాగం నుండి మాత్రమే ఫీచర్ అందుబాటులోకి వస్తుందని గమనించగలరు.  

6. 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్' కింద నేను పూర్తి చేసిన సిరీస్‌ని ఎలా ఎంచుకోగలను?

A. మీరు ప్రస్తుతం సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్‌లో సిరీస్‌లు రాస్తున్నట్లయితే, ఈ కొత్త మార్పు కింద మీ సిరీస్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేయబడుతుంది. మీరు సిరీస్‌ని పూర్తి చేసి, ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలనుకుంటే, మీరు మీ సిరీస్ పేజీని ‘సరిచేయండి’ విభాగంలోకి వెళ్లి, ‘ఇతర సమాచారాన్ని సవరించు’ పైన క్లిక్ చేసి, ఈ ప్రోగ్రామ్ కింద మీ సిరీస్‌ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి, మీరు ప్రొఫైల్ పేజీ నుండి సిరీస్‌ని సందర్శిస్తే, ఎంపిక చేయడం పని చేయదు. దయచేసి 'వ్రాయండి' విభాగం నుండి సిరీస్‌ని సందర్శించండి. అలాగే, మీరు ఎంపికను ఎంచుకున్న తర్వాత, కొన్ని గంటల్లో (గరిష్ట సమయ పరిమితి 24 గంటలు) మీకు నిర్ధారణ సందేశం వస్తుంది మరియు మీ సిరీస్ ఈ కొత్త మార్పు / ఫీచర్‌లో చేర్చబడుతుంది.

7. 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్' నుండి నేను నా సిరీస్‌ను ఎలా తీసివేయగలను?

A. మీరు నేరుగా తీసివేయలేరు. సిరీస్ సవరణ స్క్రీన్‌లో, మీరు 'పెయిడ్ ప్రోగ్రామ్ నుండి తీసివేయండి అనే ' ఎంపిక దగ్గర 'కాదు' అని క్లిక్ చేయాలి. ఇది మా టీంకి ఒక అభ్యర్థనను అందజేస్తుంది. మా టీం 72 గంటల్లో మిమ్మల్ని సంప్రదిస్తుంది & తీసివేయడానికి మీకు సహాయం చేస్తుంది.

8. యాప్/వెబ్‌సైట్ నుండి మాన్యువల్ గా తీసివేసే ఎంపిక ఎందుకు లేదు?

A. చదవడానికి డబ్బు చెల్లించే ప్రతిలిపి పాఠకులకు స్థిరమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాము. ప్రోగ్రామ్ నుండి సిరీస్‌ను ఆకస్మికంగా తీసివేయడం, సిరీస్‌ను ముందుగా చదవడానికి చెల్లించే మన పాఠకుల నమ్మకం విచ్ఛిన్నం అవుతుంది.

9. ప్రతిలిపిలో రాసే విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

A. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కింద సిరీస్‌లో ఎంచుకోబడినందుకు ->

  • భాగాలు తొలగించబడవు లేదా డ్రాఫ్ట్ చేయబడవు. మార్పులు చేయడం కోసం మీరు వాట్సాప్ నంబర్ లేదా [email protected] ద్వారా మా టీంని సంప్రదించవచ్చు.

  • అయితే, మీరు సిరీస్‌లోని ఏదైనా భాగాన్ని సవరించగలరు.

  • భాగాలను అటాచ్ చేయడం/వేరు చేయడం అనుమతించబడదు.

  • సిరీస్‌లోని భాగాలను రిఆర్డర్ చేయడం అనుమతించబడదు.

10. ఈ కొత్త మార్పు ఎందుకు?

A. ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు చెడు అనుభవాన్ని నివారించడానికి మేము దీన్ని చేస్తున్నాము. ఒక పాఠకుడు ప్రీమియం/సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారని మరియు నిర్దిష్ట సిరీస్‌ని చదవడం ప్రారంభించారని అనుకుందాం. రచయిత ఏదైనా భాగాన్ని తీసివేస్తే లేదా సిరీస్‌లోని భాగాలను మళ్లీ ఆర్డర్ చేస్తే, అప్పుడు పాఠకుల రీడింగ్  అనుభవం దెబ్బతింటుంది.

11. నా సిరీస్ పూర్తయిందని ఇస్తే ఏమౌతుంది?

A. అంతా అలాగే ఉంటుంది. మీ సిరీస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఉంటుంది & సిరీస్ 16వ భాగం నుండి లాక్ చేయబడుతుంది. సిరీస్ పూర్తయినట్లు అప్డేట్ చేయడం వల్ల, మీ సిరీస్ ఎక్కువ మందికి చేరువవుతుంది.

12. ఈ కొత్త విధానంలో ఎంచుకున్న సిరీస్‌లో డ్రాఫ్ట్/భాగాన్ని షెడ్యూల్ చేయవచ్చా?

A. తప్పకుండా చేయవచ్చు ఎందుకంటే అందులో ఎలాంటి మార్పులు లేవు.

13. నా సూపర్ ఫ్యాన్స్ పఠన అనుభవంలో ఏమైనా మార్పులు ఉంటాయా?

A. లేదు, ఎలాంటి మార్పులు ఉండవు.

14. నా ప్రీమియం సిరీస్‌కు ఏమి జరుగుతుంది?

A. ఎలాంటి మార్పు ఉండదు, అంతా అలాగే ఉంటుంది.

15. నా "పూర్తైన" సిరీస్ సూపర్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ క్రిందద  ప్రచురించబడలేదు కాబట్టి నా కథ ఈ మార్పులో భాగం అవుతుందా?

A. అవును! మీరు ఎప్పుడైనా ఈ ప్రోగ్రామ్ కింద సూపర్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ కింద ప్రచురించబడని మీ పూర్తి సిరీస్‌ని ఎంచుకోవచ్చు. మీరు మీ సిరీస్‌లోని ‘ఇతర సమాచారాన్ని సవరించు’ పేజీలో ఎంపికను తనిఖీ చేయగలరు. 

16. కొత్త మార్పుతో నా సూపర్ ఫ్యాన్స్, పాఠకులు మరియు సంపాదన తగ్గిపోయే ప్రమాదం ఉందని నేను భావిస్తున్నాను.

  • ప్రారంభంలో ఈ మార్పు పాఠకులను ప్రభావితం చేస్తుంది. కానీ, ఈ ప్రభావం తప్పనిసరిగా ప్రతికూలమైనది కాదు & ఇది కాలక్రమేణా సబ్ స్క్రైబర్లను పెంచడంలో సహాయపడుతుంది.

  • మరుసటి రోజు ప్రతి పాఠకుడికి ఎపిసోడ్ ఉచితం కాదు. లాక్ చేయబడిన ఎపిసోడ్‌కు ముందు మొత్తం ఎపిసోడ్‌ను చదివిన పాఠకుడు మరుసటి రోజు తదుపరి ఎపిసోడ్‌ను చదవడానికి ఉచితం. ఇతర పాఠకుల కోసం ఈ భాగం లాక్ చేయబడుతుంది. ఒక పాఠకుడు ఒక రోజులో ఒక ఉచిత ఎపిసోడ్ మాత్రమే చదవగలరు. అలాగే, ఉచిత నాణేలతో, పాఠకుడు ఒకేసారి అతిపెద్ద  సిరీస్ ని చదవలేరు. పాఠకులు అన్ని ఎపిసోడ్‌లను వరుసగా చదవాలనుకుంటే, లాక్ చేయబడిన ఎపిసోడ్‌లను చదవడానికి సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేదా నాణేలను కొనుగోలు చేయాలి.

17. పోటీలకు ప్రచురించిన నా సిరీస్ కి కుడా ఈ మార్పు వర్తిస్తుందా?

A. అవును, పోటీకి ప్రచురించిన సిరీస్ కి కుడా ఈ మార్పు వర్తిస్తుంది. మరియు మీ రచన పోటీకి పరిగణించబడుతుంది. 

18. సిరీస్ లోని లాక్/అన్‌లాక్ చేయబడిన భాగాలు కనబడుతున్నాయి. నా సిరీస్ ప్రీమియంలో ఉన్నట్లేనా?

A. మీ సిరీస్‌ మీద ప్రీమియం (డైమండ్) గుర్తు కనిపిస్తే, ఆ సిరీస్ ప్రీమియంలో ఉన్నట్లు అర్థం. మీ సిరీస్ మీకు లాక్ లో ఉన్నట్లు కనబడవు. కానీ పాఠకులకు మాత్రం లాక్ లోనే ఉంటుంది. అయితే మీ సిరీస్ కి డైమండ్ గుర్తు ఉన్నట్లయితే పాఠకులకు 16 వ భాగం నుండి లాక్ చేయబడి ఉంటుంది. 

19. నేను కొత్తగా జోడించిన ప్రీమియం సిరీస్ ఆదాయాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?

A. మీ ‘నా ఆదాయం’ విభాగంలో మీరు నెల చివరిరోజున మీ ప్రీమియం ఆదాయాన్ని చూడగలరు.