pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

గోల్డెన్ పెన్ అవార్డ్స్ పోటీ ఫలితాలు

16 ఆగస్టు 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గోల్డెన్ పెన్ అవార్డ్' పోటీ ఫలితాలు వచ్చేసాయి!

మేము ఈ పోటీని కేవలం కొత్త రచయితల కొరకు మాత్రమే నిర్వహించాము. కొత్త రచయితలు సిరీస్ రాయడం ద్వారా గోల్డెన్ బ్యాడ్జ్ పొందడానికి ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఈ పోటీని రూపొందించడం జరిగింది. ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది! ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతీ నెల తమ రచనల ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకునే ప్రతీ రచయితకు గోల్డెన్ బ్యాడ్జ్ మొదటి మెట్టు. ఈ పోటీలో పాల్గొని గోల్డెన్ బ్యాడ్జ్ సాధించిన 176 మంది కొత్త రచయితలకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము.

ఈ రచయితలు ఇప్పుడు పాఠకుల కోసం వారి సిరీస్ లాక్ చేసే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. వారు కొత్త సిరీస్ ప్రచురించిన ప్రతీ సారి 16 వ భాగం నుండి సిరీస్ మొత్తం పాఠకుల కోసం లాక్ లో ఉంటుంది మరియు ఆ సిరీస్ ప్రతిలిపి ప్రీమియం సిరీస్ గా మారుతుంది. పాఠకులు మీ సిరీస్ భాగాలను అన్లాక్ చేయడానికి సబ్స్క్రయిబ్ చేసుకోవడం, నాణేలు చెల్లించడం లేదా మరుసటి రోజు వరకు వేచి ఉండడం చేస్తారు. ప్రతిలిపిలో ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ క్రమం తప్పకుండా ప్రచురించడం, సిరీస్ ను లాక్ చేయడం ద్వారా నెలకు ఐదు నుంచి పది వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్న వేలాది మంది ప్రతిలిపి రచయితల జాబితాలో చేరే అవకాశం వారికి లభిస్తుంది.

అంతేకాకుండా ఈ గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలు 'ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్-6' పోటీలో పాల్గొని ఆకర్షనీయమైన నగదు బహుమతులు, ప్రత్యేక ప్రశంసా పత్రాలు, అవార్డులు మరెన్నో ఇతర ప్రయోజనాలను పొందుతారు.

'గోల్డెన్ పెన్ అవార్డ్' పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో లక్షలాది మంది పాఠకుల హృదయాలను తాకే సిరీస్ రాసే ప్రతిభ, సామర్థ్యం మీ అందరికీ ఉన్నాయని మాకు తెలుసు. ప్రతిలిపిలో క్రమం తప్పకుండా ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ ఉంటే విజయవంతమైన రచయితగా ఎదగడానికి సహాయపడతామని మేము హామీ ఇస్తున్నాము.

గోల్డెన్ బ్యాడ్జ్ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన రచయితలందరికీ అభినందనలు తెలుపుతున్నాము.

నగదు బహుమతి 1000/- రూపాయలు + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ పొందిన మొదటి 10 రచనలు:

రచయిత రచన
అరవింద్ "పెండ్యాల" సౌదామిని
లావణ్య వసంత శిశిరం
షకీర షేక్ విజయస్వప్నిక
శాంతి కృష్ణ నాలో ఉన్నది నీవేగా
రవికుమార్ థ్రిలింగ్ ఇన్ లైఫ్
స్రవంతి అప్పలమ్మ ఆత్మ కథ
కిరణ్మయి నువ్వే నా జీవిత భాగస్వామివి
సువర్ణ రెడ్డి మూడు ముళ్ళ బంధం
చేతన అమూల్యమైన నిధి
R.k. తార జీవన పోరాటం

 

మా న్యాయనిర్ణేతలు మెచ్చిన మరికొన్ని రచనలు: 

రచయిత రచన
సౌజన్య పతివాడ Mr.హ్యాండ్సమ్ Ms.తింగరి
కళ ఏడు అడుగుల బంధంతో చిగురించిన ప్రేమ
శ్రీ కొక్కిశ "అక్షర లోకం" నిశిలో శశివై రావే... సఖి
రవికుమార్ జిందగీ
సువర్ణ రెడ్డి అవును, ఎందుకంటే..?
కావ్య 💕💕 ప్రేమ 💕💕
బెల్లం మల్లీశ్వరి చిన్నకోడలు
మోహిని మనసుల అలజడి
షేక్ జమీల భాను నువ్వు నేనే
తారానాథ్ అనన్య (ఒక ప్రేతాత్మ కథ)
బండారి శ్రీలత నాలో ఉన్న ప్రేమ
షకీర షేక్ అందమైన ప్రేమ
లలితా "శ్రీనిలయ" మనసా మన్నించలేవా
చందన "ఉనికి" అలా మొదలైంది 💞💞
Dr గీత "మదిలో మాటలు" ఏమాయ చేసావే
సుశీల రమేష్ వారసుడొచ్చాడు
నందిరాజు కృష్ణకుమారి వరూధిని
రజని చౌదరి కలవరమాయే మదిలో
సంధ్య రాంబాబు పెళ్లి తర్వాత ప్రేమ

 

గోల్డెన్ పెన్ అవార్డ్స్ పోటీకి ప్రచురించిన అతిపెద్ద సిరీస్: 

లక్ష్మీ రాజ్ : ACP రుద్ర ప్రతాప్ : 110 భాగాలు

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదములు. పోటీలో పాల్గొన్న రచయితలకు త్వరలో డిజిటల్ ప్రశంసా పత్రం మెయిల్ చేస్తాము. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :[email protected]