pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి కాపీహక్కులను ఎలా రక్షిస్తుంది

08 జనవరి 2024

గౌరవనీయులైన రచయితలకు,

వివిధ వ్యక్తులు, ప్లాట్‌ఫారమ్‌లు స్కామ్ చేయడానికి తమని సంప్రదించారని ప్రతిలిపి రచయితల నుండి మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలిసింది.  

మా రచయితలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మకూడదని, అవగాహన పెంచుకోడానికి క్రింది మార్గదర్శకాలను పూర్తిగా చదవమని సూచిస్తున్నాము. 

  1. ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు కొద్ది మొత్తంలో డబ్బు ఇచ్చి, వారి ప్లాట్‌ఫారమ్‌లలో రాయమని మిమ్మల్ని అడిగితే వారిని వెంటనే బ్లాక్ చేయండి. అలాంటి వారికి మీరు స్పందిస్తే, దాని ఫలితంగా మీరు మీ రచనల కాపీహక్కులను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్ ఇస్తామని మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సందేశం విభాగంలో అలాంటి వారిని వెంటనే బ్లాక్ చేయండి. 

  1. ప్రతిలిపి లేదా మరేదైనా ప్లాట్‌ఫారం నుండి మీ రచనలను తీసివేయమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు, మీ కాపీహక్కులను కోల్పోయే ప్రమాదం ఉందనడానికి అది మొదటి సంకేతం.

  1. ప్రతిలిపిలో, మేము రచయితల నుండి పూర్తి కాపీహక్కులను క్లెయిమ్ చేయము. మా టీం ఏదైనా హక్కులను కోరినప్పుడు, సమగ్ర నిర్ణయం తీసుకోబడుతుంది మరియు మేము కాంట్రాక్ట్ నిబంధనలను సులభంగా వివరిస్తూ ఇమెయిల్‌ను అందిస్తాము. మేము మా అగ్రిమెంట్లలో పారదర్శకంగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తాము.

  1. ప్రతిలిపిలో, మేము రచయితలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల హక్కులను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాము, వాటిని ఇతరులకు ఎలా ఇవ్వచ్చో తెలియజేస్తాము. ఉదాహరణకు, మేము నిర్దిష్ట కాలం పాటు అడాప్షన్ హక్కులను (రచనను కామిక్స్, వెబ్ సిరీస్‌లు, పుస్తకాలు, ఆడియో మొదలైన వివిధ ఫార్మాట్‌లలోకి మార్చే హక్కు) పొందుతాము. మేము రచన యొక్క పూర్తి కాపీహక్కులము పొందాలనుకున్నట్లు అయితే, అది ముందుగానే ఒప్పందంలో స్పష్టంగా తెలియజేస్తాము.

  1. కాపీహక్కుల గురించి తెలుసుకోవడం రచయిత యొక్క ప్రాథమిక హక్కుగా మేము భావిస్తున్నందున, రచయితలు పూర్తి కాపీహక్కులను వదులుకోవడం మానుకోవాలి. అదనంగా, చాలా మంది రచయితలు భవిష్యత్తును అర్థం చేసుకోవడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పరిణామంతో, ప్రతిలిపి వంటి ప్లాట్‌ఫారంలలో రచనలు త్వరలో 20 భాషలలోకి అనువదించబడతాయి, తద్వారా రచయితలు ప్రతి భాష నుండి సంపాదించవచ్చు. ఆడియో, ఫిల్మ్ & కామిక్స్ వంటి హక్కులు వేరుగా ఇవ్వబడతాయి, రచయితలు విభిన్న స్ట్రీమ్‌ల నుండి సంపాదించడానికి వీలు కలుగుతుంది.

  1. మీరు చేసే ఏదైనా అగ్రిమెంట్ అర్థం చేసుకోవడానికి, న్యాయవాదిని సంప్రదించడానికి సంకోచించకండి లేదా [email protected]లో ప్రతిలిపి బృందం నుండి సహాయం పొందండి. ప్రతిలిపి బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది & మీఅగ్రిమెంట్ లో ఉపయోగించిన వివరణ, భాష ద్వారా అందులోని లొసుగులను అర్థం చేసుకోవచ్చు.