pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి ఫెలోషిప్ ప్రోగ్రాం 2.0

01 సెప్టెంబరు 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

 

మేము ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రతిలిపి ఫెలోషిప్ ప్రోగ్రాం గొప్ప విజయం తర్వాత, తమ రచనా ప్రయాణంలో విజయం పొందాలని కలలు కనే ఔత్సాహిక రచయితలందరికీ మరో 7 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ఉచిత ఆన్‌లైన్ రైటింగ్ మాస్టర్‌క్లాస్‌తో ‘ప్రతిలిపి ఫెలోషిప్ ప్రోగ్రాం 2.0’ని అందిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం సెప్టెంబర్ 8, 2023 నుండి ప్రారంభమవుతుంది. పాఠకులు ఇష్టపడే అతిపెద్ద, ఎక్కువ భాగాల, ప్రీమియం బెస్ట్-సెల్లర్ ఫిక్షన్ రైటింగ్ సిరీస్ గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే రచయితలందరికీ స్వాగతం.

 

గత ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమంలో, 10 వేల కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన రచయితలు పాల్గొని వారి రచనా నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క రెండవ ఎడిషన్ మీ విజయవంతమైన రచనా ప్రయాణానికి మిమ్మల్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన 7 రోజుల ఉచిత రైటింగ్ మాస్టర్‌క్లాస్ కోసం మీరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రతిలిపి కోరుతోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ప్రతిలిపిలో రచయితలుగా లేని వారిని కూడా మీరు ఆహ్వానించవచ్చు.  ఈ ప్రోగ్రాం ముగిసే సమయానికి, ఆకట్టుకునే అతిపెద్ద సిరీస్‌ను రూపొందించడంలో, ప్రతిలిపి వేదికలో విస్తృత పాఠకులను చేరుకోవడానికి & ఆదాయాన్ని సంపాదించడంలో మరింత మెరుగుపడతారని మేము నమ్ముతున్నాము. 

 

*************************************

 

ఈ 7 రోజుల మాస్టర్‌క్లాస్‌లో మీరు నేర్చుకునే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి -

 

1. ఒక చక్కని ఆలోచనను ప్లాన్ చేసుకొని అతిపెద్ద సిరీస్ గా ఎలా రాయాలనే దానిపై రహస్యాలను తెలుసుకోవచ్చు.

2. రొమాన్స్/ప్రేమ, సోషల్, థ్రిల్లర్, హారర్ & రివెంజ్ వంటి వివిధ వర్గాల్లో బెస్ట్ సెల్లర్‌లను రాయడానికి వివిధ మార్గాలను తెలుసుకోవడం. 

3. ప్రతిలిపి అతిపెద్ద సిరీస్‌లు రాయడంపై ఎందుకు దృష్టి పెట్టింది? అది మీ రచనా ప్రయాణాన్ని ఎలా మార్చగలదు?

4. ఆన్‌లైన్ సాహిత్య ప్రపంచంలో మిలియన్ల కొద్దీ పాఠకులను ఎలా చేరుకోవాలి & విజయవంతమైన రచయితగా ఎలా మారాలి?.

5. మీ సిరీస్‌ను 50+ భాగాలకు మించి రాయడానికి వివిధ ప్రసిద్ధ రచనా పద్ధతులు తెలుసుకోవడం. 

6. ప్రతిలిపి యాప్‌లో ట్రెండింగ్ ప్రీమియం సిరీస్ యొక్క లోతైన విశ్లేషణ.

7. రచయితగా ప్రతిలిపి యాప్‌లో జనాదరణ & అధిక ఆదాయాలను పొందటానికి రహస్య చిట్కాలు.

8.మీ సిరీస్ రైటింగ్ ప్రాసెస్‌ని మెరుగుపరచడానికి సాఫ్ట్‌వేర్‌లు, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ని ఎలా  ఉపయోగించుకోవాలి?.

9. రచయితలు ఎదుర్కొనే సాధారణ సవాళ్లను ఎలా అధిగమించాలనే దానిపై ఆచరణాత్మక పద్ధతులు.

 

*************************************

 

‘ప్రతిలిపి ఫెలోషిప్ ప్రోగ్రాం 2.0’ లక్ష్యం ఏమిటి?

 

మా రచయితలు చాలా మంది అతిపెద్ద సిరీస్‌లు రాయడంపై శిక్షణ పొందినట్లయితే అసాధారణమైన, బెస్ట్-సెల్లర్ అతిపెద్ద సిరీస్‌లను రాస్తారని మేము గ్రహించాము. అందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు నమోదు చేసుకుంటే, అనేక భాగాల అతిపెద్ద ప్రీమియం బెస్ట్ సెల్లర్ సిరీస్‌లను ఎలా రాయాలనే వివిధ పద్ధతులపై ప్రతిలిపి బృందం ద్వారా మీరు ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ తర్వాత, మీరు ప్రతిలిపి ప్రీమియం విభాగం నుండి సంవత్సరానికి 2 లక్షల వరకు సంపాదించడానికి వీలు కల్పించే అతిపెద్ద సిరీస్‌లను అప్రయత్నంగా ప్లాన్ చేసి రాయగలరు.

 

*************************************

 

‘ప్రతిలిపి ఫెలోషిప్ ప్రోగ్రాం 2.0’లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

 

1. శిక్షణ తర్వాత, పాఠకులు ఇష్టపడే అతిపెద్ద ప్రీమియం సిరీస్‌ను ఎలా రాయాలనే దానిపై మీకు లోతైన అవగాహన ఉంటుంది, అలాగే ప్రతి నెలా ప్రీమియం రాయల్టీ ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోండి.

2. మీరు 7 రోజుల ప్రత్యక్ష రైటింగ్ మాస్టర్‌క్లాస్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత శిక్షణా మెటీరియల్ & వీడియోలకు జీవితకాల యాక్సెస్.

3. మీరు మా శిక్షణ ప్రకారం సిరీస్ రాయడం పూర్తి చేసిన తర్వాత, ప్రతిష్టాత్మకమైన 'ప్రతిలిపి ఫెలోషిప్ సభ్యులలో' ఒకరు అవుతారు & ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిలిపి శిక్షణా ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారు.

4. ప్రతిలిపి ఫెలోషిప్ సభ్యునిగా, మీరు క్రింద పేర్కొన్న విధంగా ప్రతిలిపి బృందం నుండి అనేక ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు:

  • మీ సిరీస్ నెల రోజుల పాటు ప్రతిలిపి హోమ్ పేజీలో ప్రత్యేకంగా ప్రచారం చేయబడుతుంది.

  • మీ సిరీస్ మా అధికారిక ప్రతిలిపి Facebook పేజీలో షేర్ చేయబడుతుంది.

  • ప్రతిలిపి బృందం ఎల్లప్పుడూ ఫోన్/వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది & కథ రాసేటప్పుడు కష్టంగా అనిపిస్తే మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

 

*************************************

 

ఈ ఫెలోషిప్ కార్యక్రమం ఎలా నిర్వహించబడుతుంది?

 

8 సెప్టెంబర్ 2023 నుండి ప్రతిలిపి బృందం ప్రతిరోజూ 1 గంట లైవ్ వీడియో శిక్షణా సెషన్‌లను వరుసగా 7 రోజుల పాటు నిర్వహిస్తుంది. శిక్షణ ముగిసిన తర్వాత, మేము అతిపెద్ద ఎక్కువ భాగాల సిరీస్‌ను రాయమని అడుగుతాము. మీరు ఛాలెంజ్‌ని స్వీకరించి, సిరీస్ రాయడం పూర్తి చేస్తే, మీరు 'ప్రతిలిపి ఫెలోషిప్ మెంబర్'గా మారడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని పొందుతారు & మీ ఇంటి చిరునామాకి ప్రత్యేకమైన ప్రతిలిపి ట్రైనింగ్ సర్టిఫికేట్‌ను అందుకుంటారు.

 

*************************************

 

మీరు రాయడం పట్ల తగినంత మక్కువ కలిగి ఉన్నారా? మీరు మీ రచనా ప్రయాణంలో విజయం పొంది ప్రతి నెలా సంపాదించాలనుకుంటున్నారా? భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ సాహిత్య వేదికైనా ప్రతిలిపి నుండి ప్రత్యేక శిక్షణ పొందేందుకు & సిరీస్ రచనలో మాస్టర్‌గా మారడానికి గొప్ప అవకాశం. 

 

ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేసి ఫెలోషిప్  ప్రోగ్రాం వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

https://chat.whatsapp.com/Hc5V32qSUp0Lt8VFI6pQjW

 

 

శుభాకాంక్షలు, 

ప్రతిలిపి ఫెలోషిప్ టీం