pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి ఎమర్జింగ్ రైటర్స్ అవార్డ్ పోటీ ఫలితాలు

12 జనవరి 2024

గౌరవనీయులైన రచయిత గారికి,

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిలిపి ఎమర్జింగ్ రైటర్స్ అవార్డ్ పోటీ ఫలితాలు వచ్చేసాయి!

మేము ఈ పోటీని కేవలం కొత్త రచయితల కొరకు మాత్రమే నిర్వహించాము. కొత్త రచయితలు సిరీస్ రాయడం ద్వారా గోల్డెన్ బ్యాడ్జ్ పొందడానికి ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఈ పోటీని రూపొందించడం జరిగింది. ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది! ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతీ నెల తమ రచనల ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకునే ప్రతీ రచయితకు గోల్డెన్ బ్యాడ్జ్ మొదటి మెట్టు. 

ఈ పోటీలో గోల్డెన్ బ్యాడ్జ్ పొందిన రచయితలు ఇప్పుడు పాఠకుల కోసం వారి సిరీస్ లాక్ చేసే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. వారు కొత్త సిరీస్ ప్రచురించిన ప్రతీ సారి 16 వ భాగం నుండి సిరీస్ మొత్తం పాఠకుల కోసం లాక్ లో ఉంటుంది మరియు ఆ సిరీస్ ప్రతిలిపి ప్రీమియం సిరీస్ గా మారుతుంది. పాఠకులు మీ సిరీస్ భాగాలను అన్లాక్ చేయడానికి సబ్స్క్రయిబ్ చేసుకోవడం, నాణేలు చెల్లించడం లేదా మరుసటి రోజు వరకు వేచి ఉండడం చేస్తారు. ప్రతిలిపిలో ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ క్రమం తప్పకుండా ప్రచురించడం, సిరీస్ ను లాక్ చేయడం ద్వారా నెలకు ఐదు నుంచి పది వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్న వేలాది మంది ప్రతిలిపి రచయితల జాబితాలో చేరే అవకాశం వారికి లభిస్తుంది.

అంతేకాకుండా ఈ గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలు 'ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్-7' పోటీలో పాల్గొని ఆకర్షనీయమైన నగదు బహుమతులు, ప్రత్యేక ప్రశంసా పత్రాలు, అవార్డులు మరెన్నో ఇతర ప్రయోజనాలను పొందుతారు.

'ప్రతిలిపి ఎమర్జింగ్ రైటర్స్ అవార్డ్' పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో లక్షలాది మంది పాఠకుల హృదయాలను తాకే సిరీస్ రాసే ప్రతిభ, సామర్థ్యం మీ అందరికీ ఉన్నాయని మాకు తెలుసు. ప్రతిలిపిలో క్రమం తప్పకుండా ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ ఉంటే విజయవంతమైన రచయితగా ఎదగడానికి సహాయపడతామని మేము హామీ ఇస్తున్నాము.

ప్రేమ కథలు పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన రచయితలందరికీ అభినందనలు తెలుపుతున్నాము.

 

మొదటి 6 మంది విజేతలు :  ప్రతిలిపి నుండి రైటింగ్ కిట్ కొరియర్ ద్వారా పంపడం, విజేతా ప్రశంసా పత్రాలు మెయిల్ చేయడం జరుగుతుంది. 

 

  1. టైం ట్రావెల్ -గుళ్ళపల్లి సరిత

  2. నువ్వు నేను ఒక్కటని - ప్రసన్న శ్రీనివాస్

  3. ఆ అడవిలో అమ్మాయి- సువర్ణ రెడ్డి

  4. విన్నర్ - ప్రియ యశోధర

  5. మది మరువదే నీ రూపం- త్రివేణి

  6. మనస్సు భాష వేరు - ch. ఫాతిమా

 

మా న్యాయనిర్ణేతలు మెచ్చిన మరికొన్ని రచనలు: 

 

రచన

రచయిత

జర్నీ

అజీబ

పియుష్... ది రెబెల్

లిఖ

అగ్ని పునీత

చెరువు రాజ్య లక్ష్మి

పుత్రికాపరిణయం

కాత్యాయని

రెప్ప వెనకాల స్వప్నం

అపర్ణ శ్రీనివాస్

చిగురించిన ప్రేమ

కళ్యాణి

అమృత ప్రేమ కోసం

పాలకుర్తి వైష్ణవి "Vaishu విరిచిత"

బడి

సంధ్య రాణి

తెలియనేలేదే... నా ప్రాణం నువ్వని

శ్రీ కొక్కిస

ప్రేమ వెన్నెల

సత్య శిరీష

నిను కమ్మే చీకటి నేను

శేతాన్షి

ముగ్ధ మనోహరుడు

స్వాతి రామసుధ

అరుణలాలిత్యం

గాయత్రి "త్రయాక్ష"

ప్రేమ ఎంతో మధురం

తాతా మోహన కృష్ణ

అనుకోని బంధం

నమ్రత

వలయ రక్తాక్షీ

ప్రార్ధన "నవలహరి"

ఈ తరం తల్లి

యామిజాల అనూష

వీడిన బంధం

గగన

 

పోటీలో పాల్గొని గోల్డెన్ బ్యాడ్జ్ పొందిన రచయితలు:

 

రచన

రచయిత

అందుకోవా నా చేయి

శ్రీముఖపూర్వ

నీవు నేర్పిన విద్యయే

శారద చింతల

గృహలక్ష్మి వెయిట్ లాస్ సెంటర్

లేహ శ్రీ

అనుకోనే లేదుగా కల కానే కాదుగా

రాక్షసి "శ్రీ"

ఆ అడవిలో అమ్మాయి

సువర్ణ రెడ్డి

ఆమె పయనం ఎటు

తులసి వేణి

విన్నర్

ప్రియ యశోధర

జతగా ప్రతి జన్మకి నువ్వే నా చెలి

హరిత "Eshu.."

పెళ్లితో కోరుకున్న ప్రేమ

తను తన్మయి

నీకై వేచి చూసే కనులు

ప్రతిలిపి రచయిత

నా సీత కథ

రాజ్ కమల్

ఆమె ఎవరు??

స్వీటీ

నా మనస్సు నీ సొంతం

జ్యోష్ణ

వీడిన బంధం

గగన

 

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదములు. పోటీలో పాల్గొన్న రచయితలకు త్వరలో డిజిటల్ ప్రశంసా పత్రం మెయిల్ చేస్తాము. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :[email protected]