pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్ : 6 పోటీలో 60 భాగాల సిరీస్ రాయడానికి చిట్కాలు

21 अगस्त 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

భారతదేశ అతిపెద్ద సాహిత్య పోటీ ‘ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్’ మళ్లీ ప్రారంభమైంది. మీరు కేవలం 60 భాగాల సిరీస్ రాసి పోటీకి ప్రచురిస్తే ప్రతిలిపి సూపర్ రైటర్ గా మారి ఆకర్షణీయమైన బహుమతులు, ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

60 భాగాల సిరీస్ రాసి ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవడానికి కొన్ని రహస్యాలను/చిట్కాలను మీతో పంచుకుంటున్నాము.

1. వన్ లైన్ ప్లాట్ ఐడియా: ముందుగా ప్లాట్ గురించి 1 లైన్ ప్లాట్ ఐడియా రాసి పెట్టుకోండి. ఆ వాక్యం ఏదైనా న్యూస్ పేపర్ నుండి/రోజువారీ జీవిత సంఘటన/ టీవీ వార్తలు/ ఏదైనా సోషల్ మీడియా పోస్ట్/ ప్రతిలిపి పాఠకుల సమీక్షల నుండి ప్రేరణ పొంది రాయవచ్చు.

2. సిరీస్ సారాంశాన్ని సగం పేజీ వరకు రాయండి: పైన రాసిన 1 లైన్ ప్లాట్ ఐడియా నుండి మీ సిరీస్ సారాంశాన్ని , సిరీస్ ప్రారంభం & ముగింపు , సిరీస్ లో అవసరమయ్యే ప్రధాన పాత్రల గురించి ముందే రాసి పెట్టుకోండి.

3. ప్రధాన పాత్రల గురించి రాయండి: మీ సిరీస్ లో ఉండవలసిన ప్రధాన పాత్రల గురించి రాయండి. ఆ పాత్రలు ఎక్కడ నివసిస్తున్నాయి? వారి జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి? వారి వ్యక్తిత్వం ఏమిటి? మీ సిరీస్ లో అవసరమైన ఇతర పాత్రలు ఎవరు? లాంటి విషయాలపై 4-5 వాక్యాలను రాసి పెట్టుకోండి.

4. సిరీస్ మొదటి నుండి చివరి దాకా వచ్చే సంఘటనలను రాయండి: పైన రాసిన సారాంశం మరియు పాత్రల ఆధారంగా బాగా అలోచించి సిరీస్ మొదటి నుండి చివరిదాకా జరిగే ముఖ్యమైన సంఘటనలను రాయండి.

1,2,3,4 వంటి అంకెలను ఉపయోగించి సిరీస్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక్కో పాయింట్ కు ఒక లైన్ చొప్పున రాసి పెట్టుకోండి.

5. మీ సిరీస్ ని భాగాలుగా విభజించండి: పోటీకి తగ్గట్టుగా 60 భాగాల సిరీస్ ని ప్లాన్ చేసే సమయం ఆసన్నమైంది. సిరీస్ మొత్తాన్ని 6 భాగాలుగా విభజించి, ప్రతీ భాగానికి సంబంధించిన ప్రధాన సంఘటనలను ఈ క్రింది విధంగా రాసి పెట్టుకోండి.

1-10 భాగాలు
11-20 భాగాలు
21-30 భాగాలు
31-40 భాగాలు
41-50 భాగాలు
51-60 భాగాలు

సిరీస్ లో ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు రాయాలనే దానిపై పైన విభజించిన సిరీస్ భాగాలకు 1-2 వాక్యాలు ముందుగా రాసి పెట్టుకోండి.

6. ప్రతీ భాగాన్ని వివరంగా రాయండి: మనం సిరీస్ మొదలు పెట్టడానికి దాదాపు సిద్ధంగా ఉన్నాము! ప్రతి 10 భాగాల విభాగానికి మీరు మీ ఆలోచనలను రాసి పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సిరీస్ భాగాన్ని ప్లాన్ చేసుకోవాలి.

సిరీస్ లోని ప్రతి భాగంలో ఏమి రాయాలనే దాని గురించి ఒక వాక్యం రాసి పెట్టుకోగలరు.
ఉదాహరణకు-
భాగం 1-
భాగం 2-
భాగం 3-
భాగం 4-
మొదలైనవి…

*******************************

ఈ మొత్తం ప్లాన్ కు 2-3 రోజులు పడుతుంది. కానీ మీరు మీ సిరీస్ రాయడం ప్రారంభించే ముందు ఇది చాలా ముఖ్యం. మీరు ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి సిరీస్ ప్రచురించడం ప్రారంభించినప్పుడు, ఈ ప్లాన్ ప్రతి సిరీస్ భాగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనర్గళంగా రాయడానికి ఎంతగానో సహాయపడుతుంది. మీరు ప్రతిదీ ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ పోటీలో పాల్గొనే ఇతర రచయితల కంటే మీరు ముందుగా సిరీస్ రాసి పూర్తి చేయగలుగుతారు.

ఈ క్రింది వీడియోలను చూసి అతిపెద్ద సిరీస్ సులభంగా రాయడం నేర్చుకోగలరు: 

 

  1. అతిపెద్ద సిరీస్ రాయమని రచయతలను ఎందుకు అడుగుతోంది?

  2. ప్లాట్ ఐడియాని అతిపెద్ద సిరీస్ గా ఎలా రాయాలి? 

  3. పాత్రలను, సబ్ ప్లాట్ లను ఎలా అభివృద్ధి చేయాలి? 

  4. ప్రేమ జోనర్ లో సిరీస్ ఎలా రాయాలి? 

  5. ఫ్యామిలీ, డ్రామా, సామాజికం, మహిళ థీమ్ లలో సిరీస్ ఎలా రాయాలి? 

  6. మిస్టరీ, ఫాంటసీ, హారర్ థీమ్ లో సిరీస్ ఎలా రాయాలి?

  7. థ్రిల్లర్ సిరీస్ ఎలా రాయాలి?

  8. సంఘటనలు మరియు వాటి క్రమాన్ని ఎలా నిర్ణయించాలి?

  9. సిరీస్ భాగాలు మరియు సన్నివేశాలు ఎలా రాయాలి?

  10.  డైలాగ్ రైటింగ్ మరియు సిరీస్ మొదటి భాగం రాయడం ఎలా?

  11.  హుక్ మరియు ప్లాట్ ట్విస్ట్ అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? సిరీస్ ఎలా ముగించాలి?

  12.  విభిన్న భావోద్వేగాలను ఎలా రాయాలి?

  13.  ట్రెండింగ్  కథలు మరియు వాటి భాగాల విశ్లేషణ

  14.  సిరీస్ తో పాఠకులను ఆకర్షించడం ఎలా?

  15.  రాయడం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి?

  16.  రాసేటప్పుడు కొన్ని సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు

  17.  అతిపెద్ద సిరీస్ రాయడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు

 

టీం ప్రతిలిపి మీతో పంచుకున్న ఈ చిట్కాలను ఒకసారి ప్రయత్నించండి. సిరీస్ ఎంత సులభంగా రాయగలరన్నది మీకే తెలుస్తుంది. మీరు 60 భాగాల సిరీస్ ని విజయవంతంగా పూర్తి చేస్తారని మేము నమ్ముతున్నాము.

ఈ రోజే రాయడం ప్రారంభించండి!

అల్ ది బెస్ట్,

ప్రతిలిపి పోటీల విభాగం