
ప్రతిలిపిప్రతిలిపిలో TDS గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ బ్లాగ్ ఉపయోగపడుతుంది.
గౌరవనీయులైన రచయితలందరికీ,
మీలో చాలామంది TDS గురించి, అలాగే మీ నెలవారి ఆదాయంలో లేదా ప్రతిలిపి నిర్వహిస్తున్న పోటీల నగదు బహుమతుల్లో కొంత మొత్తం డబ్బు ఎందుకు కట్ చేయబడుతుందని అడుగుతూ ఉండటాన్ని గమనించాము. ఈ బ్లాగ్‌లో TDS అంటే ఏమిటి, అది ఎవరికి వర్తిస్తుంది, ప్రతిలిపిలో వేర్వేరు రకాల చెల్లింపులపై అదెలా పనిచేస్తుందో సులభంగా వివరించాము.
TDS అంటే Tax Deducted at Source అని అర్థం. ఇది భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం తీసుకున్న నిబంధన. మీరు పొందే చెల్లింపు రకాన్ని బట్టి TDS శాతం మారుతుంది. అలాగే, మీరు దానిని తర్వాత రీఫండ్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఆ చెల్లింపు రకంపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రతిలిపిలో మీ మొత్తం ఆదాయం ఆర్థిక సంవత్సరంలో — ఏప్రిల్ 1 నుండి మార్చి 31వరకు — ₹30,000 చేరిన తర్వాత 10% TDS కట్ అవ్వడం ప్రారంభమవుతుంది.
ఉదాహరణకు: మీరు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రతి నెల ₹5,000 సంపాదిస్తే, మొత్తం ₹25,000 అవుతుంది. సెప్టెంబర్‌లో మరో ₹5,000 సంపాదిస్తే, మీ మొత్తం ఆదాయం ₹30,000 అవుతుంది. ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం ₹30,000 దాటిన వెంటనే, ఆ సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆదాయంపై 10% TDS వర్తిస్తుంది. ₹30,000కు 10% అంటే ₹3,000 TDSగా కట్ అవుతుంది. మిగిలిన డబ్బు మాత్రమే మీకు చెల్లించబడుతుంది. ఈ ఉదాహరణ ప్రకారం, సెప్టెంబర్ నెలలో మీకు ₹2,000 మాత్రమే వస్తుంది. 30,000 దాటిన తర్వాత నుండి ప్రతి నెల… ప్రతి పైసాకు 10% TDSగా కట్ అవుతూనే ఉంటుంది.
మీరు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సహాయంతో మీ Income Tax Return (ITR) ఫైల్ చేయాలి. రిటర్న్ ప్రాసెస్ అయిన తర్వాత కట్ అయిన TDS మొత్తం మీ బ్యాంక్ ఖాతాలోకి రీఫండ్ అవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు అన్ని TDS సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి. అవి ప్రతి త్రైమాసికంలో (quarterly) కూడా మీకు పంపబడతాయి.
ఆదాయం లేదా చెల్లింపులకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, రచయితలు యాప్ ద్వారా ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.
ప్రతిలిపి నిర్వహించే పోటీలలో గెలిచినప్పుడు కూడా TDS వర్తిస్తుంది, కానీ TDS శాతం మాత్రం వేరుగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు గెలుపొందిన మొత్తం ప్రైజ్ మనీ ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ అయితే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 115BB ప్రకారం 30% TDS కట్ అవుతుంది. దానితో పాటు ప్రభుత్వం వసూలు చేసే సర్ చార్జ్, 4% హెల్త్ & ఎడ్యుకేషన్ సెస్సు వంటి అదనపు చార్జీలు కూడా వర్తిస్తాయి.
ఉదాహరణకు:
మీరు ఒక పోటీలో ₹5,000 గెలిస్తే, ఆర్థిక సంవత్సరానికి ₹10,000 పరిమితిని దాటలేదు కాబట్టి TDS కట్ అవ్వదు. తర్వాత అదే ఆర్థిక సంవత్సరంలో మరో ₹5,000 గెలిస్తే, మొత్తం ప్రైజ్ మనీ ₹10,000 అవుతుంది. దీంతో TDS పరిమితి దాటినట్లు అవుతుంది. అప్పుడు మొత్తం ₹10,000పై 30% అంటే ₹3,000 TDSగా కట్ అవుతుంది. అంటే రెండోసారి గెలిచిన ₹5,000లో నుంచి ₹3,000 TDS కట్ చేసి, మీకు ₹2,000 మాత్రమే చెల్లించబడుతుంది.
ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు మీరు ఎన్ని పోటీల్లో గెలిచినా, వాటి మీద కూడా 30% TDS వర్తిస్తుంది. మిగిలిన మొత్తం మాత్రమే మీకు జమ చేయబడుతుంది. ఈ 30% కత్తిరింపు ప్రభుత్వ నిబంధన అని గమనించండి. మేము మీ డబ్బును ప్రాసెస్ చేసే సమయంలో ఇది ఆటోమేటిక్ గా కట్ చేయబడుతుంది.
మీ వార్షిక ఆదాయం… పన్ను పరిమితికి లోబడి ఉన్నా కూడా సెక్షన్ 115BB ప్రకారం ఈ TDS మొత్తాన్ని తర్వాత రీఫండ్‌గా కూడా క్లెయిమ్ చేసుకోలేరు. ఈ రకమైన బహుమతులు “Income from Other Sources” (ఇతర వనరుల ఆదాయం)గా పరిగణించబడతాయి & వీటి మీద నేరుగా 30% పన్ను ఫైనల్ టాక్స్‌గా వర్తిస్తుంది.
పోటీల సంబంధిత సందేహాల కోసం:[email protected]కుమెయిల్ చేయగలరు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని రకాల చెల్లింపులపై 10% TDS తప్పనిసరిగా వర్తిస్తుంది. ప్రతిలిపిలో, మీరు ఇచ్చిన PAN ఆధారంగా పన్ను సక్రమంగా నమోదు అవ్వడానికి అన్ని IP-సంబంధిత చెల్లింపులపై 10% TDS కట్ చేయబడుతుంది.
అగ్రిమెంట్లో తెలిపిన మొత్తం ₹1,000 అయినా, ₹5,000 అయినా, ₹18,000 అయినా, ఎంత మొత్తం అయినా— ప్రతి చెల్లింపులో 10% TDS వర్తిస్తుంది. మీ కాపీహక్కులు డబ్బు బ్యాంకు ఖాతాలో జమ చేసే సమయంలో TDS ఆటోమేటిక్ గా కట్ అవుతుంది.
ఈ TDS మీరు ఇచ్చిన PAN నంబర్‌పై నమోదు అవుతుంది. అందువల్ల, మీరు ITR ఫైల్ చేసుకునే సమయంలో ఈ మొత్తాన్ని రీఫండ్‌గా తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ మీ Form 26AS లేదా AISలో కూడా ఆదాయపు పన్ను పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. అగ్రిమెంట్ సైన్ అయిన వెంటనే, చెల్లించాల్సిన మొత్తం ఖరారైన తర్వాత, 10% TDS ఆటోమేటిక్‌గా చెల్లింపు సమయంలో కట్ అవుతుంది.
IP లేదా ఒప్పందాలకు సంబంధించిన సందేహాల కోసం: [email protected]ను సంప్రదించవచ్చు.
మీ PAN (Permanent Account Number) ఇవ్వకపోయినా, లేదా ఇనాక్టివ్‌గా ఉన్నా (ఉదాహరణకు ఆధార్‌తో లింక్ చేయకపోతే), లేదా చెల్లని PAN ఇచ్చి ఉన్నా, TDS ఎక్కువ శాతం కట్ అవుతుంది. సాధారణంగా 20% నుండి 30% వరకు TDS కట్ అవుతుంది.
TDS ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
మీ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, ప్రతిలిపిలో రచనల నుండి వచ్చిన ఆదాయంపై లేదా IP చెల్లింపులపై కట్ అయినా 10% TDSను తిరిగి రీఫండ్‌గా పొందవచ్చు.
క్లెయిమ్ చేసుకునే పధ్ధతి:
ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత, సాధారణంగా ఏప్రిల్ నుండి జూలై మధ్య, మీరు Income Tax Return (ITR) ఫైల్ చేయాలి.
ITR ఫైల్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా సర్టిఫైడ్ టాక్స్ నిపుణుడి సహాయం తీసుకోవడం మంచిది.
ITR ప్రాసెస్ అయిన తర్వాత, కట్ అయిన TDS మొత్తం మీ బ్యాంక్ ఖాతాకి నేరుగా రీఫండ్ అవుతుంది.
కట్ అయిన TDS వివరాలను Form 26AS లేదా AIS ద్వారా ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
(Income Tax Website:https://incometaxindia.gov.in/Pages/default.aspx)
ముఖ్య గమనిక:పోటీల నగదు బహుమతులపై కట్ అయ్యే 30% TDSను ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్‌గా పొందలేరు. ఇది ఆదాయపు పన్ను చట్టం Section 115BB ప్రకారం ఫైనల్ టాక్స్ గా పరిగణించబడుతుంది.
ముఖ్యమైన విషయాలు:
TDS అనేది ఆదాయపు పన్ను చట్టం ప్రకారం తప్పనిసరి నిబంధన. మీ ఆదాయం లేదా బహుమతి మొత్తాన్ని బట్టి అది ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది.
మీరు ప్రతిలిపిలో అనేక భాషల్లో రాసినా, అన్ని ప్రొఫైల్స్ కి ఒకటే PAN లింక్ అయ్యుంటే, అన్ని భాషలలోని మీ మొత్తం ఆదాయం లేదా బహుమతులు ఒకే PAN కింద కలిపి లెక్కించబడతాయి. ఉదాహరణకు: వేర్వేరు భాషల్లో మీ మొత్తం ప్రైజ్ మనీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో ₹10,000 దాటితే, 30% TDS కట్ చేయబడుతుంది.
పోటీల బహుమతులపై TDS ప్రతి పోటీకి వేరుగా కాకుండా, ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం నగదు బహుమతిపై లెక్కించబడుతుంది. మొత్తం ₹10,000 దాటిన వెంటనే, 30% TDS పూర్తిగా వర్తిస్తుంది.
ఒకసారి ఆర్థిక సంవత్సరంలో TDS కట్ అయిన తర్వాత, మీరు మళ్లీ గెలిస్తే, ఆ సంవత్సరంలో మీ మొత్తం గెలుపును బట్టి మిగిలిన TDS చట్టానికి అనుగుణంగా అదనంగా కట్ అవుతుంది.
మీ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉంటే, రచనల నుండి వచ్చే ఆదాయం లేదా IP చెల్లింపులపై కట్ అయిన 10% TDSను మీరు ITR ఫైల్ చేసి రీఫండ్‌గా పొందవచ్చు. కానీ పోటీల బహుమతులపై 30% TDS మాత్రం ఫైనల్ టాక్స్. ఆ డబ్బును రీఫండ్‌గా పొందడం సాధ్యపడదు.
కట్ అయిన TDS వివరాలను ఎప్పుడైనా Form 26AS లేదా AISలో ఆదాయపు పన్ను పోర్టల్‌లో చూడవచ్చు.
ప్రతిలిపి అన్ని చెల్లింపులపై ఈ నిబంధనలను చట్టపరంగా తప్పనిసరిగా అమలు చేయాలి. TDSను ఆపడం లేదా తిరిగి ఇవ్వడం ప్రతిలిపికి సాధ్యపడదని గమనించగలరు.
ఏ త్రైమాసికానికి అయినా Form 16A కావాలంటే, మీరు [email protected]కు మెయిల్ చేయగలరు.
ప్రతిలిపిలో TDS ఎలా పనిచేస్తుందో ఈ వివరణ మీకు వివరంగా అర్థమైందని ఆశిస్తున్నాము.
మీ చెల్లింపులు లేదా ఆదాయానికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, యాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
మీకు సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తామని మర్చిపోవద్దు.
ప్రతిలిపి తెలుగు విభాగం