గౌరవనీయులైన రచయిత గారికి,
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ప్రేమ కథలు' పోటీ ఫలితాలు వచ్చేసాయి!
మేము ఈ పోటీని కేవలం కొత్త రచయితల కొరకు మాత్రమే నిర్వహించాము. కొత్త రచయితలు సిరీస్ రాయడం ద్వారా గోల్డెన్ బ్యాడ్జ్ పొందడానికి ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఈ పోటీని రూపొందించడం జరిగింది. ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది! ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతీ నెల తమ రచనల ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకునే ప్రతీ రచయితకు గోల్డెన్ బ్యాడ్జ్ మొదటి మెట్టు.
ఈ పోటీలో గోల్డెన్ బ్యాడ్జ్ పొందిన రచయితలు ఇప్పుడు పాఠకుల కోసం వారి సిరీస్ లాక్ చేసే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. వారు కొత్త సిరీస్ ప్రచురించిన ప్రతీ సారి 16 వ భాగం నుండి సిరీస్ మొత్తం పాఠకుల కోసం లాక్ లో ఉంటుంది మరియు ఆ సిరీస్ ప్రతిలిపి ప్రీమియం సిరీస్ గా మారుతుంది. పాఠకులు మీ సిరీస్ భాగాలను అన్లాక్ చేయడానికి సబ్స్క్రయిబ్ చేసుకోవడం, నాణేలు చెల్లించడం లేదా మరుసటి రోజు వరకు వేచి ఉండడం చేస్తారు. ప్రతిలిపిలో ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ క్రమం తప్పకుండా ప్రచురించడం, సిరీస్ ను లాక్ చేయడం ద్వారా నెలకు ఐదు నుంచి పది వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్న వేలాది మంది ప్రతిలిపి రచయితల జాబితాలో చేరే అవకాశం వారికి లభిస్తుంది.
అంతేకాకుండా ఈ గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలు 'ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్-6' పోటీలో పాల్గొని ఆకర్షనీయమైన నగదు బహుమతులు, ప్రత్యేక ప్రశంసా పత్రాలు, అవార్డులు మరెన్నో ఇతర ప్రయోజనాలను పొందుతారు.
'ప్రేమ కథలు' పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో లక్షలాది మంది పాఠకుల హృదయాలను తాకే సిరీస్ రాసే ప్రతిభ, సామర్థ్యం మీ అందరికీ ఉన్నాయని మాకు తెలుసు. ప్రతిలిపిలో క్రమం తప్పకుండా ఎక్కువ భాగాల సిరీస్ రాస్తూ ఉంటే విజయవంతమైన రచయితగా ఎదగడానికి సహాయపడతామని మేము హామీ ఇస్తున్నాము.
ప్రేమ కథలు పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన రచయితలందరికీ అభినందనలు తెలుపుతున్నాము.
నగదు బహుమతి 1000/- రూపాయలు + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్ పొందిన మొదటి 7 రచనలు:
రచయిత |
రచన |
హర్షి |
|
శ్రీ దేవి |
|
Rk. తార |
|
సువర్ణ రెడ్డి |
|
షకీర షేక్ |
|
శ్రావణి |
|
లోకేశ్వర్ రెడ్డి |
మా న్యాయనిర్ణేతలు మెచ్చిన మరికొన్ని రచనలు:
రచయిత |
రచన |
హైమ కుర్ర |
|
ప్రవీణ్ పరి షేక్ |
|
రాణి అపర్ణ |
|
ప్రశాంతి శ్రీకాంత్ |
|
లత |
|
సీక్రెట్ సోల్ |
|
సౌమ్య నదియ |
|
తాత మోహనకృష్ణ |
|
దీనా రెడ్డి |
|
ప్రియ వర్ధిని రాం |
|
అప్పు అపర్ణ |
ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదములు. పోటీలో పాల్గొన్న రచయితలకు త్వరలో డిజిటల్ ప్రశంసా పత్రం మెయిల్ చేస్తాము. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.
ప్రతిలిపి తెలుగు విభాగం.
ఇమెయిల్ :[email protected]