pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మీ సిరీస్ పుస్తకంగా ప్రచురించండి - ఎర్లీ బర్డ్ ఆఫర్

01 మార్చి 2024

గౌరవనీయులైన రచయితలకు,

 

మీ రచనలను కేవలం 5000/- రూపాయలకే పేపర్ బ్యాక్ పుస్తకంగా ముద్రించండి. చాలా మంది రచయితలు తమ రచనలను పుస్తకంగా ముద్రించాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే ప్రతిలిపి పుస్తక ప్రచురణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పరిమిత ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని అతి తక్కువ ఖర్చుతో మీ పుస్తకాన్ని ముద్రించుకోండి!  ఆసక్తి  ఉన్న రచయితలు, [email protected] లో మమ్మల్ని సంప్రదించండి.

 

బేసిక్ ప్యాకేజ్ ప్లాన్ : 

 

40,000 పదాలున్న రచనను 5,000/- రూపాయలు + 18% GST  తో పుస్తకంగా ముద్రించుకునే గొప్ప అవకాశం! 40,000 పదాలకు మించిన రచనలకు, ఎక్కువ డబ్బు చెల్లించడం లేదా పుస్తకాల సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. మీకు ఈ విషయం గురించి మరింత సమాచారం కావాలనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.  

 

ప్యాకేజీలో చేర్చిన అంశాలు : 

 

  • పుస్తకం 10 కాపీలు (పేపర్ బ్యాక్)

  • కొరియర్ చార్జీలు కూడా ఈ ప్యాకేజ్ లోనే వస్తాయి. 

  • ప్రతిలిపి టీం కవర్ ఫోటో డిజైన్ చేస్తారు.

  • బుక్ ISBN నెంబర్

  • ప్రింట్ పేపర్ - బేసిక్ క్వాలిటీ 

  • బేసిక్ టైప్ సెట్టింగ్

 

ప్యాకేజీలో లేని అంశాలు: 

 

  • ప్రూఫ్ రీడింగ్

 

ఇతర ముఖ్యమైన సమాచారం : 

 

  • ఒప్పందంపై సంతకం చేసే సమయంలోనే  ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాలి. 

 

  • ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు రచయిత ఒప్పందంపై సంతకం చేయాలి.

 

  • ఒక శాంపిల్ బుక్ వీడియో రచయితకు పంపడం జరుగుతుంది.( ఇక్కడ మీ పుస్తకం కాకుండా, అవగాహన కొరకు ఏదైనా ఒక పుస్తకం వీడియో పంపుతాము.)

 

  • రచయితలకు తమ పుస్తకంలో మార్పులు చేయడానికి 7-10 రోజుల సమయం ఉంటుంది. ఆ సమయంలో ప్రూఫ్ రీడ్ & టైప్ సెట్టింగ్ చేసుకోవచ్చు.

 

  • ఆఖరిగా మీరు మీ రచన మాకు సబ్మిట్ చేసిన తర్వాత, 30 రోజులలో మీ ఇంటి అడ్రస్ కే పుస్తకం పంపుతాము. 

 

  • కవర్ ఫోటో ప్రతిలిపి బృందం ఫైనల్ చేస్తారు. రచయిత ఏదైనా శాంపిల్ ఫోటో పంపవచ్చు. కానీ ఫైనల్ చేసేది మాత్రం  ప్రతిలిపి బృందం. కేవలం ఒక కవర్ ఫోటో మాత్రమే డిజైన్ చేస్తారు.  

 

  • మీ రచనను పుస్తకంగా ముద్రించినప్పటికీ రచన యొక్క కాపీహక్కులు పూర్తిగా రచయిత సొంతమే. మీ రచన కాపీ హక్కు ప్రతిలిపికి ఇవ్వకపోయి ఉంటేనే.

 

  • పుస్తకం కవర్ ఫోటో యొక్క కాపీరైట్ ప్రతిలిపికి చెందుతుంది. ఈ విషయాన్ని కాంట్రాక్ట్ లో కూడా వివరంగా తెలియజేస్తాము.  

 

  • పుస్తకాన్ని ముద్రణకు పంపే ముందు, కేవలం పరిశీలన కోసం రచయితలకు ఒక పిడిఎఫ్ ఫైల్ పంపడం జరుగుతుంది.

 

టైప్ సెట్టింగ్/ప్రూఫ్ రీడింగ్ కొరకు మార్గదర్శకాలు : 

 

  • ఫైనల్ డాక్యుమెంట్ లో ఎటువంటి ఎమోజీలను ఉపయోగించరాదు.

 

  • లైన్ల మధ్య అదనపు స్పేస్ ఉండకూడదు.

 

  • ఎలాంటి అదనపు చుక్కలు(...) , కామా(,) లు మొదలైనవి ఉండకూడదు. 

 

తరచుగా అడిగే ప్రశ్నలు : 

 

  1. నా రచనను పుస్తకంగా ముద్రించాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి?

 

మీకు ఆసక్తి ఉంటే [email protected] లో మమ్మల్ని సంప్రదించండి. మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి దయచేసి మీ ఫోన్ నెంబర్ జత చేయండి.

 

  1. ఈ మొత్తం ప్రక్రియ ఏమిటి?

 

మీరు మెయిల్ పంపిన తర్వాత, మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ పుస్తకం యొక్క వివరాలను కనుక్కుంటాము. అప్పుడు స్పాట్ డ్రాఫ్ట్, ప్రతిలిపి ప్రొఫైల్ వివరాల ద్వారా సంతకం చేయడానికి మేము ఒక ఒప్పందాన్ని పంపుతాము. పేమెంట్ పూర్తై, ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, పుస్తకానికి సంబంధించిన అన్ని ఇతర వివరాలను సేకరించడానికి గూగుల్-ఫారం మెయిల్ చేస్తాము. ఫైనల్ ఎడిటింగ్ కోసం పుస్తకానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పంపిస్తాం. మీరు పుస్తకం యొక్క వివరాలను నింపి, సవరించిన డాక్యుమెంట్ మాకు షేర్ చేసిన తర్వాత, మేము ప్రచురణ మరియు పైన పేర్కొన్న అన్ని ఇతర విషయాలపై పనిచేయడం ప్రారంభిస్తాము.



  1. పుస్తక ప్రచురణకర్త (పబ్లిషర్)ఎవరు?

 

ప్రతిలిపి పేపర్ బ్యాక్

 

  1.  నా రచనను పుస్తకంగా ముద్రించడానికి మీకు ఎలాషేర్ చేయాలి?

 

ప్రతిలిపిలో ఉన్న రచన అయితే, మీ ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకుని MS  వర్డ్ ఫైల్ గా మార్చి, ఫైనల్ ఎడిటింగ్ కొరకు రచయితకు  పంపిస్తాం.

 

  1. ప్రతిలిపిలో  ప్రచురణ కాని రచనలను పుస్తకంగా ముద్రించాలంటే ఎలా?

 

మేము ప్రతిలిపిలో లేను రచనలను కుడా పుస్తంగా ముద్రిస్తాము. కాకపోతే మీ రచనను MS వర్డ్ ఫైల్ లో మాకు పంపాల్సి ఉంటుంది.  

 

  1. నేను డబ్బు ఏ అకౌంట్ కి చెల్లించాలి?

 

మీరు అన్ని నియమ నిబంధనలను అర్థం చేసుకొని,  పుస్తక ప్రచురణకు సిద్దమైన తర్వాత అకౌంట్ వివరాలను మేము మీకు పంపుతాము.

 

  1. నా పుస్తకం అమ్మకపు ధర ఎంత ఉంటుంది?

 

ఇది పరస్పర చర్చల తరువాత నిర్ణయించబడుతుంది (పుస్తక ధరల పరంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి).



  1. మీరు ఆన్ లైన్ వెబ్ సైట్లలో నా పుస్తకాన్ని విక్రయిస్తారా? ఉదా: అమెజాన్

 

అవును, అమెజాన్ లో పుస్తకాలను లిస్టు చేయడానికి మేము సహాయపడతాము. అమెజాన్ లో చేర్చడానికి  ఫీజు పెరుగుతుంది. 

 

  1. పుస్తకం సైజు ఎంత ఉంటుంది?

 

8.5 x 5.5 inches

 

పైన తెలిపిన అంశాల గురించి ఏవైనా సలహాలు/సందేహాలు ఉంటే దయచేసి [email protected] కి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాము. 

 

ధన్యవాదములు

pratilipi.com