pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ | సీజన్ 8 | FAQ బ్లాగ్

09 మే 2024

1. ఈ పోటీలో ఎవరెవరు పాల్గొనవచ్చు?

→ ప్రతిలిపి రచయితలందరూ గోల్డెన్ బ్యాడ్జ్ ఉన్నా, లేకపోయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు. 

 

2. ముందుమాట, ప్రోమో, ట్రైలర్, ఇతర గమనికలను ఒక సిరీస్ భాగంగా నేను ఎందుకు ప్రచురించకూడదు?

→ ముందుమాట, ప్రోమో, ట్రైలర్ ఎందుకు ప్రచురించకూడదో తెలుసుకుందాం:

  1.  రీడర్ ఎంగేజ్మెంట్: పాఠకులు మొదటి భాగంలో ప్రధాన కథను చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరా విషయాలను సిరీస్ భాగంగా ప్రచురించడం వలన, సిరీస్ పైన తమకున్న ఆసక్తిని కోల్పోతారు. 

  2.  గమనిక: మీరు మొదటి భాగంలో ముందుమాట, ప్రోమో, ట్రైలర్ రాయాలనుకుంటే కేవలం 4-5 లైన్లలో రాసి, వెంటనే ప్రధాన కథను  ప్రారంభించి పాఠకులను ఆకట్టుకోవచ్చు. 

 

3. పోటీలో అర్హత పొందడానికి నా సిరీస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాంలో ఎలా పెట్టాలి?

→ గోల్డెన్ బ్యాడ్జ్ రచయితగా మీ కొత్త సిరీస్ యొక్క మొదటి 15 భాగాలను పాఠకులు ఉచితంగా చదవగలుగుతారు. మీరు 16వ భాగాన్ని ప్రచురించిన తర్వాత, మీ సిరీస్ ప్రతిలిపి ప్రీమియం సిరీస్ గా మారుతుంది, ఈ సిరీస్ నుండి మీరు ప్రతీనెల డబ్బు సంపాదించవచ్చు. 

 

4. నాకు ప్రస్తుతం గోల్డెన్ బ్యాడ్జ్ లేదు, మరి నేనేం చేయాలి?

→ మీకు గోల్డెన్ బ్యాడ్జ్ లేకపోయినా, మీ సిరీస్ సాధారణంగానే పోటీకి ప్రచురించవచ్చు. పోటీ మధ్యలో మీకు గోల్డెన్ బ్యాడ్జ్ వస్తే, మీ సిరీస్ ప్రీమియం సిరీస్ గా మారుతుంది. 

→ అంతే కాకుండా, గోల్డెన్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత మీ 16+ భాగాల సిరీస్ ని ప్రీమియం సిరీస్ గా మీరే మార్చుకోవచ్చు.  

 

  1. ప్రతిలిపి యాప్ ఓపెన్ చేసి, రాయండి పైన క్లిక్ చేయండి. మీ సిరీస్ సెలెక్ట్ చేసుకోండి. 

  2. ‘ఇతర సమాచారాన్ని సవరించండి’ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ‘మీ సిరీస్ సబ్స్క్రిప్షన్ లో ఉండాలా’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 

  3. ‘అవును’ పైన క్లిక్ చేయండి. 24 గంటల్లో మీ సిరీస్ ప్రీమియం సిరీస్ గా మారుతుంది.  

 

5. ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ ఎలా పొందాలి?

→ ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయిత కావడానికి, ఈ క్రింది నియమాలను పాటించాలి.

  1. మీ ప్రొఫైల్ కి కనీసం 200 మంది అనుచరులు ఉండాలి. 

  2. గత ముప్పై రోజులలో కనీసం 5 రచనలను మీ ప్రొఫైల్ లో ప్రచురించి ఉండాలి.

మీ ప్రతిలిపి ప్రొఫైల్ కి గోల్డెన్ బ్యాడ్జ్‌ని పొందిన తర్వాత, మీ సిరీస్ ని సబ్‌స్క్రిప్షన్‌లో ఉంచుకోగలరు. తద్వారా మీరు సంపాదించడం ప్రారంభించవచ్చు. లక్షలాది రూపాయల నగదు బహుమతి మరియు ఇతర ప్రత్యేక బహుమతులను గెలుచుకోవచ్చు.

 

6. నా సిరీస్ పోటీలో ఉన్నదో, లేదో నాకెలా తెలుస్తుంది?

→ పోటీ కోసం మీ సిరీస్ పరిగణించబడిందో, లేదో నిర్ధారించుకోవడం ఎలాగో చూద్దాం:

 

  1. పోటీ యొక్క గడువు లోపు మీ సిరీస్ ప్రచురించండి: కనీసం 80 భాగాలతో పోటీ ప్రారంభ మరియు ముగింపు తేదీల మధ్య మీ సిరీస్‌ను ప్రారంభించి, పూర్తి చేయాలి.

           →ప్రతి భాగంలో కనీసం 1000 పదాలు ఉండాలి. (గరిష్ట పద పరిమితి లేదా భాగాల పరిమితి లేదు)

  1. పోటీ యొక్క వర్గాన్ని ఎంచుకోండి: మీ సిరీస్ భాగాలను ప్రచురించేటప్పుడు, "సూపర్ రైటర్ అవార్డ్స్ - 8" వర్గాన్ని ఎంపిక చేసుకోండి. అలా చేసినప్పుడే మీ సిరీస్ పోటీలో ఉందని అర్థం. 

  2. పోటీ నియమాలను అనుసరించండి: పోటీ యొక్క అన్ని నియమ నిబంధనలకు మీ సిరీస్ లోబడి ఉందని నిర్ధారించుకోండి. 

 

7. ఈ పోటీకి సంబంధించిన ఫలితాల ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుంది?

→ పోటీ గడువు ముగిసిన తర్వాత, పోటీ వర్గంతో ప్రచురించబడిన అన్ని సిరీస్‌లను మా టీం గుర్తిస్తుంది. పోటీ నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరించి రాసిన సిరీస్ లను మాత్రమే న్యాయనిర్ణేతలకు పంపబడతాయి.

 

→ మా న్యాయనిర్ణేతల బృందం అన్ని సిరీస్‌లను సమీక్షిస్తుంది, కథా ప్లాట్లు, మొదటి నుండి చివరి వరకు కథ యొక్క తీవ్రత, పాత్రల అభివృద్ధి, వివరణ, డైలాగ్ రైటింగ్, ప్లాట్ ట్విస్ట్‌లు మొదలైన వాటి ఆధారంగా ఫలితాలు ప్రకటించబడతాయి. 

 

8. నేను ఈ పోటీ కోసం నా ప్రస్తుత సిరీస్ యొక్క తదుపరి సీజన్‌ను రాయవచ్చా?

→అవును, మీరు రాయవచ్చు కానీ న్యాయమైన ఫలితాల కోసం పూర్తి కథాంశంతో కూడిన ఒకే సిరీస్‌ని రాయమని సూచిస్తాము. మీ కొత్త సిరీస్ మునుపటి సిరీస్ ప్లాట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటే, న్యాయనిర్ణేతలు చదవడానికి కష్టపడవచ్చు మరియు మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.

 

9. నేను ఒకే సిరీస్‌ని రెండు వేర్వేరు పోటీలకు సబ్మిట్ చేయవచ్చా?

→ఒక సిరీస్, ఒక పోటీకి మాత్రమే సబ్మిట్ చేయాలి. కాబట్టి ఒకే సిరీస్‌ని అనేక పోటీలకు సబ్మిట్ చేయడం అనుమతించబడదు.

 

10. నేను పోటీ ఫలితాలను ఎక్కడ చూడగలను?

→ ఈ నిర్దిష్ట పోటీ ఫలితాలు బ్లాగ్ విభాగంలో ముందుగా ప్రకటించిన తేదీలో ప్రతిలిపి టీం ద్వారా ప్రచురించబడతాయి.

  1. ప్రతిలిపి యాప్‌ను తెరిచి, "పెన్" గుర్తును నొక్కండి.

  2. పేజీ దిగువకు స్క్రోల్ చేసి, "బ్లాగ్" విభాగంపై క్లిక్ చేయండి.

 

11. అతిపెద్ద సిరీస్ రాయడానికి అవసరమైన అన్ని అంశాలను నేను ఎలా నేర్చుకోవాలి?

→ ఈ క్రింది టిప్స్ సహాయంతో సిరీస్ రైటింగ్ లో గొప్ప రచయితగా మారండి:

 

→ప్లాట్లు & పాత్రలు:

  1. ప్లాట్ ఆలోచనను అతిపెద్ద సిరీస్‌గా ఎలా అభివృద్ధి చేయాలి?

  2. పాత్రలు మరియు ఉప ప్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలి?

 

→ నిర్దిష్ట శైలి:

  1. ప్రేమ వర్గంలో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి?

  2. ఫ్యామిలీ డ్రామా, సోషల్ మరియు మహిళా థీమ్స్‌లో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి?

  3. మిస్టరీ, ఫాంటసీ మరియు హారర్ థీమ్‌లతో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి?

  4. ఆసక్తికరమైన థ్రిల్లర్ సిరీస్‌ను ఎలా రాయాలి?

 

→ రాసే పద్ధతులు:

  1. పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెంట్‌లు మరియు వాటి సీక్వెన్స్ మరియు ప్లాట్ హోల్స్‌ను అర్థం చేసుకోవడం

  2. సిరీస్ భాగాలు మరియు సీన్స్ ఎలా రాయాలి?

  3. డైలాగ్ రైటింగ్ టెక్నిక్స్ మరియు మొదటి చాప్టర్ స్ట్రాటజీస్

  4. హుక్స్ మరియు ప్లాట్ ట్విస్ట్‌లు: వాటిని ఎఫెక్టివ్‌గా ఉపయోగించడం మరియు చిరస్మరణీయమైన సిరీస్ ముగింపుని ఎలా రూపొందించాలి?

  5. విభిన్న భావోద్వేగాలను ఎలా రాయాలి?

 

→ ప్రణాళిక మరియు సవాళ్లను అధిగమించడం:

  1. రైటింగ్ షెడ్యూల్ ఎలా తయారు చేయాలి?

  2. రాసేటప్పుడు సాధారణ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు (నిరోధాలు/ఒత్తిడి/సమయం)

 

→ ప్రతిలిపిలో అతిపెద్ద సిరీస్ యొక్క ప్రయోజనాలు:

  1. ప్రతిలిపి అతిపెద్ద సిరీస్‌లను ఎందుకు ప్రోత్సహిస్తుంది?

  2. జనాదరణ పొందిన సిరీస్ నిర్మాణాన్ని విశ్లేషించడం

  3. పాఠకులను ఆకర్షించడం (ప్రమోషన్)

  4. రికమెండేషన్ సిస్టం అర్థం చేసుకోవడం

  5. ప్రీమియం సిరీస్‌తో నెలవారీ రాయల్టీలను పొందడం

  6. సీజన్స్ రాయడం

  7. అతిపెద్ద సిరీస్ విజయం యొక్క ప్రయోజనాలు

 

ఫెలోషిప్ ప్రోగ్రాం 1

ఫెలోషిప్ ప్రోగ్రాం 2

 

→ ఈ రోజే మీ సిరీస్ రాయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ మొత్తం ప్లాన్ కు 4-5 రోజులు పడుతుంది. మీరు ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి సిరీస్ ప్రచురించడం ప్రారంభించినప్పుడు, ఈ ప్లాన్ ప్రతి సిరీస్ భాగాన్ని ఎటువంటి అడ్డంకులు, అంతరాయం లేకుండా రాయడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

 

→ ట్రెండింగ్ లో ఉన్న సిరీస్ ప్లాట్ ఐడియాల కోసం వెతుకుతున్నారా? ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సిరీస్ ప్లాట్లు, పాత్రలను సృష్టించే విధానం, డెవలప్ మెంట్ టిప్స్ మరియు అతిపెద్ద సిరీస్ రాయడానికి అవసరమైన అన్ని అంశాలను మా టీం షేర్ చేస్తుంది. అందుకోసం దయచేసి ఈ గూగుల్ ఫారం నింపండి.

 


 

పోటికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి [email protected]కి మెయిల్ చేయండి. మా టీం 24 గంటలలోగా మీ సమస్యను పరిశీలించి, రిప్లై ఇస్తారు.

 

ప్రతిలిపి వేలాదిమంది రచయితలతో రోజూ పనిచేస్తూ వారి కలలను సాకారం చేస్తోంది. మేము, మీ కోసం ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించాము.  మీ  సాహిత్య ప్రతిభను ప్రతిలిపి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి రచయితగా ఎదగవచ్చు మరియు మీ రచనల నుండి ప్రతీనెల సంపాదించుకోవచ్చు. పోటీలో పాల్గొని, బెస్ట్ సెల్లర్ రచయితగా నిలవాలనే మీ కలను నిజం చేసుకోండి.

 

ఆల్ ది బెస్ట్! 

ప్రతిలిపి పోటీల విభాగం