pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ : సూపర్ 7 సీజన్ | త్వరలో

28 డిసెంబరు 2023

గౌరవనీయులైన రచయిత గారికి, 2024 నూతన సంవత్సరానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కొత్త సంవత్సరంలో సరి కొత్త సిరీస్ రాయడానికి సిద్దంగా ఉండండి.  

 

రచయితల కొరకు త్వరలో ‘సూపర్ రైటర్ అవార్డ్స్ - సూపర్ 7 సీజన్’ ప్రారంభమౌతుంది. 

 

మా ఛాలెంజ్ : కొత్త సంవత్సరం అంటే కొత్త ప్రారంభం. ఈ సంవత్సరం, ఆసక్తి కరమైన ప్రారంభంతో ఉండి, పాఠకులను కట్టిపడేసి ముగింపు వరకు చదివించే  అద్భుతమైన సిరీస్ రాయండి. 

 

ప్రతిలిపిలో లక్షలాది మంది పాఠకుల హృదయాలను స్పృశించే సిరీస్ రాయడానికి మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. మీ సృజనాత్మకతను ఉపయోగించుకొని భిన్నమైన సిరీస్ రాయండి. మీ స్టోరీ అవుట్ లైన్ మరియు పాత్రలను ముందుగానే ప్లాన్ చేసుకోండి.

 

జనవరి 2 వ తారీఖున పోటీ ప్రారంభం అవుతుంది. ఈ సూపర్ 7 సీజన్ లో మీరు గెలుచుకునే అద్భుతమైన బహుమతుల గురించి తెలుసుకోవడానికి వేచి ఉండండి.