pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ - 4 పోటీ ఫలితాలు

04 മെയ്‌ 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

మనమంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్-4' ఫలితాలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. విజేతల పేర్లను వెల్లడించే ముందు, మేము మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాము.  ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది రచయితలు తమ సిరీస్ లను ప్రచురించి గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ఎంతో మంది కొత్త రచయితలు గోల్డెన్ బ్యాడ్జ్ సాధించి ఈ పోటీలో పాల్గొని అనేక అద్భుతమైన 60 భాగాలసిరీస్ లను ప్రచురించారు. 

'సూపర్ రైటర్ అవార్డ్స్' దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సాహిత్య పోటీలలో ఒకటిగా మారడం మనకు గర్వకారణం. భారతదేశంలోని 12 భాషలలో వేలాది మంది ప్రసిద్ధ మరియు కొత్త రచయితలు పాల్గొని, పెద్ద సంఖ్యలో బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ప్రచురించడంతో ఈ జాతీయ స్థాయి రచనా పోటీ మన దేశంలో ఉన్న రచయితల ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరికీ  సమానమైన అవకాశాన్ని కల్పించింది. 

అద్భుతమైన సిరీస్ లను రాసిన ప్రతిలిపి 'సూపర్ రైటర్స్'ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.  పోటీకి వచ్చిన అనేక సిరీస్ లలో గెలుపొందిన సిరీస్ లు ప్రత్యేకమైనవి, మీ విజయం మమ్మల్ని గర్వపడేలా చేసింది. 

పోటీలో  పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు ధన్యవాదములు. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది.  ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు  సంతోషిస్తున్నాము.

టెన్షన్ పెట్టే క్రైమ్ థ్రిల్లర్లు, వెన్నెముకలో వణుకు పుట్టించే హారర్ కథలు, అదిరిపోయే ప్రేమకథలు, బలమైన సందేశాలతో కూడిన సామాజిక కథలు, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ కథలు - ఇవన్నీ చూశాం! ఈ పోటీలో ప్రచురితమైన మన రచయితల కథల నాణ్యత అమోఘం! నిజాయతీగా చెప్పాలంటే, ప్రతి కథ మా హృదయాలను తాకింది మరియు కొన్నింటిని ఎప్పటికీ  మర్చిపోలేము.

న్యాయనిర్ణేతులుగా వ్యవహరించి పోటీకి వచ్చిన రచనల నుండి విజేతలను ప్రకటించడం అంత సులువైన విషయం కాదు. పోటీ నిబంధనల ప్రకారం రచనా శైలి, శిల్పం, వ్యాకరణం, ఎత్తుగడ, ముగింపు లాంటి అనేక అంశాలను పరిశీలించి మా న్యాయనిర్ణేతల బృందం ఈ క్రింది రచనలను విజేతలుగా ప్రకటించింది.  గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.

సూపర్ రైటర్ అవార్డ్స్-4 విజేతల జాబితా-

మొదటి బహుమతి: 

  1. సీతాయణం - శ్రీవల్లి మంచు

 (51,000/- నగదు బహుమతి + అమెజాన్ కిండల్ + ప్రతిలిపి సొంత పబ్లికేషన్ హౌస్ ద్వారా పుస్తకం ప్రచురణ + ప్రచురించిన పుస్తకాలు 20 కాపీలు రచయితకు ఇవ్వబడును.)

రెండవ బహుమతి: 

  1. మోహిని -  దీప నాదెండ్ల

(36,000/- నగదు బహుమతి + అమెజాన్ కిండల్  + ప్రతిలిపి సొంత పబ్లికేషన్ హౌస్ ద్వారా పుస్తకం ప్రచురణ + ప్రచురించిన పుస్తకాలు 20 కాపీలు రచయితకు ఇవ్వబడును.)

మూడవ బహుమతి: 

  1. మనసున ఉన్నది చెప్పేది కాదని - మీనాకుమారి ముక్తేశ్వర్

  (23,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+  ప్రతిలిపి నుండి సర్ప్రైజ్ బహుమతి+ ప్రీమియం విభాగంలో చేర్చడం ) 

నాల్గవ బహుమతి: 

  1. అనగనగా ఒక రామం - విజయలక్ష్మి అవధానుల

(16,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+  ప్రతిలిపి నుండి సర్ప్రైజ్ బహుమతి+ ప్రీమియం విభాగంలో చేర్చడం) 

ఐదవ బహుమతి:  

  1. దివ్యపథం -  పెండ్యాల గాయత్రి

(11,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+  ప్రతిలిపి నుండి సర్ప్రైజ్ బహుమతి+ ప్రీమియం విభాగంలో చేర్చడం) 

ఆరవ బహుమతి: 

  1.  అడుగులో అడుగునై వస్తా -  అంగులూరి అంజనీదేవి

(5,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం) 

ఏడవ బహుమతి: 

  1. స్పైడర్ వెబ్ - తేజు  

(5,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం) 

ఎనిమిదవ బహుమతి: 

  1. అమృతం కురిసిన రేయి - సిరి కృష్ణ

(5,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం) 

తొమ్మిదవ బహుమతి: 

  1. ఏకాంత మంత్రం - సిరి అర్జున్

(5,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం) 

పదవ బహుమతి: 

  1. ప్రేమ తరంగాలు - ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి 

(5,000/- నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం) 

11.  జీవిత చక్రం- డాక్టర్.షహనాజ్ బతుల్

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

12.  జీవనతరంగాలు- అను కుమార్

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

13.  మై స్ట్రేంజ్ లవ్ - మౌనిక శ్రీనివాస్ రెడ్డి

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

14.  గెలుపు గుర్రాలు - సునీత ఆకెళ్ళ

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

15.  నీ వలపు మలుపుల్లో - రాజేష్ తొగర్ల

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

16.  మంచు మంట -  S.H. ప్రసాద్

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

17.  అంతం కాదిది ఆరంభం- పొందూరు రాంబాబు

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

18.  తరాలు అంతరాలు- c. మురళీకృష్ణ

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

19. నీ ప్రేమ సాక్షిగా- అలేఖ్య

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

20. అతడే నా సైన్యం- చింతకాని సుస్మిత

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌ + ప్రీమియం విభాగంలో చేర్చడం)

21. నన్ను అల్లుకుంది నీ ఊపిరి- దేవి.కె 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

22. మిస్ శిశిర (ఐ మిస్ యు శిశిర!)- కృష్ణప్రియ 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

23. మై వైఫ్ సీఇఓ- ఆలూరి గంగా

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

24. స్వయంకృతం-పరాకృతం- సావిత్రి తోట

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

25. మన్నించవే మనసా- అవనిశ్రీ 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

26. త్రిధ - ప్రవల్లిక భాగవతుల

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

27. ప్రియమైన శ్రీవారు- వెంకట హరిత

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

28.  సీతాయణం- జ్యోతి శ్రీ 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

29. ఎక్కడి దొంగలు అక్కడే- హేమంత అగస్త్యప్రగడ

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

30. ద్వితీయం- ప్రసన్నలక్ష్మి

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

31. మధురమే ఈ పయనం- విభవ 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

32. సైకో- బాలాజీ వర్మ

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

33. మైలురాయి- నర్మద ఏశాల

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

34. అమావాస్య- భాను 

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

35. నిన్నే వరించా- సుజాత(M.V.S)

(1,000/-  నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌)

విజేతలు తమ బ్యాంకు వివరాలు, ఫోన్ నెంబర్,పిన్ కోడ్ తో సహా అడ్రస్, మరియు PAN నెంబర్ [email protected] కి మెయిల్ చేయగలరు.

మా న్యాయనిర్ణేతల బృందానికి నచ్చిన మరికొన్ని రచనలు: 

 ఈ క్రింది సిరీస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోతే అన్యాయమే అవుతుంది. వచ్చేసారి పై సూపర్ రైటర్స్ లిస్టులో ఈ రచయితలను చూడాలని ఆశిస్తున్నాం. 

  1. కారణజన్ముడు - సాయి సత్య

  2. యవ్వనం... వరమా? కలవరమా - గౌరి పొన్నాడ

  3. ది గర్ల్ థింగ్ - సుధీర్

  4. రత్న కిరీటం - ధరణి శ్రీజ

  5. దియా - షేక్ . ఖాతీనా బేగం

  6. ఓ చెలి దూరంగా వెళ్ళకే - స్వాతి నక్షత్ర

  7. ప్రణయవీణ - నిఖిల్ పుష్ప

  8. సీతాకోక చిలుక - భవాని

  9. మిస్సెస్. విరాట్ వర్మ - అవని

  10. తిండిబోతు తాయారు - పద్దు పద్మజ

  11. రహస్యం - తేజోరామ్

  12. ప్రచంఢ బైరవ - పూరేటి కోటేశ్వరరావు

  13. హౌస్ హస్బెండ్ - సిరి

  14. లైఫ్ ఆఫ్ ఆదిత్య - సత్య

  15. శక్తి - కమల శ్రీ

  16. ఎవరు, ఎందుకు - తనుజ

  17. నీ కోసం వస్తున్నా చెలి - హేమ కేరటి

  18. ఓ సీతా...!వదలనిక తోడవుతా.. - స్రవంతి

  19. పరదేశీ నీ పయనం ఎందాక - మామిడాల శైలజ

  20. ఎనిమిది కుటుంబాల కథ - శశిరేఖా లక్ష్మణన్

100 భాగాల మ్యాజిక్ ఫిగర్ దాటిన సిరీస్ వివరాల గురించి మరొక ప్రతేక బ్లాగ్ తో త్వరలో మీ ముందు ఉంటాము. అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితల కృషిని ప్రతిలిపి అభినందిస్తోంది. దీనిని రచయితల విజయంగా భావిస్తున్నాము. మీ ప్రయత్నాలను, ప్రతిభను అభినందిస్తున్నాము. ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము.

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 5' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4  తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: 

https://telugu.pratilipi.com/event/ev9figvi4d

శుభాకాంక్షలు,

ప్రతిలిపి పోటీల విభాగం