pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ - 5 ఫలితాలు

29 సెప్టెంబరు 2023

గౌరవనీయులైన రచయితలకు,

 

మనమంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్-5' ఫలితాలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. విజేతల పేర్లను వెల్లడించే ముందు, మేము మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాము.  ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది రచయితలు తమ సిరీస్ లను ప్రచురించి, గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ఎంతోమంది కొత్త రచయితలు గోల్డెన్ బ్యాడ్జ్ సాధించి, ఈ పోటీలో పాల్గొని అనేక అద్భుతమైన 60 భాగాల సిరీస్ లను ప్రచురించారు. 

 

'సూపర్ రైటర్ అవార్డ్స్' దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సాహిత్య పోటీలలో ఒకటిగా నిలవడం మనకు గర్వకారణం. అద్భుతమైన సిరీస్ లను రాసిన ప్రతిలిపి 'సూపర్ రైటర్స్'ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు ధన్యవాదములు. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది.  ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము.

 

క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథలు, ప్రేమ కథలు, సామాజిక కథలు, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ కథలు ఇలా ఎన్నో రకాల సిరీస్ లు పోటికి ప్రచురించారు. రచయితల సిరీస్ నాణ్యత పెరిగింది. లక్ష్యంతో రాస్తే తక్కువ సమయంలో ఎక్కువ భాగాలు రాయగాలమని రచయితలు నిరూపించారు.

 

పోటీకి రాయడం మొదలు పెట్టి, కొన్ని అనివార్య కారణాల వల్ల సమయానికి సిరీస్ పూర్తి చేయలేని రచయితలు దయచేసి నిరాశ చెందకండి. మీ రచనల నాణ్యత మేము పరిశీలించాము. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ రైటర్ అవార్డ్స్-6 పోటీలో విజయవంతంగా మీ సిరీస్ రాసి పూర్తీ చేస్తారని ఆశిస్తున్నాము. 

 

60 భాగాల సిరీస్ సులభంగా ఎలా రాయాలో తెలుసుకోవడానికి ప్రతిలిపి ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.

 

న్యాయనిర్ణేతులుగా వ్యవహరించి పోటీకి వచ్చిన రచనల నుండి విజేతలను ప్రకటించడం అంత సులువైన విషయం కాదు. పోటీ నిబంధనల ప్రకారం రచనా శైలి, శిల్పం, వ్యాకరణం, ఎత్తుగడ, ముగింపు లాంటి అనేక అంశాలను పరిశీలించి మా న్యాయనిర్ణేతల బృందం ఈ క్రింది రచనలను విజేతలుగా ప్రకటించింది.  గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.

 

సూపర్ రైటర్ అవార్డ్స్-5 విజేతల జాబితా-

మొదటి బహుమతి: 15,000/- నగదు బహుమతి+ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+నేరుగా ప్రీమియం ఎంట్రీ

  1. గరళం - ఐశ్వర్య

రెండవ బహుమతి : 11,000/- నగదు బహుమతి+ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+నేరుగా ప్రీమియం ఎంట్రీ

  1. రెప్ప చాటు స్వప్నం - రేణుక జలదంకి

మూడవ బహుమతి : 7,000/- నగదు బహుమతి+ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+నేరుగా ప్రీమియం ఎంట్రీ

  1. రుధిరం - గాయత్రి మహిక

ఈ క్రింది రచయితలకు 5,000/- నగదు బహుమతి+ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌+నేరుగా ప్రీమియం ఎంట్రీ

  1. ఉగ్రం - యశస్వి జవ్వాది

  2. చెలీ..మల్లి ప్రేమించవా - దుర్గా భవాని జామి

  3. నేనే.. రుద్రాన్ష్..!- మీనా కుమారి ముక్తేశ్వర్

  4. అరణి - తేజు పర్ణిక

  5. బ్రహ్మ వేసిన ముడి - సిరి కృష్ణ

  6. మన్నించు ఓ ప్రేమ - దేవాన్షిత

  7. అర్ణ - Snmr శ్రీధర్

  8. సరసు బ్యూరో - సునీత ఆకెళ్ళ

  9. ఉత్తమ కోడలు - స్వాతి నక్షత్ర

  10. రహస్యం - అనీల్ కుమార్ "రెడ్ షాడో"

  11. నాతిచరామి - హేమ కరేటి

  12. విషకన్య - నీరజ

  13. ప్రేమలేదని ప్రేమించరాదని - స్నేహ

  14. నాలో నువ్వేనే చెలి - దేవి

  15. ఉంటా నీ జతగా - విజయ గండికోట

  16. నా ఊపిరే నీవుగా - అన్వేషిత

  17. మధు కావ్యం - వైశాలి

 

మా న్యాయనిర్ణేతల బృందానికి నచ్చిన మరికొన్ని రచనలు: 

ఈ క్రింది రచనలు మా న్యాయనిర్ణేతలకు చాలా నచ్చాయి. వచ్చే పోటీలో ఈ రచయితలను విజేతల జాబితాలో చూడాలనుకుంటున్నాము.

  1. నీ తోడై నేనుండగా - గౌరి పొన్నాడ

  2. శౌర్యధార - రాజేష్ తొగర్ల

  3. మనః సమర్పయామి - పున్నాగవల్లి

  4. రాక్షసుడు  - సిరి అర్జున్

  5. ప్రేమ చెలగాటం - సంధ్య లిల్లీ

  6. వసంతం - రాపర్తి అనురాధ

  7. సారిక - వెంకట హరిత

  8. ఇరుగు పొరుగు - రామకూరు లక్ష్మీ మణి

  9. జీవితం చేజారనీయకు - మీనాక్షి శ్రీనివాస్

  10. మహారథి - మంతెన లక్ష్మీ దేవి

  11. ఆలంబన గ్రామము - డాక్టర్. షహనాజ్ బతుల్

  12. పచ్చని జీవితాలు - గొట్టిపర్తి యశోద

  13. ద్వితీయకథ - ప్రసన్న లక్ష్మి

  14. సముద్రం- అక్ష్యాయ చౌదరి

  15. దాదా - చాణక్య రెడ్డి

  16. కారణజన్ముడు - సాయి సత్య

  17. పొల మారింది- నర్మద ఏశాల

  18. ప్రేమతో - సత్య

  19. కొత్త తరం- ఉమాదేవి ఎర్రం

  20. పవిత్ర - చెరుకుపల్లి జయచంద్ర

  21. అజ్ఞాత వాసం - రాచర్ల నరేష్ బాబు

  22. ఆటవిడుపు జీవితం - నరసింహ మూర్తి జీడిగుంట

  23. శ్రీ కృష్ణ మధురిమ - భవాని మార్ని

  24. ధర్మ - అనురాధ మురుగము బూజుల

  25. మౌనరాగామా - కీర్తి ప్రియ

 

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ  ప్రశంసా పత్రాన్ని  మెయిల్ చేయడం  జరుగుతుంది.100 భాగాల మ్యాజిక్ ఫిగర్ దాటిన సిరీస్ వివరాల గురించి మరొక ప్రతేక బ్లాగ్ తో త్వరలో మీ ముందు ఉంటాము. అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితల కృషిని ప్రతిలిపి అభినందిస్తోంది. దీనిని రచయితల విజయంగా భావిస్తున్నాము. మీ ప్రయత్నాలను, ప్రతిభను అభినందిస్తున్నాము. 

 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 6' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/gz3vk6n1gt

 

శుభాకాంక్షలు,

ప్రతిలిపి పోటీల విభాగం