గౌరవనీయులైన రచయిత గారికి,
ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ - 6' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము. తమ ప్రతిలిపి ప్రొఫైల్ లో మొట్ట మొదటిసారిగా 60 భాగాల సిరీస్ ప్రచురించి పూర్తి చేసిన రచయితలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
60 భాగాల సిరీస్ మొట్టమొదటిసారి రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే, ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు.
నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య పోటీలో 60 భాగాల సిరీస్ లను ప్రచురించారు. కొంత మంది మధ్యలో ఆపివేయడం కూడా మేము గమనించాము. వచ్చే పోటిలో పట్టుదలతో రాసి మీరు కూడా ఎ జాబితాలో చేరుతారని ఆశిస్తున్నాము.
ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది.
పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
ఇచ్చిన మాట ప్రకారం రచయితల నుండి ఇంటర్వ్యూ తీసుకొని త్వరలో వాటిని ప్రతిలిపి అధికారిక ప్రొఫైల్ లో ప్రచురిస్తాము.
తమ ప్రతిలిపి ప్రొఫైల్ లో మొట్ట మొదటిసారిగా 60 భాగాల సిరీస్ ప్రచురించి పూర్తి చేసిన రచయితల వివరాలు:
తోడు కోసం - వైబోయిన సత్యనారాయణ "లోవదాస్"
పూర్ణిమ - Gagana సుహా
గతజన్మ రహస్యం - చెరుకుపల్లి పద్మామూర్తి
నచ్చావులే - వెంకట దుర్గా ప్రసాద్
చెల్లాచెదురైన జీవితాలు - మధుబాల
రహస్య స్నేహితుడు - బండారు కిషోర్ కుమార్
చెప్పవేచిరుగాలి - అంజలి గాయత్రి "మైత్రేయగీతిక"
తెలుసా నీకైనా - హారిక మైథిలి
మనసు మాట వినదు - షకీర షేక్
ప్రతిలిపి దృష్టిలో మీరంతా ఎమర్జింగ్ రైటర్స్!
ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము.
ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 7' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4 తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
https://telugu.pratilipi.com/event/flzcbzna2d
మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము.
ప్రతిలిపి పోటీల విభాగం