pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ - 6 పోటీలో 80+భాగాల సిరీస్ రాసిన రచయితలకు అభినందనలు!

29 మార్చి 2024

గౌరవనీయులైన రచయిత గారికి,

ఒక  ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము. 

 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ - 6' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది.  ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము.80 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ రాసే ప్రతి రచయితకు ప్రతిలిపి నుండి గ్యారంటీ బహుమతులు ప్రకటించాము. 

 

80 భాగాల సిరీస్ రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే,  ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు.

 

నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య  పోటీలో 100 భాగాల సిరీస్ లను ప్రచురించారు. వాటిలో కొన్ని 150/200/250 లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో సిరీస్ లు ఉన్నాయి. ప్రతిలిపి రచయితల ప్రతిభ అమోఘం.

 

ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది. 

 

పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 

 

ఇచ్చిన మాట ప్రకారం కొరియర్ ద్వారా మీ అందరికీ స్పెషల్ బహుమతి పంపిస్తాం. దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి, దీనికి సంబంధించి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. 

 

సూపర్ రైటర్ అవార్డ్స్-6  పోటీకి  ప్రచురించిన అతిపెద్ద  తెలుగు సిరీస్:

 

రాజు గారి అమ్మాయి : Mr. పర్ఫెక్ట్(మిస్) : 180 భాగాలు

 

80 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ ప్రచురించిన రచయితల వివరాలు-

 

  1. సీతారామం - స్వాతి

  2. సఖియా - ప్రియ శ్రీనివాస్

  3. పెద్దక్క - వాసుకి 

  4. మనసు పలికే మాట ప్రేమ - భవాని మార్ని

  5. నా తోడుంటావా - అవని శ్రీ

  6. ఇట్లు సీతా మహాలక్ష్మి - స్నేహ

  7. శ్రావణ మేఘాలు - విజయ గండికోట

  8. తొలిప్రేమ - సుజాత MVS

  9. ఇష్ట సఖుడా - సిరి కృష్ణ

  10. హీరోయిన్ - గౌరి పొన్నాడ

  11. మైనా - సాయి ప్రవల్లిక

  12. మనసు పడ్డాను.. కానీ - చాణక్య రెడ్డి

  13. వేటాడే క్రోధక్షి - వెంకట హరిత

  14. సమ్మతి - సాయి ప్రవల్లిక

  15. నా ప్రాణం లో ప్రాణంగా - రమ్య

  16. విక్రమ్ - తేజోరామ్

  17. ఇది..(తప్పు).. కాదంటారా - మీనా కుమారి

  18. విక్రమాదిత్య - ఆలూరి గంగ

  19. వల్లకాడు - వెంకటేష్ బాబు విన్నకోట

  20. విజయసేన విజయం - హేమంత అగస్త్య ప్రగడ

  21. నా ప్రాణం నీ నేస్తం - రాజి

  22. వసుధైక అపార్ట్మెంట్స్ - దుర్గా భవాని జామి

  23. ఫైర్ బ్రాండ్ - రాజేష్ తొగర్ల

  24. ముద్దుగుమ్మా - వెన్నెల

  25. ఈ రేయి తీయనిది - నర్మద ఏశాల

  26. సఖా - సిరి అర్జున్

  27. వంశధార - యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు

  28. ఏనుగు - చిట్టత్తూరు మునిగోపాల్

  29. ఓ స్త్రీ రేపు రా - చైతన్య

  30. భారతం మారాలి - కుసుమ సాంబశివ

  31. ట్రూ లవ్ - జానకి

  32. ఉత్తరాన దక్షిణామూర్తి - రాజేష్ తొగర్ల

  33. వదలని బంధం - సత్య

  34. ఆమె కథ - లహరి‌ రాజశేఖర్

  35. వెన్నెల్లో ఆకాశం - రాధిక ఆండ్ర

  36. ఓ సారిలా చూడే చెలి - రాజి

  37. షణ్ముఖపురం - కృష్ణ సఖి

  38. అరుణ కిరణం - చెరుకుపల్లి జయచంద్ర

  39. చెల్లాచెదురైన జీవితాలు - మధుబాల

  40. యష్ట - అనురాధ మురుగము బూజుల

  41. మరుగేలనే ఓ మనసా - సుష్మ చిట్టినేని

  42. మధుమాసపు వెన్నెల - పొందూరు రాంబాబు



ప్రతిలిపి దృష్టిలో మీరంతా సూపర్ రైటర్స్! 

 

ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము.

 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 7' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4  తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: 

https://telugu.pratilipi.com/event/flzcbzna2d

మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

ప్రతిలిపి పోటీల విభాగం