pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్- 6 ఫలితాలు

23 ఫిబ్రవరి 2024

గౌరవనీయులైన రచయితలకు,

 

మనమంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్-6' ఫలితాలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. విజేతల పేర్లను వెల్లడించే ముందు, మేము మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాము.  ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది రచయితలు తమ సిరీస్ లను ప్రచురించి, గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ఎంతోమంది కొత్త రచయితలు గోల్డెన్ బ్యాడ్జ్ సాధించి, ఈ పోటీలో పాల్గొని అనేక అద్భుతమైన 60 భాగాల సిరీస్ లను ప్రచురించారు. 

 

'సూపర్ రైటర్ అవార్డ్స్' దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సాహిత్య పోటీలలో ఒకటిగా నిలవడం మనకు గర్వకారణం. అద్భుతమైన సిరీస్ లను రాసిన ప్రతిలిపి 'సూపర్ రైటర్స్'ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు ధన్యవాదములు. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది.  ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము.

 

క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథలు, ప్రేమ కథలు, సామాజిక కథలు, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ కథలు ఇలా ఎన్నో రకాల సిరీస్ లు పోటికి ప్రచురించారు. రచయితల సిరీస్ నాణ్యత పెరిగింది. లక్ష్యంతో రాస్తే తక్కువ సమయంలో ఎక్కువ భాగాలు రాయగాలమని రచయితలు నిరూపించారు.

 

పోటీకి రాయడం మొదలు పెట్టి, కొన్ని అనివార్య కారణాల వల్ల సమయానికి సిరీస్ పూర్తి చేయలేని రచయితలు దయచేసి నిరాశ చెందకండి. మీ రచనల నాణ్యత మేము పరిశీలించాము. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ రైటర్ అవార్డ్స్-7 పోటీలో విజయవంతంగా మీ సిరీస్ రాసి పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. 

 

60 భాగాల సిరీస్ సులభంగా ఎలా రాయాలో తెలుసుకోవడానికి ప్రతిలిపి ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.

 

న్యాయనిర్ణేతులుగా వ్యవహరించి పోటీకి వచ్చిన రచనల నుండి విజేతలను ప్రకటించడం అంత సులువైన విషయం కాదు. పోటీ నిబంధనల ప్రకారం రచనా శైలి, శిల్పం, వ్యాకరణం, ఎత్తుగడ, ముగింపు లాంటి అనేక అంశాలను పరిశీలించి మా న్యాయనిర్ణేతల బృందం ఈ క్రింది రచనలను విజేతలుగా ప్రకటించింది.  గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.

 

సూపర్ రైటర్ అవార్డ్స్-6 విజేతల జాబితా-

 

పాఠకుల ఎంపిక :

పోటీకి వచ్చిన రచనలను ఒక దగ్గర చేర్చి, పోటీ ప్రారంభ తేది నుండి ముగింపు తేది వరకు ఉన్న రీడ్ కౌంట్, ఎంగేజ్మెంట్ స్కోర్, అనుచరుల సంఖ్య ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. 

 

మొదటి విజేత   : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 వాసుకి  -  పెద్దక్క

రెండవ విజేత    :  5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

చైతన్య వర్మ - ఓ స్త్రీ రేపు రా...

మూడవ  విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

అవని - నా తోడుంటావా

నాల్గవ విజేత   : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

భవాని మార్ని - మనసు పలికే మాట ప్రేమ

ఐదవ విజేత   : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

చాణక్య రెడ్డి  -  మనసు పడ్డాను.. కానీ!

ఆరవ విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

రాజు గారి అమ్మాయి - Mr. పర్ఫెక్ట్(మిస్💃)

ఏడవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

శ్రీ దేవి - అభినందిని

ఎనిమిదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

స్వాతి నక్షత్ర - సీతారామం

తొమ్మిదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

ప్రియ శ్రీనివాస్ - సఖియా

పదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

చిన్ని - నాతోడుగా వుంటావా సఖి

 

న్యాయనిర్ణేతల ఎంపిక : 

పాఠకుల ఎంపిక అయిన తర్వాత, విజేతల రచనలను మినహాయించి, మిగిలిన రచనల నుండి న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచనలను విజేతలుగా ప్రకటించడం జరిగింది. 

 

మొదటి విజేత  :  5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

సిరి అర్జున్  -  సఖా

రెండవ విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

సునీత ఆకెళ్ళ - ఆశల పల్లకి

మూడవ  విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

సిరి కృష్ణ - ఇష్ట సఖుడా 

నాల్గవ విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

దుర్గా భవాని జామి - వసుధైక అపార్ట్మెంట్స్

ఐదవ విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

మీనా కుమారి  -  ఇది తప్పు కాదంటారా?

ఆరవ విజేత  : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

రాజేష్ తొగర్ల - ఉత్తరాన దక్షిణా మూర్తి

ఏడవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

గౌరి పొన్నాడ  -  హీరోయిన్

ఎనిమిదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

యస్.యస్. సుజాతమ్మ - వంశధార

తొమ్మిదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

షకీర షేక్ - మనసు మాట వినదు

పదవ విజేత : 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

హేమంత అగస్త్యప్రగడ - విజయసేన విజయం

 

మా న్యాయనిర్ణేతలు మెచ్చిన మరిన్ని రచనలు: 

 

రచయిత పేరు

రచన

అంజని "స్వేచ్ఛ"

స్వయంవరం

రత్న

గండభేరుండ

సుజాత MVS

తొలిప్రేమ

రమ్య

నా ప్రాణం లో ప్రాణంగా

అల

మనోహరుడు

జ్యోతి "అవంతిక"

నేను.. నా మొగుడు.. ఓ ఫాంటసీ..!

కృష్ణ సఖి

షణ్ముఖపురం

స్నేహ

ఇట్లు సీతా మహాలక్ష్మి

విజయ గండికోట

శ్రావణ మేఘాలు

నర్మద ఏశాల

ఈ రేయి తీయనిది

వెంకట హరిత

వేటాడే క్రోధక్షి

సౌజన్య

శ్రీమతి స్నేహ

రాజేష్ తొగర్ల "ఇక్ష్వాకు"

ఫైర్ బ్రాండ్

అశ్విని సాంకేత్

నా జత నీవే

శైలజ "మల్లిక్"

దీపాంజలి

రాధిక ఆండ్ర

వెన్నెల్లో ఆకాశం

హేమ కరేటి

అన్వేషిక

జానకి జాను

ట్రూ లవ్

లహరి‌ రాజశేఖర్ "దక్షజ"

ఆమె కథ

రాజి విరించి

ఓ సారిలా చూడే చెలి

రాజి

నా ప్రాణం నీ నేస్తం

సుష్మ

మరుగేలనే ఓ మనసా

అంజని గాయత్రి

చెప్పవేచిరుగాలి

గగన

పూర్ణిమ

అన్షిక

అన్షికా కిరణం

సాయి ప్రవల్లిక

మైనా ...!!!

సాయి హేమ

కథ ఏమిటంటే

వెంకట దుర్గా ప్రసాద్

నచ్చావులే...

సత్య M

వదలని బంధం.



పోటీలో పాల్గొన్న రచయితలందరికీ  ప్రశంసా పత్రాన్ని  మెయిల్ చేయడం జరుగుతుంది. 80 భాగాల మ్యాజిక్ ఫిగర్ దాటిన సిరీస్ వివరాలు, టాలెంటెడ్ ఎమర్జింగ్ రైటర్ అవార్డు గురించి మరొక ప్రతేక బ్లాగ్ తో త్వరలో మీ ముందు ఉంటాము. అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితల కృషిని ప్రతిలిపి అభినందిస్తోంది. దీనిని రచయితల విజయంగా భావిస్తున్నాము. మీ ప్రయత్నాలను, ప్రతిభను అభినందిస్తున్నాము. 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 7' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/flzcbzna2d

 

శుభాకాంక్షలు,

ప్రతిలిపి పోటీల విభాగం