pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ - 10 పోటీ ఫలితాలు

14 అక్టోబరు 2025

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,

ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా తొమ్మిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, చివరి సీజన్ అయిన పదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.

ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.

ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

సూపర్ రైటర్ అవార్డ్స్-10 విజేతల జాబితా 

 

మొదటి 3 మంది విజేతలకు: ₹5000 నగదు బహుమతి + ప్రత్యేక అవార్డు + మెయిల్ ద్వారా విజేతా ప్రశంసాపత్రం + ప్రతిలిపి టీం నుండి ప్రత్యేక లేఖ.

 

  1. మీనా కుమారి - నేరెళ్లద్వీపం

  2. కాత్యాయిని - కళత్రం

  3. తోట సావిత్రి - కనిష్ఠిక

 

4-6 విజేతలకు: ₹3000 నగదు బహుమతి + ప్రత్యేక అవార్డు + మెయిల్ ద్వారా విజేతా ప్రశంసాపత్రం +  ప్రతిలిపి టీం నుండి ప్రత్యేక లేఖ.

 

  1. గీతాంజలి - సితార

  2. జానకి - అతడు ఆమె అయితే ?

  3. తను - అమ్మ కాని అమ్మ కథ 

 

 7 - 10 విజేతలకు: ₹2000 నగదు బహుమతి + ప్రత్యేక అవార్డు + మెయిల్ ద్వారా విజేతా ప్రశంసాపత్రం +  ప్రతిలిపి టీం నుండి ప్రత్యేక లేఖ.

 

  1. RSP. మాధవి కృష్ణ - మధురం నీ తలపు నీ పిలుపు

  2. యస్. యస్. సుజాతమ్మ - ఎన్నిసార్లైనా జన్మిస్తా

  3. ఆదిత్య - అన్ ఎక్స్పెక్టెడ్

  4. రోషిని - సారధి

 

11 - 25 విజేతలకు: ₹1,000 నగదు బహుమతి + ప్రత్యేక అవార్డు (ఫ్రేమ్) + మెయిల్ ద్వారా విజేతా ప్రశంసాపత్రం +  ప్రతిలిపి టీం నుండి ప్రత్యేక లేఖ

 

  1. సురేఖ రెడ్డి - పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి

  2. మాయ - మౌనిక

  3. దేవాన్షిత - అందాల బృందావనం

  4. రాజేష్ తొగర్ల - క్వీన్

  5. హరిప్రియ తమ్మినేని - F⁠♡AMES

  6. గౌరి పొన్నాడ - నిశీధి రహస్యం

  7. శ్రీదేవి శర్మ - మధురాతి మధురం

  8. శ్రీ మేఘ - నా ప్రేమ నీ కోసమే

  9. కుసుమ సాంబశివ - దౌర్జన్యం

  10.  చెరుకుపల్లి పద్మామూర్తి - ఉగాదికి వస్తున్నాం

  11.  నయన - అలలై ఎగసేనా

  12. తవనం గోవర్ధన్ రెడ్డి - మేఘ గర్జన

  13. వేణు కిషోర్ - విప్లవ అవని ఆశా దీపం

  14. రాజు - చరవాణి

  15. R.జగదీశ్వరి - M.R.O ఇందుమతి



పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,  పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.  

ప్రస్తుతం జరుగుతున్నప్రతిలిపి అవార్డ్స్ సీజన్ -1' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/ek6h79456v

 

శుభాకాంక్షలు

ప్రతిలిపి పోటీల విభాగం