pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి పోటీ విజేతల ఎంపిక ప్రక్రియ

25 ఆగస్టు 2025

1. అర్హత పొందిన అన్ని రచనలను షార్ట్-లిస్టింగ్ చేయడం

ప్రచురణ తేదీ – సిరీస్ తప్పనిసరిగా పోటీలో తెలిపిన తేదీలలో ప్రచురించి ఉండాలి.  సమయరేఖలో ప్రచురించబడాలి..

→కనీస భాగాల సంఖ్య – పోటీ మార్గదర్శకాల్లో తెలిపిన విధంగా మీ సిరీస్ లో కనీస భాగాలు/అధ్యాయాలు ఉండాలి.

ప్రతి అధ్యాయంలో పదాల సంఖ్య – పోటీలో  తెలిపిన విధంగా కనీస పదాల సంఖ్య ప్రతి అధ్యాయం లో ఉండాలి.

ఎరోటిక్ రచనల నిబంధనలు – సిరీస్ తప్పనిసరిగా ప్రతిలిపి కంటెంట్ మార్గదర్శకాల ప్రకారం ఉండాలి; నిషేధిత  అంశాలు ఉన్న సిరీస్‌లు పోటీకి తీసుకోబడవు. . పూర్తి వివరాల కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

→ నకిలీ లేదా ఇతరుల నుండి కాపీ చేసిన రచనలు పోటీకి పరిగణించబడవు. 

2. న్యాయ నిర్ణేతలు రచనలను ఎంపిక చేసే ప్రక్రియ

షార్ట్‌లిస్ట్ అయిన సిరీస్‌లు సంబంధిత ప్రాంతీయ భాషలో నిపుణులైన న్యాయనిర్ణేతల బృందం ద్వారా పరిశీలించబడతాయి. తదుపరి రౌండ్ కి సిరీస్ సెలెక్ట్ చేయడానికి ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు:

కథ చెప్పే నైపుణ్యం – రచయిత కథను ఎంత ఆకట్టుకునేలా వివరించాడో, మొదటి నుండి చివరి వరకు పాఠకుడిని ఎలా ఆసక్తిగా ఉంచాడో అనేది పరిశీలించడం.

వైవిధ్యం – ప్రతిలిపిలో తరచుగా కనిపించే కథా సరళులకు భిన్నంగా, కొత్తగా & ప్రత్యేకంగా ఉండే ఆలోచనలు.

పాఠకులపై ప్రభావం – కథ పాఠకుడి మనసులో మమేకమై, చదివిన తర్వాత కూడా ఆలోచింపజేయడం. ఇది మీ సిరీస్‌పై వచ్చిన సమీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.

కథా మలుపులు – కథలో అనుకోని మలుపులు పాఠకుడిని తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ముందుకు నడిపే విధంగా ఉండాలి.

కథ యొక్క వేగం – కథ ఎక్కడా లాగిపట్టకుండా లేదా తొందరపెట్టకుండా, సరళంగా ముందుకు సాగేలా ఉండి పాఠకుడి ఆసక్తిని నిలబెట్టాలి.

ఉత్కంఠభరిత మలుపులు ఊహించని సంఘటనలు ఉత్కంఠను, ఉత్సాహాన్ని పెంచుతూ కథను మరింత ఆసక్తికరంగా మార్చాలి.

పాత్రల అభివృద్ధి – పాత్రలు సహజంగా, నిజ జీవితానికి దగ్గరగా ఎదుగుతూ పాఠకుడు పాత్రలతో అనుబంధం ఏర్పరచుకునేలా ఉండాలి.

గమనిక: న్యాయనిర్ణేతల బృందంలోని ప్రతి సభ్యుడు సిరీస్ లకు వ్యక్తిగతంగా మార్కులు కేటాయిస్తారు. ఆ స్కోర్ల సగటు ఆధారంగా సిరీస్‌కు ర్యాంక్ కేటాయించబడుతుంది.

3. డబుల్ చెక్ ప్రక్రియ

మార్కులు వేసిన సిరీస్‌లు, అన్ని నియమాలు పాటించబడినాయా? తీర్పు న్యాయంగా జరిగిందా? అని చూడటానికి ఇద్దరు ప్రతిలిపి టీం సభ్యులు మరలా పరిశీలిస్తారు.  ఆ తర్వాత, విజేతల జాబితా తయారు చేసి, మరోసారి చెక్  చేయడం జరుగుతుంది.  

4.  ఫలితాల ప్రకటన

ఫలితాలు అధికారిక ప్రతిలిపి బ్లాగ్ సెక్షన్ లో ప్రకటించబడతాయి. విజేతలకు యాప్ నోటిఫికేషన్ లేదా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం అందుతుంది.

కథ రాయడం, తీర్పు చెప్పడం చాలా వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది అని మేము అర్థం చేసుకుంటున్నాము. ఒకరికి నచ్చినది మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ మా ఫలితాలు ప్రకటించే విధానం మాత్రం అందరికీ న్యాయంగా, సమానంగా, స్పష్టంగా ఉండేలా రూపొందించబడింది.

 

శుభాకాంక్షలతో

ప్రతిలిపి తెలుగు విభాగం