స్థిరమైన ఆదాయాన్ని పొందటానికి 10 వ్యూహాలు:
ఆకర్షణీయమైన రచనలు: చురుకుగా ఉండండి, మీ ప్రొఫైల్‌లో ఎల్లప్పుడూ కొనసాగుతున్న, అతిపెద్ద సిరీసులు ఉండేలా చూసుకోండి! 100+ భాగాలతో కూడిన సిరీస్, కనీసం 1000 పదాలతో కూడిన ప్రతి భాగాన్ని ఎక్కువమంది చదువుతున్నారని డేటా ద్వారా తెలుస్తోంది. పాఠకులను ఆకర్షించడానికి మీ ప్రీమియం సిరీస్‌లను క్రమం తప్పకుండా ప్రోమోట్ చేయడంపై దృష్టి పెట్టండి.
స్థిరంగా ప్రచురించండి: ప్రతిలిపిలో రచనలను ప్రచురించిన తర్వాత, పాఠకుల కోసం వేచి చూడాలా? అసలు అవసరం లేదు. ప్రతిలిపిలో వేలాది మంది పాఠకులు ఉన్నారు & వారి కోసం అనేక సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, కొత్త భాగాల కోసం పాఠకులు ఆసక్తిగా ఉండేట్లు చేయడానికి క్రమం తప్పకుండా ప్రచురించడం ద్వారా మీ సిరీస్ యొక్క విజిబిలిటీని పెంచుకోండి. వారానికి కనీసం మూడు భాగాలను ప్రచురించడమే లక్ష్యంగా పెట్టుకోండి.
అలవాటుగా చేసుకోండి: మీ ప్రచురణ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి 800-1000 పదాలను స్థిరంగా రాయడానికి 30-45 నిమిషాల పాటు ప్రతిరోజూ రాయడానికి కేటాయించాలి. రాయడాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.
పాఠకులకు ఇష్టమైన వర్గాల్లో రాయండి: ప్రతిలిపి పాఠకులు ఇష్టపడే ప్రేమ, డ్రామా, సస్పెన్స్, హారర్, క్రైమ్-థ్రిల్లర్ వంటి ప్రసిద్ధ వర్గాలను ఎంచుకోండి.
'సూపర్ రైటర్ అవార్డ్' పోటీలో పాల్గొనండి: మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి, పోటీలో ఆకర్షణీయంగా, అధిక-నాణ్యతతో కూడిన అతిపెద్ద సిరీస్‌లను రాయండి. దానివల్ల ఇచ్చిన గడువులో అద్భుతమైన అతిపెద్ద సిరీస్‌లను రాయడం అలవాటు అవుతుంది, తద్వారా నాణ్యమైన రచనలను వేగంగా రాయడం అలవడుతుంది.
ఎక్కువ భాగాలు & హుక్స్: ప్రతి భాగాన్ని హుక్ లేదా క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగించండి. అది, తదుపరి భాగాన్ని అన్‌లాక్ చేయడానికి పాఠకులను ప్రేరేపిస్తుంది. లాక్ చేయబడిన సిరీస్ భాగాలు నాణ్యంగా ఉండేలా చూసుకోండి, పాఠకులు వాటిని అన్‌లాక్ చేయడానికి ఆసక్తిని కలిగేలా చేయండి.
సబ్‌స్క్రిప్షన్‌ని ప్రోత్సహించండి: మీ సిరీస్‌ను లాక్స్ లేకుండా చదవడానికి సబ్‌స్క్రిప్షన్ చేసుకోమని పాఠకులను విజ్ఞప్తి చేయండి. మీరు అతిపెద్ద సిరీస్ రాయడానికి చాలా కష్టపడుతున్నారు కనుక, లాక్ భాగాలను చదవడానికి సబ్‌స్క్రయిబ్ చేయమని మీరు మీ పాఠకులకు క్రమం తప్పకుండా అభ్యర్థించాలి. అది మీ రచనల నుండి మరింత సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. సిరీస్ రాయడానికి మీరు ఎలా శ్రమ పడుతున్నారో పాఠకులకు వివరించండి. అలా చేయడం ద్వారా పాఠకులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.
ప్రమోట్ చేసే సదుపాయాలు: ముగిసిన, కొనసాగుతున్న ప్రీమియం సిరీస్‌లను స్థిరంగా ప్రమోట్ చేయడానికి ప్రతిలిపి పోస్ట్ ఫీచర్, చాట్‌రూమ్‌లు & సందేశాలను ఉపయోగించండి. ప్రమోషన్ అవకాశాల కోసం తోటి రచయితలతో కలవండి. ప్రతిలిపిలో మీ రచనలను ప్రమోట్ చేయడానికి, కొత్త పాఠకులను ఆకర్షించడానికి సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి.
పాఠకులతో ఇంటరాక్ట్ అవ్వండి: కామెంట్స్, పోస్ట్‌లు, చాట్‌రూమ్‌లు & సందేశాలకు ప్రతిస్పందించండి, చర్చలలో పాల్గొనండి & మీ రచనను మెరుగుపరచడానికి పాఠకుల అభిప్రాయాన్ని పరిగణించండి. ఇది వారితో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. మీ సిరీస్‌కు ఎంగేజ్మెంట్, రేటింగ్, రివ్యూస్ వస్తాయి.
కొత్త సీజన్లు: మీ జనాదరణ పొందిన సిరీస్‌కి తదుపరి సీజన్, సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌ను రాయండి. మీ పాఠకులు ఇప్పటికే మీ సిరీస్‌పై ఆసక్తి చూపినందున, వారు తదుపరి సీజన్‌పై కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. కొత్త సిరీస్‌లో మీ జనాదరణ పొందిన పాత్రలను మళ్లీ పరిచయం చేయండి.
→ వేలకొద్దీ టాపిక్‌లు/ప్లాట్‌లు ఉన్నాయి, వాటిపై మీరు అతిపెద్ద సిరీస్‌ను రాయవచ్చు. వ్యక్తుల ప్రవర్తన, మీ స్వంత అనుభవాలను గమనించడం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి ప్రేరణ పొందండి. ఆలోచనలు, ప్రాంప్ట్‌లు, టాపిక్‌లు, వన్-లైనర్లు మొదలైన వాటిని పొందడానికి ఇంటర్నెట్‌ని ఉపయోగించండి.
→ ముఖ్య గమనిక: మీ సిరీస్ 16+ భాగాలను కలిగి ఉండి, ఇంకా ప్రీమియంలో భాగం కాకపోతే, క్రింది దశలను అనుసరించండి:
(1) మీ సిరీస్ యొక్క ప్రధాన పేజీకి వెళ్లండి.
(2) ‘సరిచేయండి’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
(3) తర్వాత, 'ఇతర సమాచారాన్ని సవరించండి' ఎంపికను ఎంచుకోండి.
(4) ఆ పేజీలో, 'సబ్‌స్క్రిప్షన్ కోసం సిరీస్‌ని జోడించు' ఎంపికను ఎంచుకోండి.
(5) సబ్‌స్క్రిప్షన్ కింద మీ సిరీస్‌ని జోడించడానికి 'అవును'ని ఎంచుకోండి.
ఫ్యామిలీ, డ్రామా, సామాజికం, మహిళ థీమ్ లలో సిరీస్ ఎలా రాయాలి?
హుక్ మరియు ప్లాట్ ట్విస్ట్ అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? సిరీస్ ఎలా ముగించాలి?
రాస్తూ, సంపాదిస్తూ ఉండండి.