pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles సంపాదన & భద్రత

ప్రతిలిపిలో మీ సంపాదనను పెంచుకోవడం ఎలా?

గౌరవనీయులైన రచయిత గారికి,

ప్రతిలిపిలో విజయవంతమైన రైటింగ్ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడం అంటే కేవలం ఎక్కువ కథలు రాయడం మాత్రమే కాదు. పాఠకులను ఆకట్టుకునేలా రచన సృష్టించడం, క్రమం తప్పకుండా ప్రచురించడం & మీ సాహిత్యానికి జీవితకాల ప్రోత్సాహం లభించేలా పాఠకులను ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే.

మీ సంపాదనను పెంచుకోవడానికి & మీ పాఠకుల సంఖ్యను విస్తరించుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

  1. 1

    ప్రీమియం సంపాదన అవకాశాలను అన్‌లాక్ చేయండి.

    మీరు గోల్డెన్ బ్యాడ్జ్ (200 మంది అనుచరులు) సాధించిన తర్వాత, మీరు ప్రీమియం సిరీస్ ప్రచురించడానికి అర్హులవుతారు. ప్రస్తుతం ఉన్న సిరీస్‌లలో 16 లేదా అంతకంటే ఎక్కువ భాగాలు ఉంటే, వాటిని ప్రీమియంగా మార్చవచ్చు. అలాగే కొత్త సిరీస్‌లు మొదటి 15 ఉచిత భాగాల తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీమియం కిందకు మారతాయి.

    పాఠకులు లాక్ చేయబడిన భాగాలను ప్రతిలిపి ప్రీమియం, సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్లు, నాణేలు లేదా డైలీ అన్‌లాక్‌ల ద్వారా చదవవచ్చు. రచయితగా, పాఠకులు మీ రచనను అన్‌లాక్ చేసినప్పుడు వచ్చే ఆదాయంలో మీకు కూడా వాటా లభిస్తుంది.

  2. 2

    మీ సాహిత్యాన్ని సపోర్ట్ చేసేలా పాఠకులను ప్రోత్సహించండి.

    చాలామంది పాఠకులకు తాము ఇష్టపడే రచయితలకు ప్రోత్సహించడం నచ్చుతుంది, కానీ వారు ఎలా ప్రోత్సహించాలనే విషయాన్ని వారికి తరచుగా గుర్తు చేయాల్సి ఉంటుంది. ప్రీమియం & సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ల వల్ల కలిగే ప్రయోజనాలను క్రమం తప్పకుండా వివరిస్తూ ఉండండి. అలాగే పాఠకులు మీ రచనలను ఇష్టపడుతుంటే, వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి. ప్రతి భాగం చివరలో మీరు చేసే చిన్న అభ్యర్ధన కూడా ఒక్కోసారి పెద్ద మార్పును తీసుకురాగలదు.

  3. 3

    స్ట్రాంగ్ రీడర్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి

    పాఠకులు తాము బాగా మమేకం అయినట్లు భావించే రచయితలకే ఎక్కువగా ప్రోత్సహిస్తారు. మీ పాఠకులతో మమేకం అవ్వడానికి పోస్ట్‌లు, చాట్‌రూమ్‌లు, Q&A సెషన్‌లు & థాంక్యూ సందేశాలను ఉపయోగించండి. మీ రైటింగ్ జర్నీ, పాత్రల వెనుక ఉన్న ఆలోచనలు & బిహైండ్-ది-సీన్స్ విశేషాలను పంచుకోవడం వల్ల... పాఠకులు మీ కథలతో పాటు మీ విజయానికి కూడా మరింతగా మమేకం అవుతారు.

  4. 4

    ఎక్కువ భాగాలు ఉండే అతిపెద్ద సిరీస్ రాయండి.

    అతిపెద్ద సిరీస్ వల్ల పాఠకులు మీ సిరీస్ తో ఎక్కువకాలం ప్రయాణించడానికి & భాగాలను అన్‌లాక్ చేస్తూ ఉండటానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఎక్కువ భాగాలు ఉండే సిరీస్ లు సాధారణంగా చాలా బాగా రాణిస్తాయి, ఎందుకంటే పాఠకులు ఆ పాత్రలతో, కథాంశంతో ఎమోషనల్‌గా మమేకం అవుతారు. మీకు అనుభవం పెరుగుతున్న కొద్దీ, పాఠకులకు చదవడానికి మరిన్ని రచనలను అందించేలా అతిపెద్ద సిరీస్‌ల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.

  5. 5

    ఆకట్టుకునే రచనా ప్రారంభాలను సృష్టించండి & రచన మొత్తం ఒకే వేగాన్ని కొనసాగించండి.

    మొదట్లోనే కథ ఆకట్టుకునేలా ఉంటే, పాఠకులు ప్రీమియం భాగాల వరకు ఆసక్తిగా చదువుకుంటూ వెళ్తారు. మీ కథాంశాన్ని ముందుకు నడిపించండి, ప్రారంభంలోనే ఆసక్తికరమైన మలుపులను లేదా సంఘర్షణను పరిచయం చేయండి. అలాగే భాగాలను ముగించేటప్పుడు ఉత్కంఠ, టెన్షన్ లేదా క్లిఫ్‌హ్యాంగర్స్‌తో ముగించండి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగినప్పుడు, పాఠకులు భాగాలను అన్‌లాక్ చేయడానికి మరింత ఇష్టపడతారు.

  6. 6

    క్రమం తప్పకుండా ప్రచురించండి.

    పాఠకులను సంపాదించుకోవడంలో క్రమం తప్పకుండా ప్రచురించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి. కొత్త భాగాలు ఎప్పుడు వస్తాయో ముందుగానే తెలియడాన్ని పాఠకులు ఇష్టపడతారు. అలాగే క్రమం తప్పకుండా ప్రచురించడం వల్ల ప్లాట్‌ఫారమ్‌పై మీ కథలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. మీరు రోజువారీగా ప్రచురించినా లేదా వారానికి కొన్ని సార్లు ప్రచురించినా, ఒక పక్కా షెడ్యూల్‌ను పాటించడం వల్ల పాఠకులు మీ కథలను క్రమం తప్పకుండా చదవడం అలవాటు చేసుకుంటారు.

  7. 7

    పోటీలు & ఛాలెంజ్‌లలో పాల్గొనండి.

    రైటింగ్ పోటీలు & ఛాలెంజ్‌లు మీ సాహిత్యాన్ని కొత్త పాఠకులకు పరిచయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అవకాశాలు మీ రచనల విజిబిలిటీని పెంచడమే కాకుండా, మీరు క్రమశిక్షణను అలవర్చుకోవడానికి, మీ రైటింగ్ వేగాన్ని పెంచుకోవడానికి & కాలక్రమేణా మీ రచనల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోవడానికి సహాయపడతాయి.

  8. 8

    మొదటి ఇంప్రెషన్ ఉత్తమంగా ఉండేలా చూసుకోండి.

    పాఠకులు మీ రచనను చదవడానికి ముందే, వారు మీ కవర్ పేజీ, టైటిల్ & వివరణను చూస్తారు. ఆకట్టుకునే కవర్ పేజీ, స్పష్టమైన టైటిల్ & ఆసక్తికరమైన వివరణ ఉంటే... పాఠకులు మీ కథను ఓపెన్ చేసి చదివే అవకాశాలు చాలా ఎక్కువ. మొదటి ఇంప్రెషన్ బలంగా ఉన్నప్పుడే ఎక్కువ మంది పాఠకులు మమేకం అవుతారు & జీవితకాలం పాటు మంచి గ్రోత్ ఉంటుంది.

  9. 9

    సాధారణంగా చేసే తప్పులను నివారించండి.

    మీ రైటింగ్ ఎంత బాగున్నప్పటికీ, కొన్ని అలవాట్లు మీ సంపాదనను పరిమితం చేయవచ్చు. కథలను ప్రచురించడంలో ఎక్కువ గ్యాప్స్ ఇవ్వడం, కథలను అసంపూర్తిగా వదిలేయడం, ప్రారంభం ఆకట్టుకునేలా లేకపోవడం, రచన ఒక పద్దతిగా లేకపోవడం & పాఠకుల ఫీడ్ బ్యాక్‌ను పట్టించుకోకపోవడం వల్ల మీ పాఠకుల సంఖ్య తగ్గిపోవచ్చు. క్రమశిక్షణ & నాణ్యత ద్వారా పాఠకులలో నమ్మకాన్ని పెంపొందించుకోవడం జీవితకాల సక్సెస్‌కు ఎంతో కీలకం.

  10. 10

    ముగింపు సందేశం

    విజయవంతమైన రచయితలు ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెడతారు: ఆకట్టుకునే కథలను సృష్టించడం, క్రమం తప్పకుండా ప్రచురించడం & పాఠకులతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం. మీరు మీ పాఠకులకు ఎంత మంచి రచనలు అందిస్తే, మీ పాఠకుల సంఖ్య, విజిబిలిటీ & సంపాదన పెరగడానికి అన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? సంపాదన & భద్రతలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు