pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles ప్రారంభం

మంచి కవర్ ఫోటోలను రూపొందించడానికి కొన్ని మార్గదర్శకాలు.

గౌరవనీయులైన రచయిత గారికి,

మీ కథకు సంబంధించిన కవర్ ఫోటో అనేది పాఠకులకు కలిగే మొదటి అభిప్రాయం. ఒక మంచి కవర్ ఫోటో పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా, క్లిక్స్ పెరిగేలా చేస్తుంది & మీ కథను మరింత ప్రొఫెషనల్‌గా చూపిస్తుంది.

మీ ప్రతిలిపి కథ కోసం ఒక చక్కటి కవర్ ఫోటోను ఎంచుకోవడానికి లేదా రూపొందించడానికి సహాయపడే కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి.

  1. 1

    డిజైన్‌ను సింపుల్‌గా & స్పష్టంగా ఉంచండి.

    ప్రతిలిపిలోని 90% కంటే ఎక్కువ మంది పాఠకులు తమ మొబైల్ ఫోన్లలోనే కథలను చదువుతుంటారు. మొబైల్‌లో కవర్ ఫోటోలు చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి, మొదటి చూపులోనే సులభంగా అర్థమయ్యేలా ఉండే ఒక సాధారణ డిజైన్‌ను ఉపయోగించండి.

  2. 2

    బ్రైట్ & ఆకట్టుకునే రంగులను ఉపయోగించండి.

    బ్రైట్ కలర్స్ పాఠకుల దృష్టిని చాలా వేగంగా ఆకర్షిస్తాయి. మీ కథ టైటిల్ స్పష్టంగా కనిపించేలా బ్యాక్‌గ్రౌండ్ & ఫాంట్ రంగుల మధ్య మంచి కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోండి.

  3. 3

    మీ కథ యొక్క మూడ్‌కి సరిపోయేలా కవర్‌ను రూపొందించండి.

    మీ కవర్ ఫోటో మీ కథలోని ప్రధాన భావాన్ని ప్రతిబింబించాలి. అది ప్రేమకథ అయితే ప్రేమ లేదా స్నేహాన్ని; భయానక కథ అయితే డార్క్ & సస్పెన్స్ ఎఫెక్ట్స్‌ను; డ్రామా కథ అయితే బలమైన ఎమోషన్స్ లేదా ఘర్షణలను చూపించండి.

  4. 4

    పాత్రలను జాగ్రత్తగా ఉపయోగించండి.

    కథకు సరిపోయేలా ఉంటే కవర్ ఫోటోలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాత్రలను పరిచయం చేయడం మంచి రిజల్ట్ ఇస్తుంది. నిజమైన వ్యక్తుల ముఖాలు లేదాసజీవమైన పాత్రలు మీ కథ యొక్క మూడ్‌ను పాఠకులు త్వరగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

  5. 5

    ఇతర పుస్తకాల కవర్ ఫోటోల నుండి నేర్చుకోండి.

    ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా బుక్‌స్టోర్‌కి వెళ్లి ఎలాంటి కవర్ ఫోటోలు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయో గమనించండి. మీరు రాసే జానర్ (genre)కు సంబంధించిన కవర్ ఫోటోలను చూసి, వాటిలో సాధారణంగా ఎలాంటి ఎలిమెంట్స్, రంగులు, ఫాంట్‌లు & స్టైల్స్ వాడుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

  6. 6

    కాపీరైట్ లేని ఫొటోలనే ఉపయోగించండి.

    ఇంటర్నెట్ నుండి దొరికిన ఫోటోలను ఎలా పడితే అలా వాడేయకండి. భవిష్యత్తులో కాపీరైట్ సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎల్లప్పుడూ కాపీరైట్ లేని ఫోటోలను ఉపయోగించండి లేదా మీ స్వంత డిజైన్‌ను క్రియేట్ చేసుకోండి.

  7. 7

    అశ్లీల ఫోటోలను అస్సలు వాడకండి.

    కవర్ ఫోటోలుగా అశ్లీల, అసభ్యకరమైన లేదా సున్నితమైన ఫోటోలను ఉపయోగించవద్దు. ప్రతిలిపిలో ఇటువంటి కవర్ ఫోటోలకు అనుమతి లేదు, ఒకవేళ పెడితే సిస్టమ్ వాటిని గుర్తించి ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.

  8. 8

    డిజైన్ టూల్స్‌ను ఉపయోగించండి.

    మంచి కవర్ ఫోటోలను సులభంగా తయారు చేయడానికి మీరు ఈ డిజైన్ టూల్స్‌ను ఉపయోగించవచ్చు:

    Canva: https://play.google.com/store/apps/details?id=com.canva.editor

  9. 9

    Bing: https://play.google.com/store/apps/details?id=com.microsoft.bing

    కాపీరైట్ లేని ఫోటోల వెబ్‌సైట్లను ఉపయోగించండి మీకు ఉచితంగా ఫోటోలు దొరికే కొన్ని వెబ్‌సైట్లు ఇక్కడ ఉన్నాయి:

    Pixabay: http://pixabay.com/

    Unsplash: http://unsplash.com/

  10. 10

    ముగింపు సందేశం

    ఒక మంచి కవర్ ఫోటో ఎప్పుడూ సింపుల్‌గా, ఆకట్టుకునేలా, స్పష్టంగా చదవడానికి వీలుగా & మీ కథకు మమేకం అయ్యేలా ఉండాలి. మీ కవర్ ఫోటో కథ యొక్క మూడ్‌ను స్పష్టంగా చూపించినప్పుడు, పాఠకులు దానిని ఓపెన్ చేసి చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? ప్రారంభంలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు