గౌరవనీయులైన రచయిత గారికి,
రచయితలు తమ రచనల ద్వారా ఆదాయం పొందేందుకు ప్రతిలిపి ఎన్నో రకాల అవకాశాలను కల్పిస్తోంది. మీరు దీనికి అర్హత సాధించిన తర్వాత.. ప్రీమియం సిరీస్, లాక్ చేయబడిన భాగాలు, సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్స్, ప్రీమియం పాఠకులు, స్టిక్కర్లు & నాణేల అన్‌లాక్‌ల ద్వారా చక్కగా సంపాదించుకోవచ్చు.
ప్రతిలిపి సబ్‌స్క్రిప్షన్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరించాం, చూడండి.
- 1
ప్రీమియం కోసం అర్హత సాధించడం ఎలా?
మీరు ప్రీమియం సిరీస్ రాస్తూ, లాక్ చేసిన భాగాల ద్వారా సంపాదించాలనుకుంటే.. మొదటగా మీరు 'గోల్డెన్ బ్యాడ్జ్' సాధించిన రచయిత కావాలి. ఈ గోల్డెన్ బ్యాడ్జ్ పొందడానికి ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలలో ఒకటి – ప్రతిలిపిలో మీకు కనీసం 200 మంది అనుచరులు ఉండటం.
- 2
మీ పాత సిరీస్‌ను ప్రీమియం కిందకు మార్చడం.
మీకు గోల్డెన్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత, మీ పాత సిరీస్‌లలో అర్హత ఉన్న వాటిని ప్రీమియం సిరీస్‌లుగా మార్చుకోవచ్చు. మీ సిరీస్‌లో 16 లేదా అంతకంటే ఎక్కువ భాగాలు ఉంటే.. యాప్‌లోని వ్రాయండి విభాగానికి వెళ్లి, మీ సిరీస్‌ను ఓపెన్ చేసి, 'ఎడిట్ వివరాలు' పై క్లిక్ చేసి, ఆ సిరీస్‌ను సబ్‌స్క్రిప్షన్ కిందకు జోడించవచ్చు.
- 3
ధృవీకరణ కోసం వేచి ఉండండి.
మీరు సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకున్న 24 గంటల లోపు మీకు ఒక ధృవీకరణ సందేశం వస్తుంది. అనుమతి లభించిన వెంటనే, మీ సిరీస్ 'ప్రీమియం సిరీస్'గా మారిపోతుంది.
- 4
కొత్త ప్రీమియం సిరీస్ రాయడం.
ఒకసారి గోల్డెన్ బ్యాడ్జ్ రచయితగా మారిన తర్వాత, మీరు రాసే ఏ కొత్త సిరీస్ అయినా 16వ భాగానికి చేరుకోగానే ప్రీమియం కిందకు వస్తుంది. మొదటి 15 భాగాలు పాఠకులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. 16వ భాగం నుండి ఆ సిరీస్ లాక్ చేయబడుతుంది.
- 5
పాఠకులు లాక్ చేసిన భాగాలను ఎలా అన్‌లాక్ చేస్తారు?
పాఠకులు మీ ప్రీమియం భాగాలను రకరకాలుగా అన్‌లాక్ చేసుకోవచ్చు. వారు ప్రతిలిపి ప్రీమియం తీసుకోవచ్చు, మీ సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వచ్చు, ప్రతిలిపి కాయిన్స్ ఉపయోగించవచ్చు లేదా రోజువారీ ఉచిత అన్‌లాక్ సదుపాయం ద్వారా రోజుకో భాగాన్ని అన్‌లాక్ చేసుకుని చదవవచ్చు.
- 6
ఇంతకీ సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ అంటే ఏమిటి?
సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ అనేది రచయిత స్థాయికి సంబంధించినది. పాఠకులు తమకు ఇష్టమైన రచయితగా నేరుగా మీకే సబ్‌స్క్రైబ్ చేసుకుని, మీ లాక్ చేసిన భాగాలను అన్‌లాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, వారికి మీ చాట్‌రూమ్ యాక్సెస్ మరియు రచయిత అందించే ఇతర ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
- 7
ప్రతిలిపి ప్రీమియం అంటే ఏమిటి?
ప్రతిలిపి ప్రీమియం అనేది ప్లాట్‌ఫారమ్ స్థాయి సబ్‌స్క్రిప్షన్. దీని ద్వారా ప్రీమియం పాఠకులు ప్రతిలిపిలోని ఏ ప్రీమియం కథలనైనా అన్‌లాక్ చేసి చదవవచ్చు. ఒక రచయితగా, ఈ ప్రీమియం పాఠకులు మీ లాక్ చేసిన భాగాలను ఎంత ఎంత సమయం చదివారు లేదా ఎంతగా స్పందించారు అనే దాని ఆధారంగా మీకు ఆదాయం లభిస్తుంది.
- 8
నాణేలతో అన్‌లాక్ ఎలా పనిచేస్తుంది?
పాఠకులు తమ వద్ద ఉన్న ప్రతిలిపి నాణేలను ఉపయోగించి మీ ప్రీమియం సిరీస్‌లోని లాక్ చేసిన భాగాలను అన్‌లాక్ చేయవచ్చు. ఉదాహరణకు, ఒక లాక్ చేసిన భాగాన్ని అన్‌లాక్ చేయడానికి పాఠకుడు 5 ప్రతిలిపి నాణేలను ఉపయోగించవచ్చు.
- 9
రచయిత ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు?
ఒక రచయితగా, మీకు లభించిన నాణేలు విలువలో 36% వాటా మీ ఆదాయంగా వస్తుంది. ఉదాహరణకు, మీకు రూ.100 విలువైన 200 ప్రతిలిపి కాయిన్స్ వస్తే, మీ ఆదాయం ఆ రూ.100లో 36%, అంటే రూ.36 అవుతుంది.
- 10
అతిపెద్ద సిరీస్‌లు ఎక్కువ సంపాదించడానికి ఎలా సహాయపడతాయి?
ఎక్కువ భాగాలతో కూడిన అతిపెద్ద సిరీస్‌లు ఉంటే, పాఠకులకు అన్‌లాక్ చేయడానికి మరిన్ని లాక్ చేసిన భాగాలు ఉంటాయి, అలాగే కథను ముందుకు చదవడానికి మంచి ఆసక్తి కలుగుతుంది. మీ కథ ఆకట్టుకునేలా ఉంటూ, క్రమం తప్పకుండా ప్రచురిస్తూ ఉంటే… పాఠకులు సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి, నాణేలు ఉపయోగించడానికి & మీకు నిరంతరం మద్దతు అందించడానికి ఎంతో ఇష్టపడతారు.
- 11
ముగింపు సందేశం
ప్రతిలిపి సబ్‌స్క్రిప్షన్ అనేది, పాఠకులు మీ ప్రీమియం భాగాలను అన్‌లాక్ చేసి చదువుతున్నప్పుడు మీ కథల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అద్భుతంగా తోడ్పడుతుంది.
ఈ సువర్ణావకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి.. గోల్డెన్ బ్యాడ్జ్ రచయిత కావడంపై దృష్టి పెట్టండి, ఆకట్టుకునే అతిపెద్ద సిరీస్‌లు రాయండి, క్రమం తప్పకుండా ప్రచురించండి & మీకంటూ ఒక నమ్మకమైన పాఠకుల బలగాన్ని ఏర్పరచుకోండి.
సంతోషంగా రాయండి!
— ప్రతిలిపి బృందం
