pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles మరింత మంది పాఠకులను పొందడం

ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలు మరింత ఎక్కువగా ఎలా సంపాదించవచ్చు?

గౌరవనీయులైన రచయిత గారికి,

ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయిత హోదా అనేది ప్రత్యేకమైన గుర్తింపు. మీకు ఒక్కసారి గోల్డెన్ బ్యాడ్జ్ లభించినట్లయితే, మీరు మీ సిరీస్‌లను నేరుగా ప్రీమియం కేటగిరీ కింద రాయవచ్చు & మీ కథల ద్వారా సంపాదించడం ప్రారంభించవచ్చు.

అంతేకాదు, మీ పాత సిరీస్‌లలో 15 లేదా అంతకంటే ఎక్కువ భాగాలు ఉన్నవాటిని కూడా మీరు ప్రీమియం ప్రోగ్రామ్‌లో చేర్చవచ్చు. దీనివల్ల పాఠకులు ఆ భాగాలను అన్‌లాక్ చేసి చదువుతున్నప్పుడు, మీ కథల ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.

ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయితగా మరింత ఎక్కువగా సంపాదించుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి, చూడండి:

  1. 1

    అతిపెద్ద సిరీస్‌లు రాయండి.

    ప్రతిలిపిలో మీరు మంచి ఆదాయం సంపాదించాలనుకుంటే, ఎక్కువ భాగాలతో కూడిన అతిపెద్ద సిరీస్‌లు రాయడం చాలా ముఖ్యం. కవితలు, చిన్న కథలు వినడానికి అందంగా ఉన్నప్పటికీ… సంపాదన విషయానికి వస్తే మాత్రం ఎక్కువ రోజులు సాగే అతిపెద్ద సిరీస్‌లకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 60 లేదా అంతకంటే ఎక్కువ భాగాలు ఉండేలా సిరీస్‌లు రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కథ ఎంత పొడవుగా ఉంటే, పాఠకులకు అన్‌లాక్ చేయడానికి అన్ని ఎక్కువ భాగాలు ఉంటాయి, అలాగే వారు కథతో మరింత కాలం ప్రయాణించడానికి బలమైన కారణం దొరుకుతుంది.

  2. 2

    సబ్‌స్క్రైబ్ చేసుకునేలా పాఠకులను ప్రోత్సహించండి.

    మీరు ఆకట్టుకునేలా అతిపెద్ద సిరీస్‌ను రాస్తున్నప్పుడు.. లాక్ చేసిన భాగాలను చదవడం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోమని మీ పాఠకులను సున్నితంగా కోరవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు రకాల సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి:

    సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ : పాఠకులు తమకు ఇష్టమైన రచయితకు నేరుగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒక రచయితగా, ప్రతి సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీకు ప్రతిలిపి నాణేలు లభిస్తాయి. ఈ సూపర్‌ఫ్యాన్స్ మీ లాక్ చేసిన భాగాలను అన్‌లాక్ చేసుకోవడంతో పాటు, మీ చాట్‌రూమ్ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.

    ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ : ఇది యాప్ మొత్తానికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్. దీని ద్వారా ప్రీమియం పాఠకులు ప్రతిలిపిలోని ఏ ప్రీమియం కథలనైనా అన్‌లాక్ చేసి చదవవచ్చు. ఈ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మీ లాక్ చేసిన భాగాలను ఎన్నిసార్లు చదివారు అనే దాని ఆధారంగా ఒక రచయితగా మీకు ప్రతిలిపి నాణేలు లభిస్తాయి.

  3. 3

    గోల్డెన్ బ్యాడ్జ్ పోటీలలో పాల్గొనండి.

    ప్రతిలిపి కేవలం గోల్డెన్ బ్యాడ్జ్ పొందిన రచయితల కోసమే ప్రత్యేకమైన రచనల పోటీలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పోటీలలో పాల్గొనడం వల్ల మీకు యాప్‌లో మంచి విజిబిలిటీ లభిస్తుంది, కొత్త పాఠకులు మీ కథల వైపు ఆకర్షితులవుతారు & ప్లాట్‌ఫారమ్‌లో మీ రచనా ప్రయాణం మరింత అద్భుతంగా ముందుకు సాగుతుంది.

  4. 4

    అతిపెద్ద సిరీస్‌లు రాసే అలవాటును పెంపొందించుకోండి.

    మొదట 30 భాగాల సిరీస్‌తో ప్రారంభించండి, ఆ తర్వాత 40 భాగాలు రాయడానికి ప్రయత్నించండి, అలా నెమ్మదిగా ఇంకా ఎక్కువ భాగాలు రాయడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ అలవాటు మీకు 60కి పైగా భాగాలు ఉన్న సిరీస్‌లను రాయడానికి అవసరమైన పట్టుదలను, క్రమశిక్షణను ఇస్తుంది. ప్రతిలిపిలో అతిపెద్ద సిరీస్ లు రాస్తూ మంచి ఆదాయం పొందుతున్న పాపులర్ రచయితలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు.

  5. 5

    ఒకేసారి చాలా చిన్న కథలు రాసేకంటే ఒకే ఒక అతిపెద్ద సిరీస్‌పై దృష్టిపెట్టండి.

    ఒకే సమయంలో రెండు మూడు చిన్న చిన్న సిరీస్‌లు రాసే బదులు, బలమైన కథాంశం ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద సిరీస్‌పై పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. పాఠకులను ఎక్కువగా ఆకట్టుకునే ఇలాంటి రకాల థీమ్స్‌ని ఎంచుకోండి:

    రొమాన్స్, బంధాలు, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, పగ, వివాహం, ఆఫీస్ రొమాన్స్ లేదా కాలేజ్ రొమాన్స్.

    హారర్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, దయ్యాలు, వాంపైర్లు, పాత రహస్యాలు లేదా వింత జీవులు.

    క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, పగ లేదా సీరియల్ కిల్లర్ కథలు.

    ఇలా ఒకే అతిపెద్ద సిరీస్‌పై దృష్టి పెట్టడం వల్ల నమ్మకమైన పాఠకుల బలగాన్ని నిర్మించుకోవచ్చు & క్రమం తప్పకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

  6. 6

    కనీసం 50 సమీక్షలను లక్ష్యంగా పెట్టుకోండి.

    సమీక్షలు… మీ కథపై ఇతరులకు నమ్మకాన్ని కలిగిస్తాయి & మరింత మంది పాఠకులను ఆకర్షించడానికి సహాయపడతాయి. మీ సిరీస్‌కు రేటింగ్ & సమీక్షలు ఇవ్వమని మీ పాఠకులను ప్రోత్సహించండి. కనీసం 50 నిజాయితీతో కూడిన సమీక్షలను పొందడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది యాప్‌లో మీ కథ యొక్క విజిబిలిటీని చాలా వరకు మెరుగుపరుస్తుంది.

  7. 7

    మీ పాఠకులతో నిరంతరం మాట్లాడుతుండండి.

    రచయితలు తమ కామెంట్లకు సమాధానాలు ఇచ్చినప్పుడు పాఠకులు ఎంతో సంతోషిస్తారు. సమీక్షలు, సందేశాలు & కామెంట్‌లకు ఎప్పటికప్పుడు ప్రత్యుత్తరాలు ఇవ్వండి. వారి మద్దతును అభినందిస్తూ చిన్న థాంక్యూ పోస్ట్ ను కూడా పోస్ట్ చేయవచ్చు. పాఠకులకు తాము ప్రత్యేకమని అనిపించినప్పుడు, వారు మీ కథలను చదవడానికి & మీకు మద్దతు ఇవ్వడానికి మరింత ఇష్టపడతారు.

  8. 8

    ప్రతిలిపిలో యాక్టివ్‌గా ఉండండి.

    మీ పాఠకులతో ఎల్లప్పుడూ అనుబంధంగా ఉండటానికి ప్రతిలిపిలోని పోస్ట్‌లు, సమీక్షలు, సందేశాలు & చాట్‌రూమ్‌ల వంటి ఫీచర్లను చక్కగా ఉపయోగించుకోండి. క్రమం తప్పకుండా పాఠకులతో సంభాషించడం వల్ల మీ విజిబిలిటీ పెరుగుతుంది & కాలక్రమేణా ఒక బలమైన పాఠకుల కమ్యూనిటీని నిర్మించుకోవడంలో మీకు సహాయపడుతుంది.

  9. 9

    ముగింపు సందేశం

    ప్రతిలిపిలో ఒక గొప్ప రచయితగా ఎదగడానికి గోల్డెన్ బ్యాడ్జ్ మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. కానీ మీ విజయం అనేది మీరు రాసే అతిపెద్ద కథలు, క్రమం తప్పకుండా ప్రచురించడం, పాఠకులతో ఏర్పరచుకునే అనుబంధం & మీ నిరంతర కృషిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతిపెద్ద సిరీస్‌లు రాయండి, పాఠకులను కథలో లీనమయ్యేలా చేయండి & మీకు అందుబాటులో ఉన్న ప్రీమియం అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? మరింత మంది పాఠకులను పొందడంలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు