గౌరవనీయులైన రచయిత గారికి,
ప్రతిలిపిలో మీ కథ కేవలం ఒక రచన రూపంలోనే కాకుండా అంతకంటే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. మీ కథకు మంచి ఆదరణ వచ్చినా లేదా అందులో మంచి సామర్థ్యం ఉన్నా, దాన్ని ఆడియో, కామిక్స్, పుస్తకాలు, మైక్రోడ్రామాలు లేదా వీడియో వంటి ఇతర రూపాల్లోకి మార్చడం కోసం పరిశీలించవచ్చు.
ప్రతిలిపిలో ఈ IP (కాపీహక్కుల) ప్రయాణం ఎలా సాగుతుందో ఇక్కడ సులభంగా వివరించాము.
- 1
కాపీహక్కుల ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఏదైనా ఒక కథకు మంచి పాఠకాదరణ వచ్చినప్పుడు లేదా అందులో మంచి సామర్థ్యం కనిపించినప్పుడు, ప్రతిలిపి అంతర్గత టీమ్స్ దాన్ని వేరే రూపాల్లోకి మార్చవచ్చా అనే కోణంలో పరిశీలించడం ప్రారంభిస్తాయి. మీ కథ (కాపీహక్కుల) IP ప్రయాణంలోకి అడుగుపెట్టడానికి ఇదే మొదటి మెట్టు.
- 2
మీ కథ ఎంపిక అయినప్పుడు ఏం జరుగుతుంది?
ఎంపిక అయిన కథలను 'ప్రతిలిపి IP వేర్‌హౌస్'కు జోడిస్తాము, అక్కడ విభిన్న సృజనాత్మక టీమ్స్ వాటిని పరిశీలిస్తాయి. మీ కథను ఆడియో, కామిక్స్, పుస్తకాలు, మైక్రోడ్రామాలు లేదా లాంగ్-ఫార్మాట్ వీడియోల కోసం ఎంపిక చేయవచ్చు. కథ ఎంపికైన వెంటనే దాన్ని వేరే రూపంలోకి మార్చేస్తారని గ్యారెంటీ లేకపోయినా, భవిష్యత్తులో వచ్చే అవకాశాల కోసం మీ కథ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఇది సహాయపడుతుంది.
- 3
మేము అడిగే మూల రచనను ఇతర రూపాల్లోకి మార్చే హక్కులు అంటే ఏంటి?
ఒకవేళ మీ కథ ఏదైనా కొత్త రూపంలోకి మారడానికి ఎంపికైతే, మేము ఆ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిర్దిష్టమైన హక్కులను మాత్రమే కోరతాము. ఈ హక్కుల వల్ల, మీ కథపై రచయితగా మీ పేరు అలాగే ఉంటూనే, మీ కథ ఆధారంగా మేము కొత్త వర్షన్లను సృష్టించడానికి వీలవుతుంది.
- 4
అగ్రిమెంట్ తర్వాత మీ నుండి మేము ఏం ఆశిస్తాము?
అగ్రిమెంట్ జరిగిన తర్వాత, మీ కథను ప్రతిలిపిలోనే ప్రచురించి ఉంచాల్సిందిగా దయచేసి కోరుతున్నాము. అలాగే, మీ కథ హక్కుల కోసం బయటి టీమ్స్ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మాకు తెలియజేయండి & ఒకే సమయంలో ఇతరులతో కూడా అగ్రిమెంట్లు చేసుకోకుండా జాగ్రత్తపడండి.
- 5
రచయితలు చేయకూడని విషయాలు ఏంటి?
దయచేసి మీ కథను తొలిగించడం, మాకు చెప్పకుండా ఆ కథ హక్కులను ఇతరులకు ఇవ్వడం లేదా ఇంతకు ముందు జరిగిన హక్కుల అగ్రిమెంట్ల వివరాలను దాచడం వంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల మీ కథకు వచ్చే చక్కని అవకాశాలు ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా నిలిచిపోవచ్చు.
- 6
మీ కథ ఎదగడానికి IP (కాపీహక్కులు) ఎలా సహాయపడుతుంది?
ఈ IP(కాపీహక్కులు) అవకాశాల ద్వారా, మీ కథ వేర్వేరు రూపాల్లో సరికొత్త పాఠకులకు/ప్రేక్షకులకు చేరువవుతుంది. మీ కథ ఆడియో, పుస్తకాలు, కామిక్స్, మైక్రోడ్రామాలు లేదా వీడియోలుగా రూపాంతరం చెంది, మీకు దీర్ఘకాలికంగా సరికొత్త సృజనాత్మక అవకాశాలను అందిస్తుంది.
- 7
IP (కాపీహక్కులు) కొనుగోలు కోసం మేము కథలను ఎలా పరిశీలిస్తాము?
మేము కథలో బలమైన కథాంశం, పాఠకుల ఆదరణ, వైవిధ్యభరితమైన ఆలోచనలు & ఇతర రూపాల్లోకి సులభంగా మారే వీలుందా లేదా అనే విషయాలను గమనిస్తాము. ఏదైనా ఒక కథ మా సృజనాత్మక టీమ్స్ కి సరిగ్గా సరిపోతే, అది మా అంతర్గత IP విభాగానికి వెళ్తుంది.
సంతోషంగా రాయండి!
— ప్రతిలిపి బృందం
