pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles మరింత మంది పాఠకులను పొందడం

ప్రతిలిపి రికమండేషన్ సిస్టమ్ పాఠకులకు ఎలా పని చేస్తుంది?

గౌరవనీయులైన రచయిత గారికి,

ప్రతిలిపి యొక్క రికమండేషన్ సిస్టమ్ పాఠకులు తమకు నచ్చే సరికొత్త కథలను సులభంగా కనుగొనడంలో సహాయపడుతుంది. యూట్యూబ్ మనకు నచ్చిన వీడియోల ఆధారంగా ఇతర వీడియోలను ఎలా సూచిస్తుందో.. అలాగే ప్రతిలిపి కూడా పాఠకులు చదివే విధానాన్ని బట్టి వారికి నచ్చే కథలను సూచిస్తుంది.

ప్రతిలిపిలో పాఠకులకు కథల రికమండేషన్స్ ఎలా లభిస్తాయో ఇక్కడ చాలా సులభంగా వివరించడం జరిగింది, చూడండి:

  1. 1

    పాఠకుల ఆసక్తి

    ఒక పాఠకుడు సాధారణంగా ఎలాంటి కథలను చదువుతున్నారనే విషయాన్ని ప్రతిలిపి గమనిస్తుంది. ఉదాహరణకు, ఒక పాఠకుడికి ప్రేమ, హారర్, థ్రిల్లర్ లేదా ఫ్యామిలీ డ్రామా కథలు చదవడం ఇష్టమైతే, వారికి అలాంటి జోనర్‌లకు (genres) సంబంధించిన మరిన్ని కథలు కనిపిస్తాయి.

  2. 2

    చదివే విధానం

    పాఠకులు కథలతో ఎంతగా మమేకమవుతున్నారో కూడా ఈ వ్యవస్థ గమనిస్తుంది. అంటే, వారు కథను ఎంతవరకు చదువుతున్నారు, కథను చదవడం కొనసాగిస్తున్నారా లేదా & ఒకే రకమైన కథల కోసం ఎంత తరచుగా తిరిగి వస్తున్నారు వంటి విషయాలు ఇందులో ఉంటాయి.

  3. 3

    ఒకేరకమైన కథలు

    పాఠకులకు ఇదివరకే నచ్చిన కథలను పోలిన మరికొన్ని కథలు వారికి సూచించబడతాయి. ఇది ఆ కథల యొక్క జోనర్, థీమ్, కథా శైలి, చదివే సమయం లేదా రచయిత రకంపై ఆధారంగా ఉండవచ్చు.

  4. 4

    పాపులర్ & ట్రెండింగ్ కథలు

    పాఠకుల నుండి ఎక్కువ ఆదరణ పొందుతున్న కథలు మరింత మందికి సూచించబడతాయి. మంచి వ్యూస్, సమీక్షలు, రేటింగ్‌లు & పాఠకులు ఎక్కువగా చదివి, స్పందించిన కథలు ఈ జాబితాలోకి వస్తాయి.

  5. 5

    మీ అభిరుచులకు తగ్గ హోమ్‌పేజీ

    ప్రతి పాఠకుడికి వారి ఆసక్తులకు అనుగుణంగా వేర్వేరు హోమ్‌పేజీలు కనిపిస్తాయి. ఇది పాఠకులు తమ అభిరుచులకు & చదివే అలవాట్లకు సరిపోయే కథలను చాలా సులభంగా కనుగొనడంలో సహాయపడుతుంది.

  6. 6

    నిరంతర అభ్యాసం

    ఈ రికమండేషన్ సిస్టమ్ పాఠకుల చర్యల ఆధారంగా నిరంతరం నేర్చుకుంటూ ఉంటుంది. పాఠకులు కొన్ని కథలను ఎక్కువగా చదివినప్పుడు లేదా వాటికి మంచి స్పందన ఇచ్చినప్పుడు, కాలక్రమేణా వారి అభిరుచులను మరింత బాగా అర్థం చేసుకుని, వారికి నచ్చే కథలను సూచిస్తుంది.

  7. 7

    ముగింపు సందేశం

    ప్రతిలిపి యొక్క రికమండేషన్ సిస్టమ్ పాఠకులకు తాము ఎంతగానో ఇష్టపడే కథలను సులభంగా చేరవేయడానికే రూపొందించబడింది. కాబట్టి రచయితలు అర్థం చేసుకోవాల్సింది: అద్భుతమైన కథావిధానం, క్రమం తప్పకుండా అప్‌డేట్స్ ఇవ్వడం, పాఠకులతో మంచి అనుబంధం కలిగి ఉండటం & ఒక నిర్దిష్టమైన జోనర్‌పై దృష్టిపెట్టడం ద్వారా మీ కథ సరైన పాఠకులను చేరుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? మరింత మంది పాఠకులను పొందడంలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు