గౌరవనీయులైన రచయిత గారికి,
పాఠకులు మీ కథను చివరి వరకు చదువుతారా లేదా అని నిర్ణయించడంలో మొదటి 10 భాగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ భాగాలను పాఠకులకు మరింత ఆసక్తికరంగా మార్చడానికి, మీరు ఈ క్రింది చిట్కాలను పాటించవచ్చు.
- 1
మొదటి 10 భాగాలను ఉత్కంఠభరితంగా మార్చండి.
మొదటి 10 భాగాలలో నాటకీయ & ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. చదువుతున్నప్పుడు ఒక భాగం తర్వాత మరొక భాగాన్ని వెంటనే చదివేయాలనే అనుభూతి పాఠకులలో కలగాలి.
- 2
ప్రధాన పాత్రలపైనే దృష్టిపెట్టండి.
కథలోని ముఖ్యమైన సన్నివేశాలు & ఉపకథలు అన్నీ ప్రధాన పాత్రల చుట్టూనే తిరగాలి. ఇది పాఠకులు వారి ప్రయాణానికి & వారి పాత్రల ఎదుగుదలకు మరింత బాగా మమేకం అవ్వడానికి సహాయపడుతుంది.
- 3
ముఖ్యమైన పరిచయాలను/సన్నివేశాలను మొదట్లోనే చూపించండి.
ప్రధాన పాత్రలు ఒకరినొకరు కలుసుకునే బలమైన సన్నివేశాలపై దృష్టిపెట్టండి. వారి మధ్య జరిగే ముఖ్యమైన సంభాషణలు, ఘర్షణలు & ఎమోషనల్ సీన్స్ పాఠకులను కథకు కట్టిపడేస్తాయి.
- 4
అనవసరమైన వర్ణనలను పక్కన పెట్టండి.
కథను ముందుకు తీసుకెళ్లని అనవసరమైన వివరాల కోసం ఎక్కువ సమయాన్ని వృథా చేయకండి. మితిమీరిన వర్ణనల వల్ల కథా గమనం నెమ్మదించి, పాఠకులు కథపై ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.
- 5
ప్రతి ఉపకథను ప్రధాన కథతో ముడిపెట్టండి.
మొదటి 10 భాగాలలో మీరు పరిచయం చేసే ఏ ఉపకథ అయినా సరే, అది ప్రధాన కథను ముందుకు నడిపించడానికి సహాయపడేలా ఉండాలి. మీరు రాసే ప్రతి సీన్ కథాంశానికి లేదా ప్రధాన పాత్రలకు ఎంతో కొంత విలువను జోడించేలా ఉండాలి.
- 6
చిన్న చిన్న పాత్రల ఉపకథలను నివారించండి.
కథ ఆరంభంలో ద్వితీయ శ్రేణి లేదా చిన్న చిన్న పాత్రలపై మరీ ఎక్కువ దృష్టిపెట్టకండి. ఒకవేళ వారి ఉపకథలు ప్రధాన కథపై ఎటువంటి ప్రభావం చూపించకపోతే, అవి పాఠకుల దృష్టిని మళ్లించే అవకాశం ఉంది.
- 7
ముగింపు సందేశం
ఈ చిట్కాలను ఉపయోగించుకుని మీ సిరీస్ యొక్క మొదటి 10 భాగాలను చక్కగా రూపొందించండి. ఇది మరింత మంది పాఠకులను ఆకట్టుకోవడానికి & మీ కథ యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
గుర్తుంచుకోండి: మా రికమండేషన్ సిస్టమ్‌లో చోటు సంపాదించుకోవడానికి మీ రచనలను క్రమం తప్పకుండా ప్రచురించండి.
సంతోషంగా రాయండి!
— ప్రతిలిపి బృందం
