pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles మెరుగైన కథా రచన

రచనను ఆఖరి వరకు చదివించే కొన్ని సాధారణ చిట్కాలు

గౌరవనీయులైన రచయిత గారికి,

రచనలో ఉపయోగించే కొన్ని సులభమైన చిట్కాలు మీ కథను మరింత ఆసక్తికరంగా, ఎప్పటికీ గుర్తిండిపోయేలా మార్చగలవు. ఈ చిట్కాలు పాఠకులు మీ కథను మరింతగా ఇష్టంగా చదవడానికి & ఆఖరి వరకు చదివేలా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.

  1. 1

    పాత పాత్రలను మళ్లీ తీసుకురండి.

    మీ పాత కథలలోని ఒక పాపులర్ పాత్రను మీ కొత్త కథలోకి తీసుకురండి. తమకు బాగా తెలిసిన పాత్ర మళ్లీ కనిపించగానే పాఠకులు ఎంతో సంతోషిస్తారు.

  2. 2

    చిన్న చిన్న నిర్ణయాల ప్రాధాన్యతను చూపించండి.

    ఒక చిన్న నిర్ణయం తర్వాత ఎంతటి పెద్ద సమస్యలకు లేదా పెద్ద మార్పులకు దారితీస్తుందో చూపించండి. ఇది కథలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా పాఠకులు ఎంతో ముఖ్యమైనదిగా భావించేలా చేస్తుంది.

  3. 3

    చిన్న చిన్న హింట్స్ జోడించండి.

    మీ రెగ్యులర్ పాఠకులకు మాత్రమే అర్థమయ్యేలా కథలో కొన్ని చిన్న చిన్న రహస్య హింట్స్ లేదా సూచనలను ఉంచండి. ఇది మీ నమ్మకమైన పాఠకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది & వారు మీ కథలకు మరింతగా మమేకం అవుతారు.

  4. 4

    కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేయండి.

    మీ పాత్రలను ఎంతటి క్లిష్ట పరిస్థితిలో పడేయాలంటే.. అక్కడ వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కష్టంగానే ఉండాలి. ఇది చదివేటప్పుడు పాఠకులను “ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేసేవాడిని?” అని ఆలోచించేలా చేస్తుంది.

  5. 5

    భావోద్వేగాలను నెమ్మదిగా పండించండి.

    ప్రేమ, భావోద్వేగాలు, గొడవలు లేదా బంధాలు ఏవైనా సరే.. అవి కథలో నెమ్మదిగా పెరిగేలా చూడండి. కొన్ని రకాల ఫీలింగ్స్ మెరుగవడానికి కొంత సమయం పట్టినప్పుడే అవి మరింత బలంగా మారుతాయి.

  6. 6

    ఊహించని మార్పులను చూపించండి.

    మీ పాత్రలలో వచ్చే మార్పులను ఎవరూ ఊహించని విధంగా, అదే సమయంలో నమ్మశక్యంగా ఉండేలా చూపించండి. ఉదాహరణకు, ఎప్పుడూ ధైర్యంగా ఉండే పాత్ర తన బలహీనతను చూపించడం లేదా ఎప్పుడూ మౌనంగా ఉండే పాత్ర మాట్లాడటం వంటి మార్పులు పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి.

  7. 7

    ప్రతి భాగాన్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టండి.

    ఒక భాగం ముగిసినప్పుడు అది తర్వాతి భాగానికి స్పష్టమైన దారి చూపేలా చూసుకోండి. కథా గమనం బాగున్నప్పుడు, పాఠకులు “ఇంకొక్క భాగం చదివేద్దాం” అనుకుంటూ ముందుకు సాగిపోతారు.

  8. 8

    రహస్యాలను సరైన సమయంలోనే బహిర్గతం చేయండి.

    కథలోని రహస్యాలన్నింటినీ మొదట్లోనే చెప్పేయకండి. పాఠకులలో ఎప్పుడూ కుతూహలం తగ్గకుండా ఉండాలంటే, ముఖ్యమైన విషయాలను సరైన సమయంలో మాత్రమే బయటపెట్టండి.

  9. 9

    పాత్రల ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనింపజేయండి.

    కథలో ఇంతకుముందు జరిగిన లాంటి సన్నివేశాన్నే మళ్లీ చూపించండి. కానీ ఈసారి, ఆ పాత్రలో వచ్చిన మార్పు కారణంగా అది ఎంత విభిన్నంగా స్పందించిందో ప్రత్యేకంగా చూపించడం.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? మెరుగైన కథా రచనలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు