pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles సంపాదన & భద్రత

సురక్షితంగా రాయడం: ప్రతి రచయిత తప్పక తెలుసుకోవలసిన రచనల మార్గదర్శకాలు

గౌరవనీయులైన రచయిత గారికి,

మీరు రాసే రచనలు విభిన్న వయస్సులు, నేపథ్యాలు & రకరకాల అనుభవాలు ఉన్న పాఠకులను చేరుకుంటాయి. బాధ్యతాయుతంగా రాయడం వల్ల పాఠకులకు సురక్షితమైన పఠన వాతావరణం లభించడమే కాకుండా... మీ రచనలు, ప్రొఫైల్ విజిబిలిటీ & మీ సంపాదన కూడా సురక్షితంగా ఉంటాయి.

ప్రతి రచయితా తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి.

  1. 1

    ఎలాంటి రచనలు అనుమతించబడతాయో అర్థం చేసుకోండి.

    ప్రతిలిపిలో ప్రేమ, డ్రామా, థ్రిల్లర్స్, హారర్, ఎమోషనల్ జర్నీలు, సామాజిక సమస్యలు & పాత్రల ఆధారిత కథలతో సహా ఎన్నో రకాల శైలులు (genres) & థీమ్స్ రాయడానికి అవకాశం ఉంది. రచయితలు క్లిష్టమైన భావోద్వేగాలను & అర్ధవంతమైన అనుభవాలను తమ కథలలో చూపించవచ్చు, కానీ వాటిని ప్రెజెంట్ చేసేటప్పుడు ఆచితూచి, ఆలోచనాత్మకంగా & గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవాలి.

  2. 2

    ఎలాంటి రచనల వల్ల సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

    కొన్ని రకాల రచనలు ప్లాట్‌ఫారమ్ పాలసీలను ఉల్లంఘించే అవకాశం ఉంది. దీనివల్ల మీ కథలపై ఆంక్షలు విధించబడటం లేదా వాటిని ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయడం (takedowns) జరగవచ్చు. అతిగా చూపించే శృంగార రచనలు, ఘోరమైన హింస, ఆత్మహత్యలను ప్రోత్సహించేలా రాయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, వేధింపులు, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం & అసభ్యకరమైన కవర్ ఫోటోలు వంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల మీ కథలు & మీ రచయిత ప్రొఫైల్ రెండూ సురక్షితంగా ఉంటాయి.

  3. 3

    సున్నితమైన థీమ్స్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి.

    కథను చెప్పడంలో మెచ్యూర్ థీమ్స్ కూడా ఒక ముఖ్యమైన భాగం కావచ్చు, కానీ వాటిని మీరు ఎలా రాస్తున్నారన్నది చాలా ముఖ్యం. హింస లేదా శృంగారానికి సంబంధించిన వివరాలను విడమర్చి రాయడానికి బదులుగా... పాత్రల భావోద్వేగాలు, వాటి పర్యవసానాలు, పాత్రల ఎదుగుదల & రికవరీ పై దృష్టి పెట్టండి. ఎందుకంటే పాఠకులు అసభ్యకరమైన లేదా ఘోరమైన వివరాల కంటే, కథలోని భావోద్వేగ ప్రభావంతోనే పాఠకులు ఎక్కువగా మమేకమవుతారు.

  4. 4

    వయస్సు ఆధారంగా ఉండే పరిమితులను అర్థం చేసుకోండి.

    కథకు "18+" లేబుల్ లేదా కంటెంట్ వార్నింగ్ జోడించినంత మాత్రాన, నిషిద్ధమైన కంటెంట్‌ను రాయడం సరైనది కాదు. వయస్సు ఆధారంగా ఉండే పరిమితులను అనేవి పాఠకులకు సమాచారం అందించడం కోసమే రూపొందించబడ్డాయి తప్ప, అవి ప్లాట్‌ఫారమ్ పాలసీలను అధిగమించలేవు. మీరు ఎలాంటి వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ, కథలు మాత్రం ఖచ్చితంగా రచనల మార్గదర్శకాలను పాటించాల్సిందే.

  5. 5

    రిస్క్ లేకుండా రాయండి.

    చాలా వరకు పాలసీ ఉల్లంఘనలు తెలియకుండానే జరుగుతుంటాయి. గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం, అసభ్యకరమైన వర్ణనలకు దూరంగా ఉండటం, రోమాన్స్‌ను ఎమోషనల్ డెప్త్‌తో రాయడం & మంచి కవర్ ఫోటోలను ఎంచుకోవడం ద్వారా రచనకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించవచ్చు. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే తర్వాత వచ్చే పెద్ద పెద్ద సమస్యలను నివారిస్తాయి.

  6. 6

    మీ రచనలను & ప్రొఫైల్‌ను కాపాడుకోండి.

    ఒక బలమైన రచయిత ప్రొఫైల్ అనేది రాత్రికి రాత్రే రాదు, దానికి ఎంతో సమయం పడుతుంది. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ రచనలను బ్యాకప్ చేసి పెట్టుకోండి, కామెంట్‌లు లేదా పోస్ట్‌లలో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి & ఏదైనా సమస్యాత్మకమైన రచన కనిపిస్తే దాంతో వాదించకుండా రిపోర్ట్ చేయండి. ప్లాట్‌ఫారమ్‌పై పాజిటివ్‌గా ఉండటం వల్ల జీవితకాలంలో మీ అభివృద్ధికి ఎంతో మద్దతు లభిస్తుంది.

  7. 7

    టేక్‌డౌన్స్ జరగకుండా ముందే జాగ్రత్తపడండి.

    రచనల రివ్యూల వల్ల ఒక్కోసారి మీ కథల విజిబిలిటీ & పాఠకుల ఎంగేజ్‌మెంట్ ప్రభావితం కావచ్చు. అందుకే మీ పాత భాగాలు, వివరణలు & కవర్ ఫోటోలు పాలసీలకు లోబడి ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటే వాటిని ముందే సరిదిద్దడం వల్ల ఎలాంటి ఆటంకాలు కలగవు, పైగా మీ పాఠకుల సంఖ్య కూడా తగ్గకుండా ఉంటుంది.

  8. 8

    ముగింపు సందేశం

    బాధ్యతాయుతంగా రాయడం వల్ల మీ సృజనాత్మకత ఏమాత్రం తగ్గిపోదు. బదులుగా, ఇది మీ కథలు ఎక్కువమంది పాఠకులను చేరుకోవడానికి, ఎక్కువ కాలం ప్లాట్‌ఫారమ్‌పై కనిపించడానికి & ప్లాట్‌ఫారమ్‌లో మీ రచయిత ప్రయాణం విజయవంతంగా సాగడానికి సహాయపడుతుంది. సురక్షితమైన & ఆలోచనాత్మకమైన కథలను రాయడం ద్వారా, మీరు మీ పాఠకులను & రచయితగా మీ భవిష్యత్తు ఎదుగుదలను రెండింటినీ కాపాడుకోగలరు.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? సంపాదన & భద్రతలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు