ప్రచురణ కొరకు గైడ్

1.ప్రతిలిపిలో ఎవరు ప్రచురించవచ్చు?

వ్రాయడం ఇష్టమున్నవారు ఎవరైనా సరే వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తు మీ సొంత రచనలు ప్రతిలిపిలో స్వీయప్రచురణ చేయవచ్చు.కథ,కవిత,వ్యాసం ఏదైనా సరే స్వీయప్రచురణ చేయవచ్చు.ప్రతిలిపిలో రచనలు వ్రాయడానికి పెద్ద పెద్ద రచయితలు కానవసరం లేదు ఎవరైనా స్వీయప్రచురణ చేయవచ్చు.

2.ప్రతిలిపిలో ఎలా స్వీయప్రచురణ చేయాలి?

ప్రతిలిపి యాప్ ఓపెన్ చేయగానే కింద పెన్ సింబల్ కనపడుతుంది దానిపై క్లిక్ చేయండి. తర్వత “కొత్త రచన వ్రాయండి” అనే దానిపై క్లిక్ చేయండి.

“మీ రచన ఇక్కడ రాయండి” అని చూపిస్తున్న చోట తెలుగు టైపింగ్ కీబోర్డు సహాయంతో మీ రచనను టైపు చేయండి.

రచన పూర్తి అవ్వగానే టాప్ రైట్ సైడ్ లో అప్లోడ్ బటన్ పై క్లిక్ చేసి రచనను అప్లోడ్ చేయవచ్చు లేదా రచన సేవ్ చేయడానికి టాప్ రైట్ సైడ్ లో నిలువు చుక్కలపై క్లిక్ చేసి సేవ్ చేయండి.అప్పుడు రచన డ్రాఫ్ట్స్ లోకి వెళుతుంది.

3.మీ రచనను ఎలా ప్రచురణ చేయాలి?

         I.   వ్రాయడం పూర్తి అవ్వగానే టాప్ రైట్ సైడ్ లో ఉన్న అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.

         II.  మీ రచన యొక్క శీర్షిక వ్రాయండి. శీర్షిక ఆంగ్లంలో మరియు సంగ్రహం తప్పనిసరి కాదు.

         III. “తరువాత“ పై క్లిక్ చేసి మీ రచనకు తగిన ఫోటోను జత చేయండి. దయచేసి ఫోటో మీ సొంతమై ఉండాలి లేదా పబ్లిక్ డొమైన్ ఫోటోలు మాత్రం

               తీసుకోగలరు దాని కొరకు (http://pixabay.com) వెబ్సైటు ను సందర్శించగలరు. గూగుల్ నుండి తీసుకోకండి కాపీ హక్కుల సమస్య వస్తాయి.

         IV.  చివరిగా రచనకు తగిన విభాగం మరియు వర్గాన్ని ఎంచుకొని కాపి పాలసీని అంగీకరించి ప్రచురణ చేయండి అనే బటన్ పై క్లిక్ చేస్తే మీ రచన ప్రచురణ అవుతుంది.

4. ఇప్పుడు మీరు ప్రతిలిపిలో ధారావాహికలను ప్రచురించవచ్చు.

1.మీరు ఇప్పటికే ధారావాహిక భాగాలను విడిగా ప్రచురించినట్లయితే భాగాలన్నింటినీ కలిపి ఒకే ధారావాహికగా సృష్టించవచ్చు.

2. ఇప్పటికే మీ ప్రొఫైల్ లో ఉన్న ధారావాహిక యొక్క తరువాతి భాగాన్ని ప్రచురిస్తుంటే, భాగాన్ని నేరుగా ధారావాహికలో చేర్చవచ్చు.

3.మీరు క్రొత్త ధారావాహిక యొక్క మొదటి భాగాన్ని వ్రాస్తుంటే క్రొత్త ధారావాహికను సృష్టించవచ్చు.

5.మీ రచనలు ఎక్కడ చూసుకోవచ్చు?

ప్రతిలిపి మొబైల్ యాప్ లో మీ రచనలు వివిధ ప్రదేశాలలో కనపడుతాయి.

         I.    పెన్ సింబల్ పై క్లిక్ చేస్తే ప్రచురణ అయినవి మరియు డ్రాఫ్ట్స్ లో ఉన్న రచనలు రెండు కనపడుతాయి.

         II.   మీ ప్రొఫైల్ లో ప్రచురనైన రచనలు కనపడుతాయి.

6.ప్రచురణ చేయడంలో సమస్యలు ఉంటే?

సాంకేతిక కారణాల వల్ల స్వీయ ప్రచురణ చేయడంలో పదే పదే విఫలమౌతున్న, సందేహాలున్న telugu@pratilipi.com మెయిల్ చేయండి.