pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

Scheduling Support

1. ‘షెడ్యూలింగ్’ అంటే ఏమిటి?

A. ఇప్పుడు మీరు మీ ‘సిరీస్ భాగాలను’ ఆటోమేటిక్ గా ప్రచురించడానికి తరువాతి తేదీలను షెడ్యూల్ చేయవచ్చు.

2. సిరీస్ యొక్క తరువాతి భాగాన్ని ఎలా షెడ్యూల్ చేయాలి?

A. మీ సిరీస్ డ్రాఫ్ట్ విభాగంలో, వ్యక్తిగత డ్రాఫ్ట్స్ పై ‘షెడ్యూల్ ప్రచురణ’ చూడవచ్చు. మీరు దానిపై క్లిక్ చేసి, తరువాత సమయంలో ప్రచురించడానికి తేదీ మరియు సమయాన్ని ఎంచుకోవచ్చు.

3. సిరీస్ కాని రచనల డ్రాఫ్ట్స్ లను కూడా షెడ్యూల్ చేయవచ్చా?

A. లేదు, మీరు ఈ ఫీచర్ ని సిరీస్ (భాగాలున్న రచనల) కోసం మాత్రమే ఉపయోగించగలరు మరియు ఒకే భాగం కంటెంట్ కోసం మీరు ఈ ఫీచర్ ను ఉపయోగించలేరు.

4. నేను షెడ్యూల్ నుండి సిరీస్ భాగాన్ని తొలగించవచ్చా?

A. అవును, మీరు ఎప్పుడైనా షెడ్యూల్ను తొలగించవచ్చు.

5. నేను షెడ్యూల్ చేసిన తేదీ మరియు సమయాన్ని మార్చవచ్చా?

A. అవును, షెడ్యూలింగ్ సమయాన్ని అప్ డేట్ పై క్లిక్ చేయడం ద్వారా మీ షెడ్యూల్ యొక్క తేదీ మరియు సమయాన్ని మార్చవచ్చు.

6. షెడ్యూల్ చేయబడినప్పుడు సిరీస్ భాగాన్ని సవరించవచ్చా?

A. ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నప్పుడు షెడ్యూల్ చేసిన సమయానికి 30 నిమిషాల ముందు షెడ్యూల్ చేసిన భాగాలను సవరించవచ్చు. మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఇంటర్నెట్ లేకుండా షెడ్యూల్ చేసిన భాగాన్ని సవరించలేరు.

7. లాక్ అవుట్ వ్యవధి యొక్క చివరి 30 నిమిషంలో డ్రాఫ్ట్ ని సవరించాలనుకుంటే ఏమి చేయాలి?

A. మీరు తరువాతి సమయం కోసం షెడ్యూల్ సమయాన్ని మార్చవచ్చు లేదా మీరు షెడ్యూల్ నుండి భాగాన్ని తీసివేసి, ఆపై ఎడిటింగ్ మార్పులు చేసి, ఆపై మళ్లీ షెడ్యూల్ చేయవచ్చు.

8. ఏదైనా సిరీస్‌లో నేను ఎన్ని భాగాలను షెడ్యూల్ చేయవచ్చు?

A. పరిమితి లేదు. తరువాతి దశలో ప్రచురించడానికి మీరు ముందుగానే చాలా భాగాలను షెడ్యూల్ చేయవచ్చు.

9. షెడ్యూల్ చేసిన సమయానికి ముందే నేను షెడ్యూల్ చేసిన భాగాన్ని ప్రచురిస్తే ఏమి జరుగుతుంది?

A. ఏమీ కాదు, సిరీస్ భాగం ప్రచురించబడుతుంది.

10. నేను ఒకే రోజులో ఒకటి కంటే ఎక్కువ భాగాలను షెడ్యూల్ చేయవచ్చా?

A. అవును, మీరు చెయ్యవచ్చు.

11. నేను నా ఫోన్‌కు దూరంగా ఉంటే షెడ్యూల్ పని చేస్తుందా?

A. అవును, అది అవుతుంది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పటికీ, అది పని చేస్తుంది.

12. ఫీచర్ పని చేయడానికి నేను ప్రతిలిపి యాప్ ని తెరవాలా?

A. లేదు, మీరు చేయనవసరం లేదు.

13. సిరీస్ భాగాలను నేను ఎంతవరకు షెడ్యూల్ చేయగలను?

A. మీరు రాబోయే ఆరు నెలలు మీ సిరీస్ భాగాలను షెడ్యూల్ చేయవచ్చు.