pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మానస ఎటు వెళ్ళింది ?

4.3
14479

రచన: అంగులూరిఅంజనీదేవి పంతొమ్మిది ఏండ్ల మానసకు డిగ్రీ పూర్తి కాకుండానే పెళ్లి చేసాడు ఆమె తండ్రి కోదండపాణి. ఇంద్రధనసును కనురెప్పల మధ్యన నిలుపుకుని అత్తారింటికి వెళ్ళింది మానస. ఆమె భర్త పేరు ...

చదవండి
సున్నితపు త్రాసు...
కథ యొక్క తదుపరి భాగాన్ని ఇక్కడ చదవండి సున్నితపు త్రాసు...
అంగులూరి అంజనీదేవి
4.5

సున్నితపు త్రాసు (కథ)             రచన:శ్రీమతి అంగులూరి అంజనీదేవి ''స్వప్నా. నా ఫ్రెండ్ ముందు నువ్వలా మాట్లాడటం నాకు నచ్చ లేదు. వాడు చాలా సున్నితం. తను నమ్మినదాన్ని వేరెవరైనా కాదని వాదిస్తే వెంటనే ...

రచయిత గురించి
author
అంగులూరి అంజనీదేవి

వరంగల్ జల్లా హనుమకొండలో నివాసం ఉంటున్న శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు ప్రముఖ రచయిత్రిగా సుపరిచితులు. మామిడేల రాఘవయ్య గారు, వెంకటసుబ్బమ్మ గారి ఏకైక పుత్రిక. కందుకూరు T.R.R గవర్నమెంట్ కాలేజీ లో బి.ఏ తెలుగు చదివారు. భర్త అంగులూరి ఆంజనేయులు. బ్యాంక్ ఎంప్లాయ్. వీరికి ముగ్గురు అబ్బాయిలు. ఈమె గురించి ఈమె మాటల్లోనే తెలుసుకుందాం. నా పూర్వజన్మ సుకృతం వల్లనో ఏమో నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పటి నుండే చందమామ కథలు చదువుతూ కథల మీద ఆసక్తి ని పెంచుకున్నాను. ఏం రాయాలో తెలియకపోయినా ఏదో ఒకటి రాయాలన్న తపన పెరిగింది. అలా రాస్తూ రాస్తూ కథ ఎలా రాయాలో నేర్చుకున్నాను. ఏది రాసినా మానవసంబంధాలను దృష్టిలో పెట్టుకుని, సమాజ ప్రయోజనాన్ని ఆశించి రాస్తాను. రాస్తున్న ప్రతి వాక్యంలో అర్ధం, పరమార్ధం ఉండేలా చూసుకుంటాను. ఇంటర్లో ఉన్నప్పుడే మూడు కథలు, ఒక నవల రాసాను. అవి ప్రగతి వార పత్రికలో అచ్చయ్యాయి. నా మొదటి నవల పేరు "మధురిమ" పెళ్లి తర్వాత నాకు సమయం తక్కువగా ఉండడం వల్ల చిన్న, చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. దాని వల్ల ప్రముఖ కవులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సాహిత్య పత్రికల్లో నా కవితలు అచ్చయ్యాయి. ఆ కవితలన్నీ 'గుండె లోంచి అరుణోదయం' పేరుతో కవితా సంపుటిగా వచ్చింది. ఆ కవితా సంపుటికి ఉమ్మెత్తల సాహితీ అవార్డు వచ్చింది. ఆకాశవాణి కడప, వరంగల్ రేడియో కేంద్రాలలో నా కవితలను, కధానికలను వినిపించాను. కవితలు రాస్తూనే కథలు రాశాను. ఆ కథలు కొన్ని ప్రముఖ వార పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ కథలన్నీ 'జీవితం అంటే కథ కాదు' అనే కథల సంపుటిగా వచ్చాయి. ఆ తరువాత పరిస్థితులు అనుకూలించక కొద్ధి రోజులు రాయడం ఆపాను. ఎక్కువ రోజులు రాయకుండా ఉండలేక తిరిగి రాయడం మొదలు పెట్టాను. 'నీకు నేనున్నా' నవలతో మొదలైన నా నవలా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 23 కి పైనే నవలలు రాశాను. ఆ నవలల పేర్లు: 1) నీకు నేనున్నా ... (డైరెక్ట్ నవల) 2) మౌన రాగం (నవ్య వీక్లి సీరియల్) 3) ఈ దారి మనసైనది (స్వాతి వీక్లి సీరియల్) 4) రెండో జీవితం (స్వాతి వీక్లి సీరియల్) 5) ఎనిమిదో అడుగు (డైరెక్ట్ నవల) 6) ఆమె అతడిని మార్చుకుంది (డైరెక్ట్ నవల) 7) ఇలా ఎందరున్నారు..? (డైరెక్ట్ నవల) 8) ఆరాధ్య (డైరెక్ట్ నవల) 9) జ్ఞాపకం (సాహితి ప్రచురణ) 10) జీవితం ఇలా కూడా వుంటుందా..? (డైరెక్ట్ నవల) 11) ఒక చిన్న అబద్దం (తెలుగు తేజం మంత్లీ లో సీరియల్ గా వచ్చింది) 12) ఉద్వేగ (సుకధ.కాం ప్రతిలిపి.కాం సైట్ లో పబ్లిష్) 13) అందమైన మనసు (సంచికా.కాం వెబ్ మాగజైన్ లో సీరియల్ గా వచ్చింది) 14) ఈ రోజుల్లో ఒక అమ్మాయి (విశాలాక్షి మంత్లీ లో ధారావాహిక గా వచ్చింది) 15) నీ జీవితాన్ని నువ్వే మార్చుకో (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 16) అందుకే ఇలా (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 17) నీకు తెలుసా నాకేం కావాలో (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో బహుమతి పొందిన నవల) 18) ఆహ్లాద (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 19) నాకు తెలిసింది ఇదే (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో బహుమతి పొంది ప్రచురణ అయిన నవల) 20) అడుగులో అడుగునై వస్తా (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 21) చిరుజల్లై రానా (ప్రతిలిపి.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 22) అయినా అవసరమే (కహానియా.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 23) నా జీవితం నా ఇష్టం... (కహానియా.కాం వెబ్ సైట్ లో పబ్లిష్) 24) ది సైలెంట్ మెలోడి ( ఇంగ్లీష్ నవల ) నీకు నేనున్నా, మౌనరాగం నవలలు కన్నడ భాష లోకి అనువాదం అయ్యాయి. నా నవలలు కొన్ని ప్రముఖ వార పత్రికలలో, ప్రముఖ ఆన్లైన్ మ్యాగజైన్లలో సీరియల్స్ గా వచ్చాయి. ప్రతిలిపి.కాం వెబ్సైట్ లో అన్ని నవలలు వున్నాయి. యూట్యూబ్ చానల్స్ లో కొన్ని నవలలు ఆడియోస్ గా వచ్చాయి. నా పేరును గూగుల్ లో సర్చ్ చేసి నా నవలలను చదవచ్చు. వినొచ్చు. నా శ్రమను, సమర్ధతను గుర్తించి నాకు కొన్ని పురస్కారాలు వచ్చాయి. వాటిలో కొన్ని పురస్కారాల పేర్లు :- 1) ఉమ్మెత్తల సాహితి పురష్కారం. 2) యద్దనపూడి మాతృ మూర్తి నవలా పురష్కారం. 3) జాతీయ పురష్కారం. 4) హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ అవార్డ్. 5) భారత మహిళా శిరోమణి అవార్డ్. (నా రచనలు ఎక్కడ ఉన్నా కాపీ చెయ్యొద్దు ప్లీజ్) ******

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    VIJAYA DURGA BAVANDLA
    05 ফেব্রুয়ারি 2019
    కధ చాలా బాగుంది .తప్పో ,ఒప్పో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు.మనోజ్ తిరిగి వెళ్లటం నాకు నచ్చలేదు .దానికన్నా శాలిని తన తప్పు తెలుసుకొని మనోజ్ కోసం వస్తే బాగుండేది.ఇక మానస తను తీసుకున్న నిర్ణయం మంచిదే.భార్యని స్పందన లేని ఒక యంత్రంగా చూసే రాంబాబు లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి.
  • author
    kashiviswanadham kolaganti
    14 ফেব্রুয়ারি 2018
    ముగింపు అర్థ వంతం గా లేదు
  • author
    15 মার্চ 2019
    అద్భుతం! మన భారతీయ సంస్కృతిలో భర్త ఉద్యోగం చేయడం భార్య గృహిణిగా ఇంటి పనులు చేయడం ఒక సంప్రదాయం. కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో భార్య ఉద్యోగస్తురాలై భర్త నిరుద్యోగి అయితే అతడు ఇంటి పనులు చేయడంలో తప్పు లేదు. భార్యాభర్తలన్నాక పనులు పంచుకొని అన్యోన్యంగా ఉండాలి. పిల్లలకు తల్లి దండ్రుల ప్రేమను అందించాలి. ఒంటెద్దు పోకడగా ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రవర్తించినా అది సదరు వ్యక్తి తప్పే అవుతుంది.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    VIJAYA DURGA BAVANDLA
    05 ফেব্রুয়ারি 2019
    కధ చాలా బాగుంది .తప్పో ,ఒప్పో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు.మనోజ్ తిరిగి వెళ్లటం నాకు నచ్చలేదు .దానికన్నా శాలిని తన తప్పు తెలుసుకొని మనోజ్ కోసం వస్తే బాగుండేది.ఇక మానస తను తీసుకున్న నిర్ణయం మంచిదే.భార్యని స్పందన లేని ఒక యంత్రంగా చూసే రాంబాబు లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి.
  • author
    kashiviswanadham kolaganti
    14 ফেব্রুয়ারি 2018
    ముగింపు అర్థ వంతం గా లేదు
  • author
    15 মার্চ 2019
    అద్భుతం! మన భారతీయ సంస్కృతిలో భర్త ఉద్యోగం చేయడం భార్య గృహిణిగా ఇంటి పనులు చేయడం ఒక సంప్రదాయం. కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో భార్య ఉద్యోగస్తురాలై భర్త నిరుద్యోగి అయితే అతడు ఇంటి పనులు చేయడంలో తప్పు లేదు. భార్యాభర్తలన్నాక పనులు పంచుకొని అన్యోన్యంగా ఉండాలి. పిల్లలకు తల్లి దండ్రుల ప్రేమను అందించాలి. ఒంటెద్దు పోకడగా ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రవర్తించినా అది సదరు వ్యక్తి తప్పే అవుతుంది.