నాగురించి:-నా పేరు అంబడిపూడి శ్యామసుందర రావు ,:M.A,M.Sc,M.Ed,నాపుట్టిన తేదీ 13/01/1950. నేను గుంటూరులో ఉపాద్యాయుడిగా ముప్పై సంవత్సరాలు పనిచేసి 2008లో పదవీ విరమణ చేశాను విద్యార్థి దశలో కాలేజీ మేగజైన్లకు చిన్న కధలు వ్రాసే వాడిని ఆతరువాత ఉద్యోగ సంసార బాధ్యతల వల్ల రచనలు చేయలేకపోయేవాడిని మొదటినుంచి పుస్తకాలు చదవటము హాబి అవటం వల్ల పుస్తకాల సేకరణ, చదివి స్నేహితులతో చర్చింటము చేసేవాడిని రిటైర్ అయినాక పూర్తిగా రచనా వ్యాసంగములోకి దిగాను మొదట బుజ్జాయి లాంటి పిల్లల మేగజైన్లకు కధలు వ్యాసాలు వ్రాసేవాడిని ఆ తరువాత అన్ లైన్ మేగజైన్ల విషయము తెలిసి వాటిని సిస్టములో చదువుతూ వాటి పట్ల అవగాహన పెంచుకున్నాను క్రమముగా వాటికి వ్యాసాలు కధలు వ్రాసి పంపటం మొదలుపెట్టాను ఇంటర్ నెట్ పుణ్యమా అని విషయసేకరణ సులభము అయింది కాబట్టి విషయాలను సేకరించి క్రోడీకరించి ఇప్పటి వరకు 336 వ్యాసాలు,ఆన్ లైన్ పత్రికలకు ,60 వ్యాసాలు ప్రింట్ పత్రికలకు వ్రాశాను తెలుగుతల్లి, గోతెలుగు.కామ్ మనందరి.కామ్ అచ్చంగాతెలుగు.కామ్,తెలుగుప్రతిలిపి.కామ్ మాలిక.కామ్ ఆఫ్ లైన్ పత్రికల వారు నా వ్యాసాలను ప్రచురిస్తూ నన్ను ప్రోత్సాహిస్తున్నారు గుంటూరు నుండి ప్రచురించబడే సంస్కృతి వైభవము,సత్య దర్శనము పత్రికలు ప్రతినెల నా వ్యాసాలను ప్రచురిస్తుంటాయి ముఖ్యముగా నేను వ్రాసే వ్యాసాలు నాలుగు రకాలు మొదటి రకము మనము మన ఆరోగ్యానికి సంబంధినవి అంటే మనము తినే కూరగాయలు వాటి ఆరోగ్య ప్రయోజనాలు, రెండవరకము పాత తరం కథా రచయితల కధల పరిచయాలు (తెలుగుతల్లి లో ప్రచురించబడేవి) మూడవ రకము ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు క్లుప్తముగా ,నాలుగవ రకము ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి.(నా రెండవ హాబీ వివిధ ప్రదేశాలను సందర్శించటము) పదవి విరమణ చేసినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాను భగవంతుడు అనుగ్రహించినంత కాలము పిల్లలకు పాఠాలు చెపుతూ, నేను తెలుసుకున్న విషయాలను ఆన్ లైన్ పత్రికల ద్వారా ఇతరులతో పంచుకుంటూ కాలము గడపటం నాకోరిక నన్ను ప్రోత్సాహిస్తున్న ఆన్ లైన్ పత్రికల వారికి చదివి నన్ను అభిమానిస్తున్న పాఠకులకు పత్రికా ముఖముగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్