మేం మా తరగతిగదిలోనే ఇంద్రధనుస్సును చూశాం. 'ఇంద్రధనుస్సును ఎక్కడైనా తరగతిలో చూస్తారా?!' అనే సందేహం. ఎందుకంటే.. అది చాలా సులభం. అదెలాగంటే ముందుగా మనం ఒక లోహపు పళ్లెం తీసుకొని దానిని నీటితో నింపాలి. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా ఒక సమతల దర్పణాన్ని నీటిలో ఉంచాలి. ఈ అమరికకు కొంచెం ఎత్తులో తెల్లటి కార్డుబోర్డు ఉంచాలి. నీటి గుండా అద్దంపై పడేలా తెల్లని కాంతిని ప్రసరింపజేయాలి. నీటి గుండా దర్పణంపై పడిన తెల్లని కాంతి వక్రీభవనం, విశ్లేషణ చెంది ఏడురంగులుగా విడిపోతుంది. అది ఎదురుగా గల కార్డుబోర్డుపై ...