మంచుపూల పల్లకిలా..ఉండాలని ఉంది..!
మరి రేపటి సూర్యునిలా..కదలాలని ఉంది..!
అక్షరాల వర్షానికి..మేఘమాల లేవొ..
చెలి నవ్వుల పాలపుంతలో..ఆడాలని ఉంది..!
ఏ రంగులు వాసనలూ..లేనిది కద ప్రేమ..
తన చూపుల అల్లికలో..నిలవాలని ఉంది..!
సంస్కారపు వెన్నెలలే..కర్మనిధిగ మిగులు..
గంధాలకు అతీతమై..బ్రతకాలని ఉంది..!