pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నన్ను క్షమించు

1419
4.6

" అమ్మా! తాతయ్యొచ్చాడు " బయట ఆడుకుంటున్న  నాలుగేళ్ళ పవన్ వింటి నుండి వెలువడిన బాణంలా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ అరిచాడు. ముందుగదిలో పేపర్ చదువుకుంటున్న శంకర్ కొడుకు అరుపుకి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. గేటు బయట రిక్షాలో ఉన్న చలపతి జేబులో నుండి పర్సు తీయడం చూసి పరుగు లాంటి నడకతో బయటకి వెళ్ళాడు.                " ఉండు నాన్నా! నేనిస్తాను" అంటూ జేబులో నుండి డబ్బు తీసి రిక్షా వాడికిచ్చాడు. " ఫోన్ చెయ్యలేదేం? బస్టాండ్ కి వచ్చేవాణ్ణిగా?" రిక్షా దిగడంలో తండ్రికి సాయం చేస్తూ అన్నాడు. ...